Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    యోగ్యులని తాను తలచినవారినే దేవుడు పరీక్షంచును

    మనము కష్టములు సహించుటకు పిలువబడిన హేతువు యేసు ప్రభువు మనయందేదో యొక ప్రశస్త లక్షణమును చూచి దానిని అభివృద్ధిపరచగోరుచున్నాడని నిరూపించుచున్నది. తన నామమును మహిమపరచు కొనుటకు మనయందేదియు ఆయనకు కాల్పించకున్నచో మనలను నిర్మలము చేయుటకు ఆయన కాలము గడపడు. ముండ్ల పొదలను సొగసుగా కత్తిరించుటకు మనము ప్రయాసపడముగదా? క్రీస్తు పనికిరాని రాళ్లను తన కొలిమిలో వేయడు. నిలువగల ఖనిజమునే ఆయన పరీక్షించును. 107T 214;CChTel 143.2

    బాధ్యతాయుత స్థానముల నాక్రమించవలెననితాను సంకల్పించు మనుష్యులకు దేవుడు తన కృప వలన వారి లోపములను కనపర్చి తద్వారా వారు తమ హృదయ ఉద్వేగములను, కార్యములను బాగుగా పరీక్షించుకొని పొరపాటులను గుర్తెరుగునట్లు చేయును; ఇట్లు వారు తమ మనస్తత్వములను సరళీకరించుకొని, సంస్క ృతి పొంద వీలున్నది. దేవుడు తన కృపద్వారా మనుష్యులు మేలైన దానిని తమలో వృద్ధిచేసికొని చెడుగును విసర్జించు నిమత్తము వారి నైతిక శక్తులను పరీక్షించి క్రియా లక్ష్యములను వెల్లడిచేయగల స్థానమునకు తెచ్చును. తన సేవకులు తమ హృదయమును నైతిక యంత్రముతో పరిచయము కలిగి యుండవలెనని దేవుని వాంఛ. అందుకొరకు వారు పవిత్రులగు నిమిత్తము ఆయన తరుచు వారి పైకి కష్టాగ్ని రానిచ్చును. “అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలదు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు. చాకలి వాని సబ్బవంటివాడు. వెండిని పరిశోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియున్నాడు. లేవీయుల నీతిని అనుసరించి యెహోవా నైవేధ్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయును.” మలాకి 3:2, 3. 114T 85;CChTel 143.3

    దేవుడు తన ప్రజలను అడుగడుగుననడుపుచున్నాడు. హృదయములో నున్న దానిని బయలుపరచు నిమిత్తము వారిని ఆయా పరిస్థితులకు నడిపించును. కొందరొక మెట్టు వరకు వెళ్లి తరువాత మెట్లు వద్ద తొట్రిల్లి పడెదరు. ముందుకు పోవు కొలది వచ్చు ప్రతి విషయమందును హృదయము నిశితముగా పరీక్షించబడును. CChTel 144.1

    పరిశుద్ధ పరచుకొనుట అను ఈ పనికి దైవ ప్రజలమని చెప్పుకొనువారు తమ హృదయములు విరుద్ధముగా నున్నట్లు కనుగొన్నచో వారు దేవుని నోటి నుండి ఉమ్మి వేయబడకుండుటకుగాను ఈ బలహీనతను జయింపవలెనని గ్రహింపవలెను. 121T 187;CChTel 144.2

    దేవుని పని చేయుటకు మనము దుర్భలులమని గ్రహించిన క్షణమందే ఆయనకు లొంగి ఆయన జ్ఞానము చొప్పున నడిచినచో ప్రభువు మనతో కలిసి పనిచేయును. స్వార్థముతో నిండిన యాత్మను ఖాళీ చేయుదుమేని మనకు కావలసిన సమస్తమును ఆయన మనకు సరఫరా చేయును. 137T 213;CChTel 144.3