Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఉపాధ్యాయుని యోగ్యతలు

    మీ పాఠశాలకు నాయకునిగా బలమైన వ్యక్తిని నియోగించుడి. శిక్షకుడిగా పనిచేయుటలో అతనికి భౌతిక బలముండవలెను. క్రమము, శుభ్రత, పరిశ్రమ మున్నగునలవాటులందు విద్యార్థులకు శిక్షణ నిచ్చుటకు అతడు సమర్థత కలిగి యుండవలెను. మీకియబడిన పనిని సంపూర్ణముగా చేయుడి. సామాన్యాంశములను మీరు నమ్మకముగా బోధించినచో విద్యార్థులలో ననేకులు గ్రంథ విక్రేతలుగను, సువార్తికులుగను, వెంటనే పనిచేయవచ్చును. పనివారందరు ఉన్నత విద్య నభ్యసించవలెనని మనము భావించరాదు. 18CT 213. 214;CChTel 388.2

    ఉపాధ్యాయులను ఎన్నుటలో మనము చాల జాగ్రత్తగా యోజించవలెను. సువార్త సేవకుల ఎన్నిక యెంత పవిత్రమైనదో ఇది కూడ నంత పవిత్రమైనది. శీలమును గ్రహించు పరిజ్ఞూనముగల వ్యక్తులు ఈ యెన్నిక చేయవలెను. ఏలమనగా పిల్లల మనస్సులను తీర్చి దిద్దుటకు అత్యుత్తమమైన తలాంతు అవసరము. మన సంఘ పాఠశాలలో వివిధ భాధ్యతలను జయప్రదంగా వమించుటకు సమర్థులు అవసరము. పిల్లలకు ఉపాధాయులుగ అనుభవశూన్యులను, పిల్లలను అదుపుచేయలేని యువకులను నియమించకుడి. కారణమేమనగా వారి కృషి అక్రమ విధానముకు దారితీయును. 19CT 174, 175;CChTel 388.3

    దేవుని ప్రేమించి ఆయనను ధిక్కరించుటకు భయపడునని మీరు పరీక్షించి తెలిసికొన్న వానినే ఉపాధ్యాయునిగ నియమించవలెను. CChTel 388.4

    ఉపాధ్యాయులు దేవుని వలన ఉపదేశించబడుచో క్రీస్తు పాఠశాలలో వారు తమ దైనందిన పాఠములను నేర్చుకొన్నచో క్రీస్తు విదానములను అవలంభించి వారు పని చేసెదరు. క్రీస్తుతో కలిసి వారు పిల్ల హృదయములను ఆకర్షించెదరు. కారణమేమనగా ప్రతి బాలుడు, బాలిక, యువకుడు, యువతి ఆయనకు ప్రశస్తమైనవారు. 20FE 260;CChTel 388.5

    ఉపాధ్యాయుని అలవాటులు, నియమములు అతని విద్యావిషయక అర్హతలకన్నా ప్రాముఖ్యమైనవిగా పరిగణించబడవలెను. సరియై న మాదిరి చూపుటకు గాను అతడు తన్ను తాను స్వాధీనపరచుకొనవలెను. అతని హృదయము విద్యార్థులపట్ల, ప్రేమతో నిండుకొనవలెను. ఈ ప్రేమ అతని చూపులలోను, మాటలలోను, క్రియలోను కాన్పించవలెను. 21FE 19;CChTel 388.6

