Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నమమకముగా నున్నవారికి బహుమానము.

    నా సహోదరా, నా సహోదరీ, మేఘములలో క్రీస్తు రాకడ కొరకు సిద్దపచుడని మిమ్మును బ్రతిమాలుచున్నాను. దిన దినము మీ హృదయమునుండి లోక వ్యామోహ మును విసర్జించుడి. క్రీస్తుతో సాంగత్యము కలిగియుంచుట యననేమో అనుభవము ద్వారా గ్రహించండి. క్రీస్తు వస్తున్నప్పుడు నమ్ము వారందరితో అభినందించబడి ఆయనను సమాధాన మందు కలిగికొను వారిలో ఉండులాగున తీర్పుకు సిద్ధపడుడి. ఆ దినమున విమోచించబడిన వారు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు వెలుగులో ప్రకాశించెదరు. దేవ దూతలు తమ బంగారు వీణెలు మీటుచు రారాజును గొర్రెపిల్ల రక్తముతో తెల్లగా చేయబడిన వారిని ఆహ్వానించెదరు. విజయ గీతముతో పరము మారు మోగును. క్రీస్తు జయించెను. విమోచించబడిన వారిని వెంటబెట్టుకొని ఆయన పరలోకమందు ప్రవేశించును. ఆయన అనుభవించిన బాధ, చేసిన త్యాగము వ్యర్థము కాలేదనుటకు వీరు సాక్షులు. CChTel 530.5

    మన ప్రభుని పునరుత్థానము, ఆరోహణము, పరిశుద్ధులు మరణమును సమాధిని తెరుతురనుటకు ప్రబల నిదర్శనములు. మరియు శీలమును వస్త్రములను గొర్రెపిల్ల రక్తమందు ఉతుకుకొని వానిని తెల్లగాజేసికొను వారికి పరలోకమును గ్రహించబడునటుకిది యొక వాగ్దానము. క్రీస్తు మానవ ప్రతినిధిగా పరలోకమునకేగెను. తన స్వరూపమును ప్రతిబింబించు వారిని ఆయన మహిమను చూచుటకు ఆయనతో దానిని పంచుకొనుటకు దేవుడు వారిని తోడుకొని వచ్చును. CChTel 531.1

    ఇహలోక యాత్రికులకు గృహములున్నవి. నీతిమంతులకు వస్త్రములు, మహిమా కిరీటములు విజయ సూచకములైన మట్టలు వున్నవి. దేవుని నడుపుదల యందు కలవరము పుట్టించిన దంతయు రానైయున్న ప్రపంచ మందు సుస్పష్టము చేయబడును. గ్రహించుట కష్టమగు విషయములు అప్పుడు విశదమగును. కృపా మర్మములు మనకు తెల్పబడును. పరిమితమైన మనస్సులు కనుగొనగలిగిన గలిబిలి, భగ్న వాగ్దానములు స్థానే సంపూర్ణమైన, రమ్యమైన సమన్వయతను మనము దుర్భరములుగా కాన్పించిన యిట్టి యనుభవములను అపార ప్రేమా పూర్ణుడే రానిచ్చెనని మనము తెలిసికొనెదము. అన్నింటిని మన మేలు కొరకే చేయు ఆ ప్రభుని దయాపూరితమైన కాపుదలను మనము గుర్తించుకొలది అనిర్వచనీయానందమును మహిమను పొందెదము. CChTel 531.2

    పరమందు బాధ ఉండజాలదు. రక్షించబడిన వారి గృహమందు కన్నీరు, మరణ శయ్యలు, దు:ఖ చిహ్నములు నుండవు. “నాకు దేహముతో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు”. దానిలో నివసించు జనులు దోషము పరిహరించుబడును.” యెష. 33:24. వారు నిత్యము గొప్ప ఆనందముతో నివసించెదరు. CChTel 531.3

    మన నిత్య జీవ నిరీక్షణకు కేంద్రమైన ప్రభుని తమనము త్వరలో చూతుము. బాధలు కొరగానివిగా నుండును. “కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలమనగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై వాగ్దానము పొందు నిమిత్తము మీరు ఓరిమి కలిగి యుండుట అవసరము.” ఇక కాలము బహు కొంచముగా నున్నది. వచ్చుచున్నవాడు ఆలశ్యముచేయక వచ్చును” హెబ్రీ 10:35`37. పైకి చూడుడిÑ పైకి చూడుడి. మీ విశ్వాసము నిత్యము వృద్ధికావలెను. రక్షించబడిన వారి కొరకు ఏర్పాటుచేయబడిన అత్యధిక భావి మహిమలోనికి సంకుచిత మార్గము గుండా పరిశుద్ధ పట్టణ ద్వారములో నుండి యీ విశ్వాసము. మిమ్మును నడుపును గాక”. సహోదరులారా, ప్రభువును ఆగమన పర్యంతము ఓపిక కలిగి యుండుడి. చూడుడిÑ వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు పర్యంతము విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టునుగదా? ప్రభువు ఆగమనము సమీపించుచున్నది గనుక ఓపిక కలిగి యుండుడి.” యాకోబు 5:7,8. 59T 285-288;CChTel 532.1

    “మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షబడలేదు. గాని ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము”. CChTel 532.2

    కనుక తన పని యొక్క ఫలితములయందు క్రీస్తు దాని బహుమానమును చూచును. ఏ మానవుడును లెక్కింపజాలని జనసమూహములో “అత్యధిక ఆనందము”తో ఆయన మహిమాన్విత సముఖమున “ఎవని రక్తము మనకు విమోచన నిచ్చినదో ఎవని జీవితము మనకు ఆదర్శ ప్రాయమైనదో ఆ ప్రభువు” తన హృదయవేదనను చూచి తృప్తి చెందును”. 6Ed. 309. CChTel 532.3