Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సాక్ష్యములను విమర్శించుట యందలి అపాయము

    ఇటీవల కలిగిన దర్శనములో ఒక ప్రజా సభలోనికి నేను తేబడితిని వారిలో కొందరు నేను వారికిచ్చిన గంభీర సాక్ష్య ప్రభావమును మటుమాయము చేయుటకు ప్రయత్నించుచున్నారు. వారిట్లనిరి. “సోదరి వైటమ్మగారి సాక్ష్యములను మేము నమ్మెదము! కాని మనము చర్చించుచున్న ఈ వ్యక్తిని గూర్చి దర్శనములో ఆమె ప్రత్యేకముగా చూడని విషయములను చెప్పునపుడు ఆమె మాటలు ఏయితర వ్యక్తి మాటలకన్న గొప్పవి కానేరవు.” దైవాత్మ నామీదికి వచ్చెను. నేనులేచి ప్రభువు నామయందు వారినిగద్దించితిని. CChTel 211.2

    ఈ గంభీర సాక్ష్యములు ఎవరికి పంపబడినవో వారిప్పుడు “ఇవి కేవలము సోదరి వైటమ్మగారి వ్యక్తిగత ఉద్దేశ్యములు; నాకు తోచిన విధముగా చేసెదను.” అని తలంచుచు చేయరాదని ఖండితముగా హెచ్చరించబడిన వాటినే చేయుచున్నచో, వారు దేవుని ఉపదేశము నిరాకరించుచున్నారని వ్యక్తమొనరించెదరు. తత్పర్యవసానముగా నాకు దేవుని ఆత్మ చూపినవే సంభవించును. అది ` దేవుని సేవకు విఘాతమును తమకు వినాశమును, తమ కార్యములను బలపరచుకొన జూచువారు కొందరు తమ దృక్పధములను బలపరచుచున్నదని తాము తలంచు కొన్ని వాక్యములను సాక్ష్యములనుండి యెత్తి చుపుచు బలీయమైన వ్యాఖ్యచేసెదరు, కాని వారి కార్యములను ఖండిరచు దానిని లేక వారి దృక్పథములతో నేకీభవించని దానిని సోదరి వైటమ్మగారి స్వకీయ ఉద్దేశ్యమనియు అది దేవుని వద్ద నుండి వచ్చినది కాదనియు చెప్పుచు దానిని తమ వ్యక్తిగత ఉద్దేశ్యముతో సమానము చేసెదరు. CChTel 211.3

    సహోదరులారా, ఇప్పుడు నాకును, ప్రజలకును మధ్య నిలిచి వారికి దేవుడు పంపుచున్న వెలుగును వెనుకకు త్రిప్పవలదని మిమ్మును బ్రతిమాలు చున్నాను. మీ విమర్శల సాక్ష్యముల యందున్న బలమును, సహేతుకతను, శక్తిని నాశనము చేయవద్దు. పరలోకము నుండి వచ్చిన వెలుగేదో మానవ మాత్రుల ఉద్దేశమేదో గ్రహించుటకు మాకు దేవుడు సామర్ధ్యము నిచ్చెనని చెప్పుకొనుచు సాక్ష్యములను మీకనుకూలముగా మలపవచ్చునని తలంచకుడి. దైవ వాక్యము ప్రకారము సాక్ష్మఉలు బోధించని యెడల వారిని తృణీకరించుడి, క్రీస్తుకు, బెలియాలుకు పొత్తుకుదురదు. కుతర్కములతోను, నాస్తికతతోను మానవ మనస్సులను తికమక పరచి దేవుడుచేయు పనిని నిష్పలము చేయవద్దని క్రీస్తు నామమున మిమ్మును బ్రతిమాలుచున్నాను. మీ ఆత్మీయ ఆజ్ఞానమువలన దైవదత్తమైన ఈ సాధనమును అడ్డు బండగా తయారుచేసి తద్వార అనేకులు తూలి పడి “ఉచ్చులలో చిక్కుకొని చెరలోనికి కొనిపోబడునట్లు” చేయకుడి. 105T 687-691;CChTel 212.1