    ఉపాధాయుడు క్రైస్తవ వ్యక్తిగా వ్యవహరించవలెను. అతడు తన విద్యార్థులకు యిష్డుడుగాను స్నేహితునిగాను ఉండవలెను. మన ప్రజలందరు అనగా ఉపాధ్యాయులు, బోధకులు, సంఘ సభ్యులు క్రైస్తవ మర్యాదను అలవరచుకొన్నచో వారు అనేక ప్రజల హృదయములను సులభముగా చూరగొననగలరు. ఇంక ననేకులు సత్యమును పరిశోధించి అంగీకరించుటకు నడిపించబడెదరు. వారు దేవుని సొత్తనియు వారి మనస్సులు ప్రవర్తనలపై తన పలుకుబడి విషయము లెక్క అప్పగించవలెననియు గ్రహించి ప్రతి ఉపాధ్యాఉడును స్వార్థమును విస్మరించి తన విద్యార్థుల జయమునందు, అభ్యున్నతియందు ఆసక్తి కలిగియున్నచో దేవదూతలు మసలుటకు మ్చుటపడు పాఠశాల మనకుండును. 22CT 93, 94;CChTel 389.1

    మన సంఘ పాఠశాలలలో ఉన్నత నైతిక నియమములు గల ఉపాధాయులు అవసరము. వారు నమ్మకమమయినవారును, బలవత్తరమయిన విశ్వాసముకలవారును నేర్పు, ఓరిమి, కలవారును, దేవునితో నడచుచు పాపమునకు దూరముగా నుండువారునై యుండవలెను. CChTel 389.2

    గర్విస్టులను, ప్రేమించని వారిని పిల్లలకు ఉపాధ్యాయులుగ నియమించుటఘోర పాపము. ఇట్టి ఉపాధ్యాయుడు త్వరితముగా గుణశీల నిర్మాణమునందు పురోగమించుచున్న పిల్లలకు చాలా హాని చేయును. ఉపాధ్యాయులు దేవునికి లొంగి యుండకున్నచో, తమ అజమాయిషీ క్రిందనున్న పిల్లలను ప్రేమింకున్నచో లేక వారికి నచ్చిన వారి యెడల పక్షపాతము చూపి ఆకర్షణీయముగ లేని వారిని లేక చిలిపి చేష్టలు చేయు వారిని ఉపేక్షించినచో అట్టివారిని ఉపాధ్యాయులుగ నియమింపరాదు. వారి కృషి ఫలితముగా అనేక ఆత్మలు నశించును. CChTel 389.3

    ప్రశాంతముగాను దయతోను వ్యవహరించుచు ఎవరి యెడల దీర్ఘశాంతము, ప్రేమ మరెక్కువగా ప్రదర్శించుట అవసరమో వారి యెడల ఎక్కువగా చూపగల ఉపాధ్యాయులు పిల్లలకవసరమై యున్నారు. 23CT 175, 176;CChTel 389.4

    ప్రార్థనావశ్యకతను ఉపాధ్యాయుడు గ్రహించి దేవుని ముందు వినయముగా నుండకున్నచో విద్య యొక్కముఖ్యోద్దేశమునే యతడు గ్రహింపక యుండును. 24CT 231;CChTel 389.5

    ఉపాధ్యాయుని భౌతికార్హతల ప్రాముఖ్యత చెప్పశక్యముకానిది. అతనికి సంపూర్ణారోగ్యమున్నచో అతని పని కూడ నిర్దుష్టముగ నుండును. శరీరము బలహీనతకు, వ్యాధికి CChTel 389.6

    లోనైనచో మనస్సు సరిగా తలంచలేదు; పని చేయుటకు బలముగా నుండజాలదు. మనస్సులో భావము నేర్పడును. శరీర బలహీనత వలన మనస్సు తన బలమును కోలుపోయినచో వున్నతాభిప్రాయములకు ,ఆశయములకు నడుపు సాధనము ఆటంకపరచబడును. కనుక మంచి చెడ్డలను వివేచించు శక్తీ ఉపాధ్యాయుని యందు క్షినించును. ఆనరోగ్యము యొక్క ఫలితములు అనుభవించుచున్నపుడు ఓరిమి ,ఆనందము కలిగియుండుటగాని ,నమ్మకము గాను న్యాయముగాను వర్తించుటగాని కష్టము. 25CT 177;CChTel 390.1