Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఇతరుల పరిగణనలో శ్రీమతి ఇ. జి. వైటమ్మగారు

    దేవుని రాయబారిణిగ నుండుటలో శ్రీమతి వైటమ్మగారికి వచ్చుచున్న అసాధారణ అనుభవమును గూర్చి విని కొందరు, ఆమె ఏలాటి స్త్రీ? మనకున్న సమస్యలు ఆమెకున్నవా? ఆమె భాగ్యవంతురాలా? లేక పేదరాలా? ఆమె ఎప్పుడైనా మందహాసము చేసిరా? అని ప్రశ్నించిరి. CChTel 30.2

    శ్రీమతి వైటమ్మగారు దీర్ఘాలోచనగల తల్లి. ఆమె పొదుపుగల గృహిణి. ఆమె మంచి అతిథేయ సత్కారము చేయు స్త్రీ. తరచు ప్రజలామె తన గృహమందు సత్కరించెడిది. ఆమె తన పొరుగువారికి మంచి సహాయకారి. ఆమె బలవత్తరమైన నమ్మకము, సౌహార్థస్వభావము, చక్కని మర్యాద, వినయస్వరము గల స్త్రీ. ఆమె ముఖము బిడాయించుటగాని కొఱకొఱలాడుటగాని ఎన్నడును ఎరుగదు. ఆమె ముందు ఎల్లరు స్వేచ్ఛగా చరించిరి. బహుశః వైటమ్మగారితో పరిచయము కలిగించుకొనుటకు ఉత్తమ మార్గమేదనగా, ఆమెను 1859లో తన గృహమువద్ద సందర్శించుటయే; ఈ సంవత్సరములోనే ఆమె దైనందిన వృత్తాంత గ్రంథము నొక దానిని ఉంచనారంభించెను. CChTel 30.3

    బేటిల్‌ క్రీక్‌ నగర పరిసర ప్రాంతములో తోట వేసికొనుటకు, పండ్ల మొక్కలను నాటుకొనుటకు, ఆవును, కోళ్ళను మేపుకొనుటకు, కుమారులు పనిచేయుటకు ఆడుకొనుటకు వీలుగానుండు పెద్ద పొలములో వైట్‌ కుటుంబము నివసించినట్లు మనము గ్రహించుచున్నాము. వైటమ్మగారు ముప్పది ఒక సంవత్సరములు, ఎల్డరు వైటుగారు ముప్పదియారు సంవత్సరముల ప్రాయము గలవారు. ఆ సమయమందు వారి కుటుంబమందు ముగ్గురు బాలురుండిరి. వారి వయస్సులు నాలుగు, తొమ్మిది, పన్నెండు వత్సరములు. CChTel 31.1

    తరచు వైటమ్మగారు గృహము వద్ద నుండక బోధ చేయుటయందును, గ్రంథ రచనమునందును ఎక్కువ సమయము గడుపుట ఆవశ్యకమైనందున వారికి గృహకృత్యములలో ఒక సత్క్రైస్తవ బాలిక సహకరించెడిది. అయినను వైటమ్మగారు వంటచేయుట, ఇల్లు చక్కబెట్టుట, బట్టలు ఉతుకుట, కుట్టుట ఇత్యాది గృహ బాధ్యతలను నిర్వహించిరి. కొన్ని దినములు ఆమె ముద్రాక్షరశాలకు వెళ్ళెడివారు. అక్కడ గ్రంథరచనము సాగించుటకామెకు ప్రశాంతమైన స్థలము ఉండెడిది. తక్కిన దినములు ఆమె తోటలో పూల మొక్కలను, కూరగాయల మొక్కలను నాటుట, తక్కిన దినములు ఆమె తోటలో పూల మొక్కలను కూరగాయల మొక్కలను నాటుట, తన పొరుగువారితో పూలమొక్కలను మార్చుకొనుట ఇట్టి పనులను చేసెడివారు. తన బిడ్డలు గృహమును సర్వదా వాంఛనీయ స్థలముగా భావించుటకు గాను గృహమును సాధ్యమైనంత ఆనందదాయకముగా చేసెడివారు. CChTel 31.2

