Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “విశ్రాంతి దినమును. .. జ్ఞాపకముంచుకొనుము”

    నాల్గవ ఆజ్ఞయందు ప్రభువు “జ్ఞాపకముంచుకొనుము” అని హెచ్చరించెను. వివిధ మనో వ్యధలలోను చిక్కులలోను తగుల్కొని మానవుడు ధర్మశాస్త్ర విధులను నెరవేర్చక తప్పించుకొన జూచునని లేక దాని పవిత్ర ప్రాముఖ్యతను మరచి పోవునని దేవునికి అవగతమే. కాబట్టి ఆయన “విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము” అని హెచ్చరించెను. నిర్గమ 20:8. CChTel 68.4

    వారమంతయు సబ్బాతును గూర్చి మనము తలంచుచు ఆజ్ఞానుసారము దాని నాచరించుటకు సిద్ధపడవలెను. సబ్బాతును మనము కేవలము ఒక చట్ట విధాయక కార్యమువలె ఆచరించుట కూడదు. జీవిత వ్యవహారములన్నింటను దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మనము గ్రహించవలెను. తమను పవిత్రవరము దైవము ఆయనే యని చూపించుచు దేవునికిని తమకును మధ్య సబ్బాతు ఒకటి ఉన్నదని గుర్తించువారందరు ఆయన ప్రభుత్వ సూత్రములకు ప్రతినిధులై యున్నారు. ఆయన రాజ్యశాసనములను వారు తమ దైనందిన జీవితములందుపాటింతురు. సబ్బాతు పవిత్రత తమపై నుండగలందులకు వారనుదిన ము ప్రార్థింతురు. అనుదినము వారు క్రీస్తుతో స్నేహము కలిగియుందురు. అందువలన ఆయన శీలమువంటి సంపూర్ణ శీలము ప్రతిబింబింతురు. సత్క్రియలద్వారా ఇతరులకు తమ వెలుగు దినదినము కనపర్చెదరు. CChTel 69.1

    దైవ సేవా విజయమునకు సంబంధించినంతవరకు గృహజీవితమందే ప్రథమ విజయములు సాధించబడవలెను. సబ్బాతు కు సిద్దబాటు ఇక్కడనే ప్రారంభము కావలెను. తమ గృహము తమ బిడ్డలను పరలోక న్యాయస్థానమునకు సిద్ధము చేయుటకు ఒక పాఠశాలగా నుండవలెనని తల్లిదండ్రులు వారము పొడుగున జ్ఞాపకముంచుకొనవలెను. వారి పలుకులు సరళముగా నుండవలెను. పిల్లలు వినరాని మాటలు వారి పెదవుల నుండి రాకూడదు. కోపతాపములకు లోనుగాకుండా మనస్సు నాధీనమందుంచుకొనవలెను. తల్లిదండ్రులారా, తన కొరకు శిక్షణ నిచ్చు నిమిత్తము మీకు బిడ్డలననుగ్రహించిన పరిశుద్ధ దేవుని సన్నిధిలో మెలగునట్లే మీరు వారమంతయు మెలగుడి. విశ్రాంతి దినమున అందరును ప్రబుని గుడారమందు ఆరాధించుటకు సిద్ధపడు నిమిత్తము మీ చిన్న గృహా సంఘమును ఆయన కొరకు తర్బీతు చేయుడి. ఉదయ సాయంకాలములందు దేవునికి మీ బిడ్డలను ఆయన రక్తముతో కొనబడిన స్వాస్థ్యముగా సమర్పించుడి. దేవుని ప్రేమించి ఆయన సేవ చేయుట వారు నెరవేర్చవలసిన గొప్ప విధియనియు అపూర్వావకాశమనియు వారికి నేర్పించుడి. CChTel 69.2

    ఇట్లు సబ్బాతు జ్ఞాపకముంచుకొనబడినచో ఆధ్యాత్మిక విషయముల స్థానమును భౌతిక విషయములు ఆక్రమింపజాలవు. పని దినములైన ఆరు దినములలో చేయబడవలసిన ఏ కార్యమును సబ్బాతుకు విడువరాదు. ప్రభువు విశ్రమించి ప్రశాంతి నొందిన దినమున ఆయన సేవ చేయలేనంతగా వారమంతయు మనము పనిచేసి శక్తిహీనులమై అలసిపోరాదు. CChTel 69.3

