Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దేవాలయములో ప్రార్ధన వైఖిరి

    రాధికలు ప్రార్ధన స్థలమునకు వచ్చునపుడు మర్యాదగా వచ్చి తమ స్థలములకు నిశ్శబద్ద ముగా వెళ్లవలెను. గదిలో ఒక వేడి పుట్టించు పొయ్యి వునచో (శీతల దేశమందు) దాని చుట్టు నిర్లక్ష్యముగాను సోమరితనముగాను కూర్చుండరాదు. సామాన్యపు మాటలు, గుస గుసలు, వెక వెకలు, ఆరాధనకు ముందుగాని వెనుకగాని మందిరమందు వినిపించరాదు. ప్రగాఢమైన, చురుకైన, దైవభక్తి అర్చకులతో వెల్లి విరియవలెను. CChTel 163.3

    కొందరు కూటము ప్రారంభించుటకు కొన్ని నిమిషములు వేచియుండవలసి వచ్చినచో నిశ్శబద్ద ధ్యానమందు నిమగ్నులై యుండుట ద్వారా భక్తి భావము కలిగి కూటము తమ స్వీకీయ హృదయములకు ప్రత్యేకముగా లాభదయకమగునట్లును, ఇతర ఆత్మలకు పశ్చాత్తాపము మారమనసు కలిగించునట్లును, దేవునికి పాృదయపూర్వకముగా ప్రార్ధన చేయవలెను. మందిరమందు పరలోక దూతలువున్నారని జ్ఞాపకముంచు కొనవలెను. కుదురుబాటుగా లేనందువలన ధ్యానము మునకు , ప్రార్ధనకు అనువగు వాతావరణము లేనందువలన మనము దేవునితోటి సపానాసమాధురిని కోల్పోవుదురు. ఆధ్యాత్మిక సితిగతులు తరచు సమీకించవలెను. పాృదయమానసములు నీతి సూర్యు వైపునకు మళ్లకొనవలెను. CChTel 164.1

    ప్రార్ధన మందిరమున ప్రజలు ప్రవేశించునపుడు దేవునిపట్ల స్వచ్ఛమగు మర్యాద కలిగి తాము దైవ సన్నిధానమున నున్నామని గుర్తించుచో నచ్చట నెలకొను నిశ్శబద్దము అంతఃప్రేరణక దోపాదమిచ్చును. సాధరణ స్థలములో పాపముగా లెక్కించబడ గుస గుసలకు, నెక నెకలకు, సంభాషణలకు దైవ మందిరములో తావులేదు. దైవ కార్యము తగు విలువ కలిగి ఉచితరీతిగా హృదయము నాకర్షించు లాగున దానిని వినుటకు మనసును సిద్దపరచుకొనవలెను. CChTel 164.2

    బోధకుడు గౌరవావహముగాను గంభీరతతోను దేవాలయమున ప్రవేశింపవలెను. దీని పనిర్ణయవసానమెంత బృహత్తరమైనది! ప్రజలను గంభీరత భక్తి పూర్వకమైన భీతి వహించును. వారి బోధకుడు దేవునితో సంభాషించు చున్నాడు. ప్రజలముందు నిలువ సాహిసించక పూర్వము దేవునికి తను తాను ఒప్పగించుకొనుచున్నాడు. ఎల్లరి గంభీరత వరించును. దేవదూతలు వారి సమీపింతురు. సమావేశమును దేవుడు తన సన్నిదితో గౌరవించి మానవుల నోటి ద్వారా ప్రకటించబడు తన సత్యమునకు శక్తి నిచ్చు నిమిత్తము సభలో వారందరును దేవునికి భయపడి సవినయముగా తలలు వంచి బోధకుని తో కలిసి మౌన ప్రార్ధన లో పాల్గొవలెను. 15T 491-493;CChTel 164.3

    కమిటీలయందును, ప్రార్ధన కూటముల యందును, దీర్ఘ ప్రార్ధన లు అవాంఛనీయములు, సాధ్యమైనంత మట్టుకు అన్నియు నిర్ణీతకాలమందు ప్రారంభింపబడవలెను. అరగంట, పావుగంట ఆలస్యముగా వచ్చువారి కొరకు ఆగరాదు. హాజరైనవారు ఇద్దరే అయినను వాగ్దత్త ఫలమును పొందు హక్కు వారికి గలదు. హాజరైన వారు తక్కవ మందైనను నిర్ణీతకాలమునకు కూటము ప్రారంభము కావలెను. 22T 577, 578;CChTel 164.4