Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 60 - సాతానుని అబద్ద సూచనలు

    నవీన భూతతత్వమునకు ప్రత్యేకముగా అన్వయించునదిగా ఈ వచనము నాకు చూపబడెనుÑ కొలస్సీ 2:8 “ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరములైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” కపాల విద్యాతత్వము, యోగనిద్న్రతత్వముల ద్వారా వేలకొలది మనుజులు చెడిపోయి అవిశ్వాసులైరని నాకు చూపబడెను. మనస్సు ఈ విధముగ తలంచ నారంభించినచో అది తన నిగ్రహశక్తిని కోల్పోయి సాతాను ఆధీనమందుండుట తథ్యము. మానవుల మనస్సులు “మోసముతో” నింపబడును. మహాకార్యములు సాధించుటకు తమకు శక్తి సామర్ధ్యములున్నవనియు తమకు ఉన్నత శక్తి సాహాయ్యము అవసరము లేదనియు వారు తలంతురు. వారి విశ్వాస సూత్రములు “ఆయనను అనుసరింపక మనుష్య పారంపర్యాచారములను, లోక సంబంధమైన మూల పాఠములను” అనుసరించి యుండును. CChTel 489.1

    వారికి క్రీస్తు ఈ తత్వమును నేర్పించలేదు. ఆయన బోధలలో ఇట్టిదేమియులేదు. మానవులు తమ స్వశక్తిపై నానుకొనవలెనని ఆయన వారికి బోధించలేదు. విశ్వస్రష్టయగు దేవుడే తమ బలమునకు వివేకమునకు స్థానమని వారి కాయన నిత్యము బోధించెను. 18వ వచనమందు ప్రత్యేకమయిన హెచ్చరిక ఇయ్యబడినది. “అతి వినయాసక్తుడై దేవ మాతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీరసంబంధమయిన మనస్సు వలన ఊరికె ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి.”CChTel 489.2

    భూతతత్వ ప్రబోధకులు చక్కని ఆకర్షణలతో మిమ్మును మోసగించుటకు వత్తురు. వారి కల్పిత కథలను ఆలకించినచో నీతికి శత్రువైన వానిచే మీరు మోసగించబడెదరు. మీరు మీ బహుమానమును కోల్పోవుట నిశ్చయము. ప్రధాన వంచకుని ఆకర్షణలకు మీరొకసారి లొంగినచో అతడు మీకు విషము పెట్టును. దాని మారణ ప్రభావము, క్రీస్తు దేవుని కుమారుడు అని మీకున్న విశ్వాసమును చెరచి దానిని నాశనము చేయును. ఆయన రక్తము యొక్క పుణ్యముపై ఆధారపడరు. ఈ తత్వము వలన మంచితుగువారి బహుమానం సాతాను మోసముల ద్వారా అపహరించబడును. తమ స్వకీయ దుర్గుణములపై ఆనుకొని అతి వినయాసక్తులై త్యాగములు చేయుటకు కూడా కష్టపడి తమ్మును తామే చెరచుకొని గొప్ప బుద్ధి హీనత యందు నమ్మిక యుంచి మరణించిన స్నేహితులని తాము భావించు వారి యొద్ద నుండి బుద్ధిహీనులమగు ఉద్ధేశ్యములను పొందెదరు. వారి వివేచనను సాతానుడు పాడు చేసెను. అందుచే వారు పాపమును గ్రహించలేరు. మృతులయిన వారు ఆనుసరించెదరు. ఉన్నత స్థాయిలో ఉన్న దూతలే చనిపోయిన తమ స్నేహితల ఆత్మలని వారు భావించెదరు. 1IT 297, 298;CChTel 489.3

    మనము సర్వతోముఖమగ జాగరూకత కలిగి సాతాను పన్నాగములకు, పథకములను పట్టుదలతో ప్రతిఘటించవలెనని నాకు చూపబడెను. సాతానుడు వెలుగుదూత వేషములో వచ్చి వేవేల ప్రజలన మోసగించలెనని ఆలోచన చేయుచున్నాడు. మానవ మనస్తత్వ జ్ఞానము నతడు ఆమోఘముగ ఉపయోగించుచున్నాడు. కపాల శాస్త్రము, మానసిక శాస్త్రము మంత్ర విద్య వీని ద్వారా అతను ఈ యుగమునందలి మానవుల కడకు వచ్చి కృపకాలం సమాప్తి సమీపమదున్న యీ శక్తి ద్వారా పని చేయుచున్నాడు. 2IT 290;CChTel 490.1