    వైటమ్మగారు జాగ్రత్తగా పరిశీలించికొనెడి వ్యక్తి. ఆమెతో కలిసి వస్తువులను కొనుగోలు చేసికొనుటకు ఎడ్వెంటిస్టు మహిళలు ఉబలాట పడెడివారు. కారణమేమనగా ఆమెకు వస్తువుల విలువ తెలియును. ఆమె తల్లి కుటుంబ బాధ్యతలను నిర్వహించుటలో చాల తెలివిగలది. కనుక ఆమె కుమార్తెలకు అనేక ఉపదేశములు సంగతులునేర్చినది. మంచిరకపు వస్తువులు చౌకరకపు వస్తువులకన్న ఎక్కువ కాలము మన్నునని ఆమె కనుగొనిరి. CChTel 31.3

    వారమంతటిలో పిల్లలకు సబ్బాతు అత్యానందకరమైన దినముగ చేయబడెను. సంఘారాధనకు కుటుంబమంతయు హాజరగును. ఎల్డరు వైటుగారు, వైటమ్మగారలకు ప్రసంగించు బాధ్యతలేకున్నచో ఆరాధన సమయమందు కుటుంబమంతయు కలిసి కూర్చుం డును. మధ్యాహ్నము వారమునందలి ఇతర దినములలో లేని ప్రత్యేక వంటకము ఉండును. పిదప వర్షము మున్నగు ఆటంకములు లేకున్నచో పిల్లలతో కలిసి శ్రీమతి వైటమ్మగారు అడవులలోను నదుల ప్రక్కను వాహ్యాళి చేసి ప్రకృతి సౌందర్యమును పరిశీలించి దైవ సృష్టిని గూర్చి పాఠములు పిల్లలకు నేర్పును. కాని అది వర్షము కురియుచున్న దినముగాని చలిగానున్న దినముగాని అయినచో పిల్లలను గృహమందు మంటచుట్టును పోగుచేసి తన పర్యటనలో పోగుచేసిన సాహిత్యమును వారికి తరచు చదివి చెప్పును. తల్లిదండ్రులు తమ బిడ్డలకు చదివి చెప్పుటకుగాను ఈ కథలలో కొన్ని తరువాతి గ్రంథములలో ముద్రింపబడినవి. CChTel 31.4

    ఈ సమయమందు వైటమ్మగారికి మంచి ఆరోగ్యము లేదు. ఆమె తరచు కండ్లు తిరిగి పడెడివారు. అయినను ఇది ఆమె గృహకృత్యములకు గాని దైవ సేవకుగాని అంతరాయము కలిగించలేదు. కొన్ని సంవత్సరముల అనంతరము, 1863లో ఆరోగ్యమును గూర్చియు, వ్యాధిగ్రస్తులకు చేయు పరిచర్యను గూర్చియు ఆమెకొక దర్శనముకలిగెను. ధరించవలసిన దుస్తులు, తినవలసిన ఆహారము, వ్యాయామము, విశ్రాంతియొక్క ఆవశ్యకత, బలమైన ఆరోగ్యవంతమైన శరీరమును కాపాడుకొనుటకు దేవునియందు విశ్వాసము యొక్క ప్రాముఖ్యత ఆమెకు ఆదర్శనమందు చూపబడెను. CChTel 32.1

    ఆహారము విషయము, మాంసాహారమందలి అపాయము విషయము దేవుడిచ్చిన ఉపదేశము ఆరోగ్యమునకు, బలమునకు మాంసాహారము అత్యవసరమను వైటమ్మగారి వ్యక్తిగత ఉద్ధేశ్యమును ఖండిరచినది. తనమనస్సును ప్రకాశవంతము చేయుటకు వచ్చిన దర్శనపు వెలుగు కలిగి, తన కుటుంబమునకు ఆహారమును తయారుచేయుటలో సహాయము చేయు బాలికకు ధాన్యము, కూరగాయలు, గింజలు, పాలు, మీగడ, గ్రుడ్లుతో సంపూర్ణాహారమును సిద్ధపరిచి భోజనపు బల్లపై నుంచుమని వైటమ్మగారు చెప్పిరి. బల్లపైపండ్లు సమృద్ధిగానుండెను. CChTel 32.2

