Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 26 - ప్రభురాత్రి భోజనము

    సంఘాచారములు (గురుతులు) సులభమైనవి. అవి స్పష్ట గ్రాహ్యములు. అవి సూచించు సత్యములు భావ పూరితములు. 1EV 273;CChTel 244.1

    పాత నిబంధనకాల పరిసమాప్తిని, నూతన నిబంధన కాల ప్రారంభమును సూచించుమహా పండుగల మధ్యమున క్రీస్తు కళంకములేని దేవుని గొర్రెపిల్లయై పాప పరిహారారథబలి కానుండెను. నాలుగు వేల సంవత్సరముల పర్యంతము తన మరణమును సూచించిన సూచనలను ఆచారములను ఈ విధముగా ఆయన నివారణ చేయవలసి యుండెను. తన శిష్యులతో కలిసి పస్కాను భుజించుటద్వారా తన మహత్తర త్యాగమునకు స్మారక చిహ్నమైన ఆచారమును దానిస్థానే ఆయన నిలిపెను. యూదుల జాతీయ పండుగ దినము శాశ్వితముగా నవగతముగా నుండెను. అన్ని భూభాగములలోను, అన్నియుగములలోను తన అనుచరులు క్రీస్తు సంస్థాపించిన ఆచారమును అనుష్టించ వలసి యున్నారు. CChTel 244.2

    ఐగుప్తు దాస్యము నుండి ఇశ్రాయేలు ప్రజల విడుదలకు సూచనగా, పస్కా నియమించబడినది. ప్రతి సంవత్సరము ఈ యాచారము యొక్క భావమును తమ బిడ్డలు అడుగుచుండగా దాని చరిత్రను చెప్పవలెనని దేవుడు సంకల్పించెను. ఇట్లు అందరి హృదయములలోను ఈ మహత్తర విముక్తి సూచించుటకు ప్రభురాత్రి సంస్కారము నియమించబడినది. మహిమతోను, శక్తితోను, ఆయన రెండవసారి వచ్చువరకు ఈ యాచారము అనుష్టించబడవలసియున్నది. మన కొరకాయన యొనర్చిన మహత్తర కార్యమును మనము జ్ఞాపకముంచుకొనుటకిదియే సాధనము. CChTel 244.3

    ఎవరికైనను ప్రభురాత్రి సంస్కారమునుండి నిషేధించకూడదని క్రీస్తు చూపిన ఆదర్శము వ్యక్తముచేయుచున్నది. బహిరంగ పాపములలోనున్న వాడు ఈ సహవాసము నుండి బహిష్కరించబడవలెనని వాక్యము భోధించుచున్నది. దీనిని పరిశుద్ధాత్మ స్పష్టముగా బోధించుచున్నది. (1కొరింథీ 5:11) దీనికి మించి ఎవరును తీర్పు తీర్చరాదు. ఇట్టి సమ యములలో నెవరు హాజరు కావలెను అను సమస్యను దేవుడు మానవుల చేతులలో పెట్టలేదు. హృదయరహస్యముల నెవరు గ్రహించగలరు? గోధుమలకును గురుగులకును మధ్యగల భేదమును ఎవరు గుర్తించగలరు? “కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; అలాగుచేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను; కాబట్టి యెవడు ప్రభువు యొక్క రొట్టెను అయోగ్యముగా భుజించునో లేక ఆన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు.” (1 కొరింథీ 11:27`29). CChTel 244.4

    అయోగ్యులైన వారు కొందరు హాజరైన కారణముగా ఎవరును ఈ సంస్కారమందు పాల్గొనుట మానరాదు. ప్రతి శిష్యుడు బహిరంగముగా దీనిలో పాల్గొనవలెను. ఇట్లు చేసి క్రీస్తును తన స్వకీ రక్షకునిగా అంగీకరించు చున్నట్లు అతడు సాక్ష్యమీయవలెను. CChTel 245.1

    తన శిష్యులతో కలిసి రొట్టెను ద్రాక్షారసమును పుచ్చుకొనుటలో వారికి రక్షకుడనని క్రీస్తు వాగ్దానము చేసెను. వారికాయన నూతన నిబంధనను అనుగ్రహించెను. దీనిద్వారా ఆయన నంగీకరించు వారందరు దేవుని పిల్లలును క్రీస్తుతో సహవాసులను అగుదురు. ఈ నిబంధనద్వారా ఈ జీవితమునకును భావి జీవితమునకును దేవుడనుగ్రహించగల ప్రతి ఆశీర్వాదము వారి పరమగును. ఈ నిబంధన క్రియ క్రీస్తురక్తముతో స్థిరపరచబడవలసియున్నది. నశించిన మానవాళిలో నొక భాగమైన వారికొరకు వ్యక్తిగతముగా చేయబడిన అపార త్యాగమును ప్రతి మనుష్యునికి ఈ యాచారము స్ఫురింపజుయవలసియుండెను. CChTel 245.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents