Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆదివారపు చట్టములు

    దైవసంబంధమైనవనియు, గొర్రెపిల్ల గుణములున్నవనియు చెప్పుకొనుచున్న మత శక్తులు తమకు ఘటర్పహృదయమున్నదనియు సాతానుచే రెచ్చగొట్టబడి అదుపు చేయబడుచున్నవనియు తమ క్రియల ద్వారా చూపించును. ఏడవ దినమును పరిశుద్ధముగా నాచరించుచున్నందున దైవ ప్రజలు హింసకు గురియగు కాలము వచ్చుచున్నది. దైవ సంకల్పములను విఫలము చేయవలయునను ఉద్దేశముతో సాతానుడు సబ్బాతును మార్చెను. లోకమందు మానవుల చట్టములకన్న దేవుని చట్టములను తక్కువైనవిగా చేయవలెనని అతడు కృషి చేయుచున్నాడ. కాలములను, చట్టములను మార్చజూచిన పాప పురుషుడు దైవ ప్రజలన ఎల్లప్పుడున హింసింప జూచిన యతడు ఆదివారాధనకు చట్టములను రూపొందించును. అయితే దైవ ప్రజలు ఆయన కొరకు బలముగా నిలుపబడవలెను. తాను దేవుడ్లకు దేవుడనని సుస్పష్టముగా కనపరచుచు ప్రభువు వారి పక్షమున పని చేయును. CChTel 472.2

    ఆదివారారాధన నిమిత్తము రూపొందించ బడిన చట్టమ మత భ్రష్టమయిన క్రైస్తవలోకము చేసిన పని దేవుని. పరిశుద్ధ విశ్రాంతి దినముకన్న ఎక్కువని క్రైస్తవ లోకముచే నెంచబడ చున్న ఆదివారము పోవుగిరి యొక్క బిడ్డ. దైవ ప్రజలు దీనిని గౌరవించరాదు. ప్రాతికూల్యమున తప్పించుకొనుడని దేవుడు చెప్పుచుండగా వారు ప్రాతికూల్యమునకు సాహసించినచో వారాయన చిత్తమును నెరవేర్చుట లేదని వారు గ్రహించవలెనని నా కోరిక. ఇట్లు సత్యము ప్రకటించుటకు వీల లేనత విద్వేషమున వారు సృష్టించెదరు. చట్టవిరుద్ధముగా ఆదివార నిరసన ప్రదర్శనములను చేయకుడి. ఇట్లు ఒక స్థలములో జరిగి మీరు సిగ్గుపర్చబడగా మరియొక స్థలమందు కూడ నిదే జరుగును. క్రీస్తు పక్షము సాక్ష్యమిచ్చు పనిని అభివృద్ధి పరచుటకు మనము ఆదివారమును వినియోగించవచ్చును. *. మనము సాత్వికముతోడను దీన మనస్సు తోడను మన శక్తి కొలది పని చేయవలెను. CChTel 472.3

    సువార్త సేవకు మనము ఆదివారమును ఉపయోగించినో సెవెంత్`డే ఎడ్వెంటిస్టులను సిగ్గుపరచవలెనని ముచ్చటపడువారి చేతులలో నుండి కొరడా తొలగిపోవచ్చును. మనము ఆదివారమున లేఖనములన బోధించుట, ప్రజలను దర్శించుట చూచి తామ ఆదివార శాసనములన రూపొందించుట ద్వారా మన పనిని అడ్డగించుట వ్యర్థమని వారు గ్రహింతురు. CChTel 473.1

    ఎక్కువ కార్యసాధన చేయ ఆయా శాఖలను వృద్ధిపరచుటకు ఆదివారమునుపయోగించవచ్చును. ఈ దినమున బహిరంగ కూటములు కుటీర కూటముల జరుపవచ్చును. ప్రతి గృహములో పని చేయవచ్చును. రయితలు తమ వ్యాసరచనకీ దినమును ఉపయోగించుకొనవచ్చును. సాధ్యమైనపుడెల్ల ఆదివారమునాడు ప్రార్థన కూటము జరుపుడి. ఈ కూటములను అత్యాకర్షములుగ జేయుడి. మంచి ఉజ్జీవ కీర్తనలను పాడుడి, యేసు యొక్క ప్రేమను గూర్చి శక్తితోను, నిశ్చయతోను ప్రకటించుడి. ఆశానిగ్రహము, నిజక్రైస్తవానుభవములమీద మాటలాడడి. పని చేయవలసిన విధమును ఇట్లు నేర్చుకొని మీరు అనేక ఆత్మలను రక్షించవచ్చును. CChTel 473.2

    మనపాఠశాలల యందలి ఉపాధ్యాయులు ఆదివారమును సువార్త యత్నకూటములకు వినియోగించవలెను. వారిట్లు శత్రువుయొక్క ఏర్పాటులను విఫలము చేయవచ్చునని నేనుపదేశించబడితిని. ఉపాధ్యాయుల విద్యార్ధులను వెంటనిడకొనిపోయి సత్యమెరుగనివారికొరకు కూటమలు పెట్టవలెను. CChTel 473.3

    ప్రజలకు కచ్చితమయిన, అసందిగ్దమయిన సత్యము నందించవలెను. కాని యీ సత్యమును క్రీస్తు స్వభావముతో అందించవలెను. మనము తోడేళ్ల మధ్య గొర్రెపిల్లలవలె నుండవలెను. ఇయ్యబడిన హెచ్చరికలన క్రీస్తు నిమిత్తము అనుసరించనివారు ఓర్పు ఆత్మ నిగ్రహము కలిగి యుండినివారు రక్షకుని కొరకు పని చేయుటకు గల ప్రశస్త అవకాశములను కోల్పోయెదరు. తన చట్టమును అతిక్రమించువారిని ఖండన మండన చేయు పనిని ప్రభువు తన ప్రజలకీయలేదు. ఇతర సంఘములను మనమెన్నడును ఖడించరాదు. CChTel 473.4

    మన పనికిని ,బైబిలు సబ్బాతుకును పనిచేయువారి మనస్సులందరి ద్వేషమును తోలిగించుటకు మనము చేయగలిగినదంతయు చేయవలెను. 119T 229-238. CChTel 474.1