    కుటుంబము భోజనమునకు రాగా మంచి బలవర్ధకాహారము సమృద్ధిగానున్నది. కాని మాంసము లేదు. శ్రీమతి వైటమ్మగారికి మాంసము లేకుండా భోజనము సహించలేదు. కనుక భోజనపు బల్ల విడిచి సామాన్య భోజనము తినుటకు మంచి ఆకలి కలుగు వరకు తిరిగి రావలదని నిశ్చయించుకొనెను. రెండవసారి భోజనమునకు కూర్చున్నప్పుడుకూడ అదే అనుభవము కలిగినది. ఆమెకు మనస్కరించలేదు. వారు భోజనము నకు మరల బల్ల వద్దకు వచ్చిరి. బల్లపై సామాన్యాహార పదార్థములున్నవి. బలము ఆరోగ్యము పెరుగుదలకు మంచివని దర్శన మందు చూపబడిన భోజన పదార్థములివే. కాని ఆమె అలవాటు పడిన మాంసము కొరకు ఆమె అధికకాంక్ష కలిగియున్నది. అయినను మాంసము మంచి ఆహారము కాదని ఆమె ఇప్పుడు గ్రహించినది. తన చేతులను కడుపుమీద పెట్టి దాని కిట్లు చెప్పినదని ఆమె సాక్ష్యమిచ్చిరి, “రొట్టె భుజించుటకు ఇష్టము పుట్టు వరకు నీవుఆగవచ్చును.”CChTel 32.3

    అచిరకాలములోనే ఎలెన్‌ వైటమ్మగారు సామాన్య ఆహార పదార్థములను భుజింప నారంభించిరి. ఆహారమందు కలిగిన ఈ మార్పుతో ఆమెకు ఆరోగ్యము చేకూరినది. తన జీవితశేషమంతయు ఆమెకు మంచి ఆరోగ్యము ఉన్నది. మనకున్న సమస్యలే వైటమ్మగారికి కూడా ఉండెను. భోజనము సందర్భముగా ఆమె జయమును సాధించవలసి వచ్చెను. అటువలె మనము కూడా భోజనము విషయము సాధించవలెను. ఆరోగ్య సంస్కరణ వైటు కుటుంబమునకు లోకమందలి వేవేల ఎడ్వెంటిస్టు కుటుంబములకును గొప్ప ఆశీర్వాదకరముగా నున్నది. CChTel 33.1

    ఆరోగ్య సంస్కరణాదర్శనము అనంతరము, వ్యాధిగ్రస్తులను బాగు చేయుటకు వైటు కుటుంబము సామాన్య పద్ధతులనుపయోగించనారంభించ మొదలిడగా, ఎల్లరు వైటు గారిని శ్రీమతి వైటమ్మగారిని తమ పొరుగువారు జబ్బుపడినప్పుడు చికిత్స చేయుటకు రావలసిందిగా కోరెడివారు. వారి కృషిని ప్రభువు ఎక్కువగా ఆశీర్వదించెను. కొన్ని సమయములలో వ్యాధిగ్రస్తులు వీరి గృహమునకు వచ్చి పూర్తి ఆరోగ్యమును పొందువరకు ఉండి తిరిగి పోయిరి. CChTel 33.2

    పర్వతములలోనో, సరసీ తములపైనో, పడవలోనో కూర్చుండి విశ్రమించుట యందు శ్రీమతి వైటమ్మ గారు ఆనందించిరి. నడివయస్సులో తాను అమెరికా పశ్చిమ భాగముననున్న మన పసిఫిక్‌ మాద్రాక్షరశాలకు సమీపముగా నివసించుతరి విశ్రాంతి యందు ఒక దినమును గడపవలెను. సలహా యియ్యబడెను. శ్రీమతి వైటమ్మగారు తన కుటుంబము, ఆఫీసు సిబ్బంది ప్రచురణాలయ కుటుంబములతో కలుపవలసినదని కోరబడగా ఆమె ఆ ఆహ్వానమును అంగీకరించెను. ఆమె భర్తగారు మిషను పనిమీద తూర్పు భాగమున నుండిరి. ఈ యనుభవమును గూర్చి ఆమె ఆయనకు ఒక ఉత్తరము వ్రాసిరి. CChTel 33.3

    సముద్రతీరమున తృప్తికరమగు భోజనము ఆరగించిన పిమ్మట ఆ జట్టు అం తయు శాన్‌ప్రాన్సిస్కో అఖాతములో పడవమీద వినోదార్థము ఏగెను. ఈ ఓడ నావికుడు మన సంఘ సభ్యుడే. మధ్యాహ్నము బహు ఆనందకరముగనున్నది. విశాల సముద్రములోనికి వెళ్ళవలసినదిగా ఒకరు ప్రతిపాదించిరి. ఆయనుభవమును పునరావలోకము చేయుచు వైటమ్మగారిట్లు రచించిరి. CChTel 33.4

