Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సోమరి తనము వలన కీడు

    ఎక్కువ పాపము సోమరి తనము నుండి పుట్టుచున్నదని నాకు చూపబడెను. అప వాది కలుగజేయు ప్రతి శోధనకు లొంగుటకు పని గల చేతులకు మనస్సుకు సమయముండదు. కాని పనిపాటు లేక యుండు చేతులు మెదడు సాతాను వశమగుటకు సంసిద్ధముగా నుండును. మనస్సుకు పనిలేకున్నచో అపసవ్య విషయములను గూర్చి యది తలంచును. సోమరి తనము పాపమని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించవలెను. 16IT 395;CChTel 369.3

    పిల్లల గూర్చి శ్రద్ద తీసికొనక వారు సోమరి తనము కలిగి గురిలేని జీవితము జీవించుచు ఏమియు పని చేయక తమ ఇచ్ఛవచ్చినట్లు ప్రవర్తించుటకు విడచుటకన్న వారిని దుర్మార్గమునకు నడుపు మార్గము మరియొకటి లేదు. పిల్లల మనస్సులు చరుకయినవి. మేలైన, ప్రయోజనకరమైన పనియందు వారు నిమగ్నులు కాకున్నచో వారు దర్మార్గము నందు ప్రవేశించుట నిశ్చయము. కాగా వారు పనిచేయుటకును, గ్రంథపఠనము చేయుటకును నిర్ధిష్ట సమయము నేర్పరిచి వారు దాని ప్రకారము పనిచేయునట్లు శిక్షణనీయుడి. 17AH 284;CChTel 370.1

    పిల్లలు తరచు ఒక పనిని ఉద్రేకముతో ప్రారంభింతురు. కాని అవరోధముగాగాని అలసటగాని వారి నెదుర్కొనినపుడు మరి యొక విధమైన పనిచేయ జూతురు. ఇట్లు చాలా రకములైన పనులు చేయుటకు యత్నపడి నిస్పృహచెంది ఆ పనులను విరమింతురు. కనుక ఒక దానిని మరియొక దానిని చేపట్టెదరు. కాని దేనిని పూర్తి చేయరు. మార్పు నందలి మమత తమ బిడ్డలతో ప్రవేశించకుండా తల్లిదండ్రులు చూడవలను. ఇతర కార్యములతో దీక్షపూని వృద్ధి చెందుచున్న పిల్లల మనసులను ఓరిమితో క్రమపరచు పనిని తల్లిదండ్రులు ఉపేక్షించరాదు. లేక సరైన సమయమందు చిన్న సహాయము వారికున్న కష్టములను అధైర్యములను తొలగించవచ్చును. వారు ప్రారంభించిన పనిని ముగించుట ద్వారా వారికి కలుగు తృప్తి వారు ఇతోధికముగా శ్రమపడుటకు దోహదము చేయును. 183T 147, 148;CChTel 370.2

    అమితముగా ప్రేమించి గౌరవించబడు పిల్లలు ఆస్థితినే నిరంతరము ఆపేక్షించేదరు. వారనుకొన్నట్లు జరుగక పోయినప్పుడు నిరుత్సాహము, అధైర్యములకు గురియగుదురు. వారి జీవితము పొడుగున ఈ మనస్తత్వమే పొడసూపును. సహాయము కొరకు ఇతరులపై నాధారపడి వారి ఆదరమును అపేక్షించి వారికి లొంగి నిస్సహాయులై యుండెదరు. వారు పెరిగి పెద్దలైనప్పటికిని తమ యిష్టము ప్రకారము జరుగకున్నచో తాను గౌరపర్చబడుచున్నామని తలంచెదరు. ఇట్లు వారు తమకు కలుగు కష్టములను సహించలేక పరిస్థితులు తమకనుకూలించనందున విసుగు కొనుచు గొణుగుకొనుచు విచారముతో తమ యహలోకయాత్ర సాగింతురు. 19lT 392, 393;CChTel 370.3

    ఒక స్త్రీ తన పనిని కుటుంబ సభికుల పనిని తానే చేసినచో ఆమె తన యెడల తన కుటుంబము నెడల పెద్ద తప్పిదము చేయుచున్నది. తన భర్తయు కుమారులును హాయిగా మంట చుట్టు కూర్చొని యుండగా ఆమె వంట చెరకు, నీళ్లు తానే తెచ్చి గొడ్డలి పుచ్చుకొని కట్టెలు కొట్టుట పొరపాటు. భార్యలు, తల్లులు కుటుంబమునకు దాసీలుగా నుండవలెనని దేవుని సంకల్పము కానేకాదు. గృహకృత్యములు చేయుటకు పిల్లలు శిక్షణ నొందని కారణముగా పెక్కుమంది తల్లులు, అధికశ్రమకు గురియగుచున్నారు. దీని ఫలితముగా వృద్ధురాలై అకాలమరణమునకు లోనై అనుభవశూన్యులైన తన పిల్లలకు నడుపుదల యెక్కువ అవసరమగు సమయమున వారికి సహాయముగా లేకుండ పోవుట తలస్థించుచున్నది. నిందార్హులెవరు?CChTel 371.1

    భార్యకు గల మనోవ్యధలను తగ్గించి యామెకానందము కలిగించుటకు భర్తలు తాము చేయగలిగినదంతయు చేయవలెను. పిల్లలయందు సోమరితనము బలపడరాదు. బలపడనీయరాదు. కారణమేమనగా నది తక్షణమే అలవాటుగా పరిణమించును. 205T. 180,181;CChTel 371.2