Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పిల్లలకు హితవు చేయుటలో వ్యక్తిగతానుభవము

    కొంతమంది తల్లులు తమ బిడ్డలను ఎల్లప్పుడు ఒకే విధముగా చూడరు. కొన్ని సార్లు వారికి హాని కలిగింతురు. కొన్ని మార్లు వారి పని ఎడందకు ఆనందము కలిగించు దానిని వారి కీయదు. ఇందు వారు క్రీస్తు ననుసరించుట లేదు. ఆయన చిన్న పిల్లలను ప్రేమించెను. వారి చిత్తవృత్తులను ఆయన గ్రహించి వారికి సంతోషమునందును కష్టముల యందును సానుభూతి చూపెదను. 28MH 389, 390;CChTel 377.4

    వీరితో స్నేహితుము లేక ఆ వినోదములందు పాల్గొందుము అని పిల్లలడుగునపుడు వారికిట్లు చెప్పుడి: “బిడ్డలారా, మీరు వెళ్లుటకు వీలులేదు. ఇక్కడ కూర్చునుడి. ఎందుకు పోరాదో నేను మీకు వ్యక్తీకరింతును. నేను మీ కొరకు చేయు పని నిత్యజీవము సంబంధమయినదియు దైవసంబంధయినదియునై యున్నది. దేవుడు మిమ్మును నాకప్పగించి జాగ్రత్తగా చూడుమని చెప్పెను. బిడ్డలారా, నేను దేవుని స్థానే మీయెదుట నున్నాను. CChTel 377.5

    ప్రభువు దినమందు లెక్క అప్పగించవలసిన వ్యక్తివలె మిమ్మును గూర్చి శ్రద్ధ వమించవలెను. తన బిడ్లలపట్ల తన బాధ్యతను నెరవేర్చలేని వ్యక్తి యనియు నేను ఆక్రమించవలసిన స్థానమును శత్రువువచ్చి ఆక్రమించుటకు అవకాశమిచ్చిన వ్యక్తి యనియు పరలోక గ్రంథములలో మీ తల్లి పేరు వ్రాయబడుట మీకిష్టమా? బిడ్డలారా, మంచి మార్గమేదో మీకుపదేశించెదను. అయినను మీరు మీ తల్లి మాట వినక దుర్మార్గమున పోజూచిన యెడల మీతల్లి నిర్దోషిగా నుండును. మీ పాపముల నిమిత్తము మీరే బాధననుభవించవలెను.” నా పిల్లల యెడల నేనీవిధముగనే వర్తించితిని. నేను ముగించకముందే వారు ఏడ్చురు “మా కొరకు ప్రార్థించవా” అని యడిగిరి. వారి కొరకు ప్రార్థించుటను నేనెన్నడును విసర్జించలేదు. వారి ప్రక్క మోకరిల్లి వారితో కలసి నేను ప్రార్థించెడిదానను. అప్పుడు నేను అక్కడ నుండి వెళ్లిపోయి అపవాది తండ్రి ప్రభావమును తొలగించి నాకు జయమును చేకూర్చమని రాత్రియంతయు దేవునితో విజ్ఞాపన చేసెడిదానను. ఈ విషయము నేనొక రాత్రంతయు శ్రమపడవలసి వచ్చినను నా బిడ్డలు నా మెడ పట్టుకొని “అమ్మా మేము వెళ్లవలెనని కోరినపుడు నీవు మమ్మును వెళ్లనీయకున్నందుకు మాకు చాల సంతసముగా నున్నది. అట్లు చేయుట తప్పని మేమిప్పుడు గ్రహించగలుగుచున్నాము” అని చెప్పెడివారు. దీని ద్వారా నా శ్రమకు తగిన ఫలముకన్న ఎక్కువ ఫలమును పొందెడిదానను. CChTel 378.1

    తల్లిదండ్రులారా, మీరు కూడా నిటులనే చేయవలెను. మీ బిడ్డలను దేవుని రాజ్యమున ప్రవేశపెట్టవలెనని కోరినచో ఈ పనిని మీరు శ్రద్దతో చేయవలెను. 29AH 52S, 529;CChTel 378.2

    యువజనులను నగరములకు చాల దూరమున నుంచిననే గాని ఈ దేశమందైనను మరియ ఏ దేశమందైనను వారికి సరియై న విద్య గరపుట ద్తురము. నగరములయందలి ఆచారములు, అలవాటులు యువజనుల మనస్సులను సత్యమునందుకొనుటకు అర్హములుగా చేయును. 30FE 312;CChTel 378.3