Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నూతన దంపతులకు హితవు

    నా ప్రియ సహోదరా, సహోదరీ, జీవితాంతము వరకు నుండు నిబంధన ప్రకారము మీరు జతపడి యున్నారు. మీ వివాహనంతర విద్య ప్రారంభమైనది. పెండిjైున మొదటి సంవత్సరము అనుభవముతో కూడిన సంవత్సరము పాఠశాలలో బాలుడు పాఠములు నేర్చుకున్నట్లు ఈ సంవత్సరంలో భార్య భర్తలు ఒకరి గుణశీలముల నొకరు పరిశీలించెదరు. దీనిలో పెండ్లిjైున మీ మొదటి సంవత్సరంలో మీ భావి సంతోషమును పాడుచేయు ఘట్టములుండనీయకుడి. CChTel 271.3

    వివాహ సంబంధమును సరిగా గ్రహించుటకు జీవితకాలము పట్టును. వివాహమాడు వారు ఒక పాఠశాలయందు ప్రవేశించుచున్నారు. ఈ జీవితములో వారు ఆ పాఠశాల నుండి పట్టభద్రులు కాజాలరు. నా సహోదరా నీ భార్య సమయము, బలము, ఆనందము నీ సమయము, బలము ఆనందములతో ముడిపడి యున్నవి. ఆమె యెడల నీపలుకుబడి జీవార్థమైన జీవపు వాసనగానో మరణార్థమైన మరణపు వాసనగానో ఉండవచ్చును. ఆమె జీవితమును పాడుచేయకుండ జాగ్రత్తగా నుండుము. నా సహోదరి నీవు నీ వివాహిత జీవిత ప్రాథమిక పాఠముల నిప్పుడు నేర్చుకొనవలెను. ఈ పాఠములను దినదినము శ్రద్ధగా నేర్చుకొనుట మరువకుము. అసంతృప్తికి, మనోచాపల్యమునకు ఎడమీయకుము. సుఖజీవితమును, సోమరితనమును ఆపేక్షించకుము. స్వార్థపరాయణతకు లొంగకుండ అనునిత్యము జాగ్రత్తగా నుండుము. CChTel 271.4

    మీ జీవితములో అన్యోనానందమునకు మీ ప్రేమలు ఉపనదులై యుండవలెను. మీరు ఒకరి యానందము కొరకొకరు పాటుపడవలెను. మీ విషయమై దేవుని చిత్తమిదే. మీరిద్దరును ఐక్యముగా నుండవలెను. అయినను మీరు వ్యక్తిత్వమును కోల్పోనక్కరలేదు. మీ వ్యక్తిత్వమునకు కర్త దేవుడే. ఏది తప్పు? ఏది ఒప్పు? నా సృష్టి లక్ష్యమును నేనెట్లు సఫలము చేయగలను? అని ఆయనను మీరడుగవలెను. మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. (1 కొరింథి 6:19,20) మానవుల విషయములందలి మీ ప్రేమ దైవ విషయములందలి ప్రేమకు తరువాతిదై యుండవలెను. మీ కొరకు తన ప్రాణము నర్పించిన ఆ ప్రభుని చెంతకు మీ ప్రేమాసంపత్తి ప్రవహించవలెను. దేవుని కొరకు జీవించుట ద్వారా ఆత్మ తన ఉత్తమమైన, ఉత్కష్టమైన ప్రేమను ఆయనకు పంపును. మీ కొరకు మరణించిన ఆయన కడకు మీ ప్రేమ పరలోక నిబంధననానుసారమైనదే. CChTel 272.1

    ప్రేమ అతి స్పష్టముగను పరిశుద్దత యందు సౌందర్యముగను ఉండవచ్చును. అయినను అది లోతుగా నుండకపోవచ్చును. ఏలనగా పరీక్షకు గురికాలేదు. పరిశోధించబడలేదు. ప్రతి విషయమందును క్రీస్తుకు ప్రధాన స్థానము నీయుడి. ఆయనను సర్వదా వీక్షించుడి, కష్టములతో పరీక్షించబడు కొలది ఆయన యందలి మీ ప్రేమ దిన దినము గాఢతరము, బలవత్తరము అగును. ఆయన యందు మీకున్న ప్రేమ నమధికమగు కొలది మీ అన్యోన్యానురాగము గాఢతరము, బలవత్తరము అగును. మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అత్యధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పొలికకానే మార్చబడుచున్నాము. (2 కొరింథీ 3:18) వివాహమునకు పూర్వము లేని బాధ్యత లిప్పుడు మీకు కలవు. ‘కాగా. . జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి’. ఈ యుపదేశమును శ్రద్ధగా పరిశీలించుడి. స్త్రీలారా ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విష విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. (కొలస్సీ 3:12, ఎఫెస్సీ 5:2, 22`25). CChTel 272.2

    వివాహము జీవితకాలముండు ఐక్యత. సంఘమునకు క్రీస్తుకును గల ఐక్యతకు వివాహమొక గురుతు. సంఘము నెడల క్రీస్తు ప్రదర్శించిన స్వభావమును భార్య భర్తలొకరి యెడ నొకరు ప్రదర్శించవలసి యున్నారు. CChTel 273.1

    భర్తగాని, భార్యగాని అధికారము చెలాయింప ప్రయత్నించరాదు. ఈ విషయమందు దారి చూపుటకు ప్రభువు ఒక నియమమును ఇచ్చియున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించునట్లు భర్త భార్యను ప్రేమించవలెను. ఇద్దరును దయాస్వభావము కలిగి ఒకరినొకరు దు:ఖపెట్టుట గాని గాయపరుచుట గాని చేయమని నిర్ధారణ చేసికొనవలెను. CChTel 273.2

