Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వేదపఠనాసక్తి స్వాభివకము కాదు

    యువజనులు, వృద్ధులుకూడ బైబిలును అలక్ష్యము చేయుచున్నారు. దానిని వారు పఠించి తమ జీవిత ప్రమాణముగా గైకొనుటలేదు. ముఖ్యముగా యువజనులు దీనిని అలక్ష్యము చేయుటలో అపరాధులై యున్నారు. అనేకులు ఇతర గ్రంథములను చదివెదరేగాని నిత్యజీవనమునకు మార్గమును చూపు గ్రంథమును అనుదినము పఠించరు. చొకబారు కథలను శ్రద్ధతో చదువుచు బైబిలును నిర్లక్ష్యము చేయుచున్నారు. ఉన్నత పవిత్ర జీవితసాధనకు ఈ గ్రంథము మనకొక మార్గదర్శిని, కల్పిత గాథలను చదువుట ద్వారా తమ ఉహాశక్తి అపమార్గము పట్టుకున్నచో యువజనులు తాము చదివిన గ్రంథములన్నిటియందును నిది అత్యాశాజనకమైన గ్రంథమని ఉద్ఘాటించెదరు. 10CT 138, 139;CChTel 218.2

    ఎక్కువ వెలుగు పొందిన ప్రజలమగు మనము మన అలవాటులలోను, మాటలలోను, గృహజీవితమందును, స్నేహమునదును ఉన్నతస్థాయి కలిగి యుండవలసి యున్నాము. మార్గమును చూపు నిమిత్తము గృహమందు వాక్యమునకు దాని అర్హస్థానమీయుడి. ప్రతి విధమైన కష్టమునందును, దానిని సలహాదారునిగాను ప్రతి ఆధారమునకు ప్రమాణముగాను పరిగణించుడి. నా సోదరీ, సోదరులారా నీతియు వివేకమునైన దైవ సత్యము కుటుంబమందు లేకున్నచో ఏ ఆత్మకైనను వాస్తవమైన అభ్యుదయము కలుగదని నమ్మెదరా? దైవారాధన భారమని పరిగణించు దురభ్యాసమును పిల్లలు విసర్థించుటకు తల్లిదండ్రులు కృషి చేయవలెను. గృహమందు సత్యము యొక్క శక్తి పరిశుద్ధ పరచు సాధనమై యుండవలెను. 11CG 508, 509;CChTel 218.3

    చిన్నతనమందే దైవ ధర్మశాస్త్ర విధులను గూర్చియు, పాపపుడాగులను తుడిచి వేయు మన విమోచకుడగు యేసు క్రీస్తునందు విశ్వాసమునుగూర్చియు, దినదినము ఉపదేశముద్వారాను, ఆచరణద్వారాను వారికి నేర్పవలెను. 125T 329;CChTel 219.1