    సబ్బతు కొరకు వారమంతయు సిద్ధపడవలసియున్నను “శుక్రవారము ప్రత్యేకమగు సిద్దబాటుదినమై యున్నది. మోషే ద్వారా ప్రభువు ఇశ్రాయేలియులకు ఇట్లు చెప్పెను. CChTel 69.4

    “రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయము వరకు మిగిలిన దంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను”, “జనులు తిరుగుచు దానిని(సున్నాను) కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోటదంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి తైలభక్ష్యముల రుచివలె నుండెను”. నిర్గమ 16:23; సంఖ్యా. 11:8. CChTel 70.1

    ఇశ్రాయేలీయులకు పరము నుండి పంపబడిన రొట్టెను తయారు చేయుటలో ఇంకను కొంత పనియుండెను. సిద్దబాటు దినమగు శుక్రవారమున ఈ పనిని వారు చేయవలెనని ప్రభువు చెప్పెను. CChTel 70.2

    సబ్బాతు కొరకైన సిద్దబాటు శుక్రవారమున సమాప్తి కావలెను. బట్టలను సిద్ధము చేసికొని కావలసిన పంటలను ఆనాడు ముగియునట్లు చూడవలెను. పాదరక్షలకు మెరుగు ఆ దినమున పెట్టుకొనవలెను; స్నానములు ఆదినమున ముగియవలెను. ఇది సాధ్యమే. చినిగిన దుస్తులను కుట్టుకొనుటకుగాని, ఆహారము వండుకొనుటగాని, వినోదముల తేలియాడుటకుగాని లేక మరేయితర ప్రపంచ వ్యవహారములను చూచుకొనుటకుగాని సబ్బాతు వినియోగించబడ వీలు లేదు. ప్రొద్దు గ్రుంకకముందే ప్రపంచ వ్యవహారములను, పత్రికలను దూరముగా త్రోసివేయుడి. తల్లి దండ్రులారా మీ బిడ్డలకు మీ పనిని దాని ఉద్ధేశ్యమును విశదపరచు ను. ఆజ్ఞానుసారముగా సబ్బాతు నాచరించుటకు మీ సిద్దబాటులో వారిని కూడా పాల్గొననీయుడి. CChTel 70.3

    సబ్బాతు ప్రారంభ ఆంత్య ఘడియలను మనము కడు శ్రద్ధగా కాపాడవలెను. ప్రతి నిమిషము సమర్పితమైన పవిత్ర సమయమని జ్ఞప్తియందుంచుకొనుడి. సాధ్యమైనపుడెల్ల అధికారులు తమ పని వానికి శుక్రవారము మధ్యాహ్నము నుండి సెలవునీయవలెను. నిశ్చలిత హృదయముతో ప్రభువు దినమేను వారు ఆహ్వానించ సిద్ధపడుటకు గాను వారికి సమయమీయుడి. ఇది చేయుటవలన లోక విషయములందు సయితము మీకు నష్టము కలుగదు. CChTel 70.4

    సన్నాహదినమున గమనింపవలసిన పని మరియొకటి కలదు. ఈ దినమున సహోదరుల మధ్య, కుటుంబమునందు, సంఘమునందు, గల అసమాధానములు చక్కజేయబడ వలెను. ద్వేషము, క్రోధము, మాలిన్యము సమస్తము హృదయమునుండి విసర్జింపబడవలెను. దీన హృదయముతో “మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వాస్థత పొందునట్లు ఒకనినొకరు ప్రార్థనచేయుడి”. యాకోబు 5:16. 26T 353-356;CChTel 70.5

    దేవుని దృష్టిలో సబ్బాతునకు భంగమని యెంచబడు మాటలను కార్యములను మానివేయుట మంచిది. సబ్బాతు దినమున శరీరసంబంధమగు పని నుండి విశ్రమించుట మాత్రమేగాక పరిశుద్ధాంశములపై మనము ధ్యానించునట్లు మనస్సు శిక్షణ చేయబడవలెనని దేవునివాంఛ, లోకవార్తలు చెప్పుకొనుట, పనికిమాలిన విషయమును గూర్చి సంభాషించు కొనుటద్వారా నాల్గవ యాజ్ఞ సాధారణముగా అతిక్రమించబడుచున్నది. మన మనస్సునకు వచ్చు ప్రతి దానిని గూర్చి చర్చించుకొనుట కూడా మన సొంత మాటలు మాట్లాడుకొనుటయే. సన్మార్గము నుండి తొలగిపోవునపుడ్లె మనము దాస్యమునకును, శిక్షావిధికిని లోనగుదుము. 32T 703;CChTel 71.1