    “తరంగములు పెల్లుబికినవి. మేము పైకి క్రిందకి వైభవముగా ఊపబడుచుంటిమి. నా ఉద్ధేశ్యములు సమున్నతములైనవి. కాని ఎవరికిని ఏమియు చెప్పజాలకుంటిని. అది చాల చక్కగనుండెను. మాపై తుంపరలు విసురుగా పడినవి. గోల్డన్‌ గేట్‌ వెలుపలగాలి బలముగా వీచుచుండెను. నాకు ఇంత ఆనందమును నా జీవితములో మరి ఏదియు నీయలేదు.”CChTel 34.1

    అప్పుడు నావికుని కండ్లనామె పరిశీలించినది. నౌకా దళము వారందరు ఆయన ఆజ్ఞ శిరసావహించ సిద్దముగానుండిరి. ఆమె ఇట్లు తలపోసెను:CChTel 34.2

    “దేవుడు గాలులను తన చేతులతో పట్టుకొని యున్నాడు. ఆయన నీళ్ళను తన అదుపాజ్ఞ క్రింద నుంచుచున్నాడు. పసిఫిక్‌ మహా సముద్రపు అగాధజలముల మీద మేము నలకలము మాత్రమే. అయినను తురంగవేగముతో పరుగెడుచున్న తరంగములలో ప్రయాణించుచున్న ఈ నావను కాపాడుటకు దేవదూతలు పంపబడిరి. ఆహా, దైవ కార్యములెంత ఆశ్చర్యకరమైనవి! అని అవగాహనకు అతీతమైనవి. ఒక్కచూపులోనే ఆయనకు మహోన్నతాకాశములు సముద్రగర్భము అగపడును”. CChTel 34.3

    చిన్నతనమందే శ్రీమతి వైటమ్మ గారికి సంతోషముగా నుండు మనస్తత్వము అబ్బినది. ఒకసారి ఆమె ఇట్లు ప్రశ్నించెను: “నేనెప్పుడైన విచారముగను, నిస్పృహగను ఉండి సణుగుటను చూచితిరా? నాకున్న విశ్వాసము దీనిని గర్హించుచున్నది. విరోధము గానుండు తీర్మానమునకు ఆదర్శ క్రైస్తవ శీలమును సేవను గూర్చిన దురవగాహనమే ఈ తీర్మానమునకు నడిపించును.. . క్రీస్తుకు చేయుహృదయపూర్వకమైన సేవ ఉత్సాహకరమైన మతమును ఉత్పన్నము చేయును. క్రీస్తును సన్నిహితముగా అనుసరించువారు విచారముగా నుండరు.” మరియొకసారి ఆమె ఇట్లు వ్రాసెను: “సంతోషముగా నుండుట క్రైస్తవ ప్రవర్తనా ప్రతిష్ఠకు భంగకరమని కొందరు అభిప్రాయపడెదరు. ఇది పొరపాటు. పరలోకము ఆనందమయము.” మందహాసము ఇచ్చుటద్వారా మందహాసము తిరిగి ఈయబడునని ఆమె కనుగొనెను; దయగా మాటలాడినచో దయతో మాటలు తిరిగి వినబడును. CChTel 34.4

    ఆమె ఎక్కువగా బాధలనుభవించిన దినములున్నవి. దైవసేవను స్థాపించుటకు ఆస్ట్రేలియాకు వెళ్ళినవెంటనే అట్టి అనుభవము ఒకటి కలిగెను. సుమారు ఒక సంవత్సరము పాటు ఆమె జబ్బుపడి చాల బాధకు గురియయ్యెను. ఎక్కువ భాగము ఆమె పరుండియే యుండవలసి వచ్చెను. రాత్రి సమయమందు కొన్ని గంటలు మాత్రమే నిద్రించ గలిగెను. ఈ యనుభవమును గూర్చి ఉత్తరములో ఒక స్నేహితురాలికి ఆమె ఇట్లు వ్రాసెను:CChTel 35.1

    “నాకు నిస్సహాయస్థితి ఏర్పడినప్పుడు సముద్రము దాటి వచ్చినందుకు సంతోషపడితిని. నేను అమెరికాలో ఎందుకు ఉంటినిగాదు? ఇంత ఖర్చుతో నేనీ దేశములో ఎందుకు ఉండవలెను? తరచు తలగడలో నా తలదూర్చి ఏడ్చితిని. కాని ఈ శోక బిందు భోగమును నేనెక్కువ కాలము అనుభవించలేదు. ఎలెన్‌ నీ యర్థమేమి? జనరల్‌ కాన్ఫరెన్సు వెళ్ళునున్న స్థలమునకు వెళ్ళుట నీ విద్యుక్త ధర్మమని నీవు తలంచిగదా ఆస్ట్రేలియాకు వచ్చినది?” అని నన్ను నేను ప్రశ్నించుకొంటిని. CChTel 35.2

