Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సాక్ష్యములను గూర్చిన అజ్ఞానమునకు మిషలేదు

    హెచ్చరిక, గద్దింపులు, సలహాతో కూడిన వెలుగు, జ్ఞానములుగల గ్రంథములను పఠించని హేతువుచే అనేకులు దేవుడు తన ప్రజలకిచ్చిన వెలుగునకు వ్యతిరేకముగా సంచరించుచున్నారు. లోకాసక్తి డంబాచారాసక్తి, మతశూన్యతలు దేవుడు కృపతో ననుగ్రహించిన వెలుగునుడి ప్రజల గమనమును త్రిప్పివేయుచున్నవి. అసత్యముతో నిండిన పుస్తకములు, పత్రికలు దేశము నలుదిక్కుల వ్యాపించెను. CChTel 209.3

    ఎల్లెడల నాస్తికత్వము, అవిశ్వాసము హెచ్చరిల్లుచున్నది. దైవ సింహాసనమునుండి వచ్చుచున్న ప్రశస్తమగు వెలుగు కుంచము క్రిద దాచబడుచున్నది. ఈ అలక్ష్యమునకు దేవుడు తన ప్రజలను లెక్క అడుగును. మన మార్గమందు ప్రకాశింప జేసిన ప్రతి కాంతి రేఖను దైవ విషయములయందు మన అభ్యున్నతి కొరకు వినియోగించితిమో, లేక మనకు నచ్చనందున విసర్జించితిమో, దేవునికి మనము ఆరా యియ్యవలసి యున్నాము. CChTel 209.4

    సబ్బాతు నాచరించు ప్రతి కుటుంబమునందు సాక్ష్యములు ప్రవేశించవలెను. వాని విలువ గ్రహించి పఠించ వలసినదిగా సహోదరులు హెచ్చరించబడవలెను. ఈ గ్రంథములను పరిమితముగా ముద్రించి సంఘమునకొక పరంపర చొప్పున ఇచ్చుటచాలదు. ఇవి ప్రతి కుటుంబ గ్రంథాలయమండును ఉండవలెను. ఇవి పఠించబడ వలెను. అనేకులు చదువుటకు వీలున్న తావునందు వీని నుంచవలెను. 75T 681;CChTel 209.5

    హెచ్చరిక, ప్రోత్సాహము, గద్దింపులతో కూడిన సాక్ష్యములయందు ప్రదర్శితమగుచున్న అవిశ్వాసము దైవ ప్రజల వెలుగును ప్రకాశింపనీయుటలేదని నాకు చూపబడెను. తమ నిజస్థితిని గ్రహించకుండ వారి కండ్లను అపనమ్మకము మూయుచున్నది. గద్దింపు ద్వారా దేవుని ఆత్మయొక్క సాక్ష్యము అవాంఛీతమనియు అది వారికి సంబంధించినది కాదనియు వారి పరిభావన. వారు ఆధ్యాత్మిక పరిజ్ఞానమునందు తమ కొరతను గుర్తించుటకుగాను, దైవ కృప, ఆత్మీయజ్ఞానములు వారికి అత్యవసరములు. CChTel 210.1

    సత్యమునుండి తొలగిపోయిన వారు సాక్ష్యములయందలి తమ విశ్వాసమే తమ చర్యకు కారణమని చెప్పెదరు. ఇప్పుడు ప్రశ్న యేమనగా దేవుడు విమర్శించు విగ్రహములను వారు విసర్జించెదరా? లేక తమ తప్పుడు మార్గమును వీడక తమకు ఆనందము కూర్చుకార్యములను ఖండిరచుచు తమకు దేవుడిచ్చిన వెలుగును విసర్జించెదరా? వారితో తేలవలసిన సంప్రశ్నమిది: నన్ను నేను ఉపేక్షించుకొని నా పాపములను ఖండిరచుచున్న సాక్ష్యములను దైవదత్తములుగా నంగీకరించనా? లేక నా పాపములను ఖండిరచు చున్నవి గనుక సాక్ష్యములను విసర్జించనా? 85T 674,675;CChTel 210.2