    నా ప్రియ సహోదరా, నా సహోదరీ, మీరిరువురును బలమైన మహాశక్తి కలిగి యున్నారు. ఈ శక్తిని మీ యెడలను గొప్ప ఆశీర్వాదముగానో శాపముగానో మీరుపయోగించవచ్చును. మీ మీ ఇష్టములే నెరవేర్చవలెనని మీ రొకరినొకరు బలవంత పెట్టకుడి. ఇట్లుచేసి మీరు అన్యోన్య ప్రేమను నిలుపుకొనలేరు. నా ఇష్టప్రకారమే జరగవలెనను పట్టుదల కుటుంబ మందలి యానందమును సమాధానమును పాడుచేయును. మీ వివాహిత జీవితము వివాదములతో కూడినది కారాదు. అట్లయినచో మీరిరువురు సంతోషముగా నుండజాలరు. మాటలతో దయగను, క్రియలలో సరళముగను ఉండి మీ స్వకీయేచ్ఛలను వర్జించుడి. మీ రాడు మాటల విషయము జాగ్ర త్తగా నుండుడి. అవి మంచికో చెడ్డకో దారి తీయు ప్రభావము కలిగి యుండును. మీ స్వర్గములలో కాఠిన్యము లేకుండా చూచుకొనుడి. మీ సమిష్టి జీవితములో క్రీస్తు పోలికయను సుగంధమును సేకరించుకొనుడి. CChTel 273.3

    వివాహము వంటి సన్నిహిత సంబంధములో మానవుడు ప్రవేశించకముందు తన్ను తాను అదుపుచేసుకొను విధమును ఇతరులతో మెలగు విధమును నేర్చుకొనవలెను. CChTel 274.1

    నా సహోదరుడా, దయ, ఓర్పు, దీర్ఘశాంతములు కలిగి యుండుము. నీ భార్య నిన్ను తన భర్తగా అంగీకరించినది. నీవు ఆమెపై అధికారము చెలాయించుటకు కాదు గాని నీవు ఆమెకు సహాయకారిగా వుండుటకేయని జ్ఞాపకముంచుకొనుము. ఎన్నడును అధికారమును, నియంతృత్వమును చూపకుము. నీ యిష్ట ప్రకారము వర్తించుమని నీ భార్యను నీ శక్తి కొలది ఒత్తిడి చేయకుము. ఆమెకు కూడా చిత్తమున్నదని నీకువలె ఆమె కూడా తన చిత్తము నెరవేర్చుకొనవెలనను కాంఓ కలిగి యుండుననియు జ్ఞాపకముంచు కొనుము. అదియును గాక నీకు విశాలానుభవ లాభమున్నదని జ్ఞాపకముంచుకొనుము. దయ, మర్యాదలు కలిగి యుండుము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది. తరువాత సమాధనకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది. (యాకోబు 3`17)CChTel 274.2

    నా ప్రియ సహోదరా, సహోదరి దేవుడు ప్రేమా స్వరూపియనియు ఆయన కృప వలన మీ రొకరినొకరు సంతోషపెట్టుట లో జయము సాధించెదరనియు జ్ఞాపకముంచుకొనుడి. అట్లు చేతుమని మీ వివాహ ప్రమాణములో మీరు ఒడంబడిరి. రక్షకుని శక్తి ద్వారా వివేకము శక్తి కలిగి ఒక వక్రజీవితమును దేవుని యందు సరిచేయుటకు మీరు కృషి చేయవచ్చునని జ్ఞాపకముంచుకొనుడి. క్రీస్తు చేయలేని దేమున్నది? జ్ఞానము నందును, నీతియందును ఆయన సంపూర్ణుడు. మీకై మీరే జీవించి అన్యోన్యము ప్రేమించుకొనుటతో తృప్తి చెందకుడి. మీ చుట్టుపట్ల ఉన్నవారికి ఆనందము కలుగజేయుటకువచ్చు ప్రతి తరుణమును వినియోగించి వారి యెడల ప్రేమను కనపర్చుడి. దయతో కూడిన మాటలు సానుభూతితో కూడిన చూపులు, అభినందనావచనములు శ్రమపడి నిస్పృహ చెందిన అనేకులకు దప్పిగొన్న ఆత్మకు గిన్నెడు చల్లని నీళ్ల వలె యుండును. సంతోషము గొల్పు ఒక మాట, దయతో కూడిన ఒక క్రియ అలసి సొలసిన వారి భుజస్కందము పైనున్న భారమును తగ్గించుటకు చాలా సహాయపడును. నిస్వార్థ నిజమైన ఆనందమున్నది. అట్టి సేవకు సంభందించిన ప్రతి కార్యము , ప్రతిమాట క్రీస్తుకు చేసి నట్లుగా పరలోక గ్రంధములలో నిట్లు లికించబడును: ఁమిక్కిలి అల్పుడైన యీనా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. ఁ( మత్తయి 25:40)CChTel 274.3

    రక్షకుని ప్రేమా ప్రకాశమందు నివసించుడి. అప్పుడు మీ పలుకుబడి లోకమునకు ఆశీర్వాదకరముగ నుండును. క్రీస్తు ఆత్మకు మీరు లోబడియుండుడి. దయా నిబంధనను మీ పెదవుల పై నిత్యము నిలుపు కొనుడి. క్రీస్తు నందు నూతన జీవితమును జీవించుటకు తిరిగి జన్మించిన వారి మాటలు క్రియలు దీర్ఘ శాంతము నిస్స్వా ర్ధములతో కూడి యుండును. CChTel 275.1