    ”‘ఔను’ అని నేను ప్రత్తుత్తరము చెప్పుకొంటిని.
    “అట్లయినచో నీవు నిరాశ నిస్పృహలెందుకు చెందితివి?>br/> ఇది అపవాది పని కాదా? ‘ఔను, ఇది అపవాది పనే’
    అని సమాధానము చెప్పుకొంటిని.
    CChTel 35.3

    “సాధ్యమైనంత త్వరలో కన్నీటిని తుడుచుకొని ఇట్లంటిని, ‘ఇక చాలును; నేనిక విచారించను. నేను జీవించినను మరణించినను నాకొరకు మరణము పొందిన ప్రభువుకు నా ఆత్మను అప్పగించుచున్నాను’. CChTel 35.4

    “ప్రభువు అన్ని కార్యములను సక్రమముగా జరిగించునని నమ్మితిని. జబ్బు వచ్చిన ఈ ఎనిమిది మాసములలో నేనెప్పుడును నిస్పృహ చెందలేదు. ఇక్కడి ప్రజల శ్రేయస్సుకును అమెరికాలోని ప్రజల శ్రేయస్సుకును అనుభవము ప్రభువు మహా సంకల్పములో నొక భాగమని పరిగణించుచున్నాను. అది ఎందుకు? ఎట్లు? అనుదానిని నేను విశదీకరింపజాలను. కాని నేను దానిని నమ్మెదను. బాధలలో నేను సంతోషముగా నున్నాను. నా పరలోక జనకుని నేను నమ్మగలను. ఆయన ప్రేమను నేను శంకించను.”CChTel 35.5

    ఆమె జీవితములోని చివరి పదిహేను సంవత్సరములు కాలిఫోర్నియా యందలి తన గృహమందు వైటమ్మగారు నివసించిరి; ఆమెకు వృద్ధాప్యము దాపురించుచున్నది. కాని తన పొలములోని పని విషయమును, తనకుసహాయము చేసిన కుటుంబము క్షేమాభివృద్ధి విషయమును ఆమె శ్రద్ధ వహించిరి. పెందలకడనే నిద్రించి మధ్య రాత్రిలో నిద్ర లేచి గ్రంథరచన సాగించినట్లు మనకు గ్రాహ్యమగుచున్నది. అది వర్షము మున్నగు ఆటంకములు లేనిదినమైనచో, తనకు పని ఎక్కువగా లేకున్నచో గుర్రపు బండి మీద ఊరు బయటకు షికారుకు బయలుదేరి తోటలో పనిచేయు ఒక తల్లినో తాను కడచివెళ్ళుCChTel 36.1

    గృహాంగణలో నిలచియుండు తల్లినో పలుకరించెడిది. కొన్ని సార్లు ఆహారవస్త్రములు లేనివారు అగపడగా ఇంటికి వెళ్ళి లవారికి కావలసినవి తెచ్చి యిచ్చెడిది. ఆమె మరణానంతరము సంవత్సరముల పర్యంతము ఆ లోయయందలి తనCChTel 36.2

    పొరుగు వారి స్మృతిపథములో వైటమ్మగారు నిలిచియుండిరి. యేసునుగూర్చి చక్కగా మాటలాడిన వృద్ధురాలని వారామెను తలంచుకొనుచుండిరి. CChTel 36.3

    మరణించుసరికి ఆమెకు జీవితావసర విషయములకన్న ఎక్కువ ఆస్థి లేదు. తనను ఆదర్శముగా పరిగణించుడని ఇతరులకామె హితవు చేయలేదు. ఏలయనగా పునరుత్థానుడైన ప్రభువు సద్గుణములందు విశ్వాసముంచి ఆయన నియమించిన పనిని నమ్మకముగా చేయుటకు ఆమె కూడా మనవలె ప్రయాసపడు ఒక సెవెంతుడే ఎడ్వంటిస్టే. ఇట్లు, క్రైస్తవానుభవమునందు నిలకడగానున్న తన జీవితమును ఆమె విశ్వాసముతో చాలించెను. CChTel 36.4