Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    స్వల్ప విషయములయందు దేవుని ఆసక్తి

    ప్రార్థనావకాశము నభినందించి సరియై న విధముగా తమ అభ్యుదయము కొరకు దానిని వినియోగించువారు అరుదు. క్రీస్తు కడకేగి మనము మనకున్న అవసరములను గూర్చి మనవి చేసికొనవలెను. మన విచారములను చిక్కులను, జటిల సమస్యలను ఆయనకు మనము నివేదించుకొన వలెను. మనకు ఆందోళన, విచారము కలిగించునదేది వచ్చినను దానిని మనము ప్రార్థనద్వారా ఆయనకు తెలియజేయ వలెను. అడుగడుగునకు క్రీస్తు సహాయము మన కవసరమని మనము తలంచునపుడు శోధనలు పంపుటకు సాతానుకు ఎక్కువ అవకాశముండదు. అత్యంత కృపావరముగల మన స్నేహితునికి మనలను దూరముగా నుంచవలెనని యతడు సర్వదా కృషి చేయుచున్నాడు. మన హృదయ రహస్యములు క్రీస్తుకే ఎరుక పర్చవలెను. మన హృదయమందున్న సమస్తమును ఆయనకు మనము నిర్భయముగా ఎరుక పర్చవచ్చును. 45T 200-201;CChTel 235.1

    సహోదరీ సహోదరులారా! బహిరంగ ప్రార్థనకు మీరు సమావేశమగునపుడు మీతో క్రీస్తున్నాడని విశ్వసించుడి. మిమ్ము నాశీర్వదించుటకాయన సంసిద్థముగా నున్నాడని విశ్వసించుడి. స్వార్ద దృష్ఠిని విడిచి పెట్టుడి. యేసుపై మీ దృష్టిని నిలిపి ఆన అనన్య ప్రేమనుగూర్చి ముచ్చటించుడి. ఆయనను వీక్షించుట ద్వారా ఆయన స్వరూపమునకు మీరు మార్చబడుదురు. ప్రార్థించునపుడు అసలు విషయమును లక్షించి క్లుప్తముగా ప్రార్థన చేయుడి. మీ దీర్ఘ ప్రార్థనలద్వారా ప్రభువుకు ప్రసంగము చేయకుడి. ఆకలితో నున్న బిడ్డడు తన తండ్రిని ఆహారమడుగురీతిగా జీవాహారము కొరకు ప్రభువుని యాచించుడి. విశ్వాసముతో సరళముగా మనము దేవుని నడుగుచో మనకు అవసరమైన ప్రతి ఆశీర్వాదము. ఆయన అను. గ్రహించును ప్రార్ధన ఆత్మ యొక్క పవితా భ్యసమై. యున్నది పవిత్రమైన దేవుని నూతన హృదయ వాంఛలను నివేదించుటకు ప్రార్ధన యధార్ధత ,వినయము ,పట్టుదల కల ఒక సాధనమయియుండ వలెను. అభ్యర్ధి తాను దైవసన్నిధానమందున్నానని గుర్తించినపుడు ,స్వార్ధము విస్మరింప బడును. మానవ సామర్ధ్యమును ప్రదర్శించుకొనవలెనాను మటుమాయమగును. మానవుల చెవులకు ఇంపు గొల్పుటకతడు ప్రయత్నoచడు కాని ఆత్మ కాంక్షించు ఆశిస్సులు పొందుట కతడు పప్రయతించును. 5GW 178. CChTel 235.2

    బహిరంగ కూటములందేకాని రహస్య ప్రార్ధన యందె కాని మన మనవులను ఆయనకు తెలియజేయు నప్పుడు ప్రభవు ముందు వంగి మోకారించుట ఒక అపూర్వ తరుణము. మన ఆదర్శ ప్రయుడగు యేసు ” మోకాళ్లుని. .. ప్రార్ధించెను” (లూక 22:41)వారు మోకాళ్లుని.. . ప్రార్ధన “చేసిరి అని ఆయన శిష్యులను గూర్చి వ్రాయబడెను. (అ. కా. 9:40;20:36;21:5). CChTel 236.1

    “తండ్రి ఎదుట నేను మోకాళ్లునితిని”అని పౌలు. ( ఎఫెసి. 3:14)ఇశ్రాయెలీయులు పాపములను దేవుని ముందు ఒప్పుకొన్నప్పుడు ఎజ్రా మోకాళ్ళునెను. (ఎజ్రా 9:5 చుడండి) దానియేలు దినమునకు మూడుసార్లు దేవుని మందు మోకాళ్ళుని ప్రార్ధించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెలించెను. (దాని 6 :10)CChTel 236.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents