Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    జీవితములను మార్చిన వర్తమానములు

    మిషిగన్‌ రాష్ట్రములోని బుష్‌నెల్‌ నగరములో ఒక సువార్తికుడు కూటము పెట్టెను. బాప్తిస్మముల అనంతరము అతడు విశ్వాసులకు బలమైన పునాది వేయకుండ వారిని విడిచిపోయెను. ప్రజలు క్రమేపి అధైర్యము చెందిరి. వారిలో కొందరు తమ ప్రాచీన దురభ్యాసములను తిరిగి మొదలు పెట్టిరి. మెట్టుకా సంఘము క్షీణదశకు వచ్చెను. మిగిలిన 10 లేక 12 మంది సభ్యులు ఇక సంఘమందుండుట లాభములేదని నిశ్చయించుకొనిరి. చివరిదని వారు తలంచిన కూటమునకు వారు వెళ్ళిన వెంటనే టపా వచ్చినది. వచ్చినఉత్తరములలో నొకటి “రివ్యూ అండ్‌ హెరాల్డు”. ఈ పత్రికయందు పర్యటనా కార్యక్రమములో ఎల్డరు వైటుగారు, శ్రీమతి వైటమ్మగారు జూలై 20, 1867 తారీఖున కూటములు జరుపుటకు బుష్‌నెల్‌లో ఉందురను ప్రకటన గలదు. ఒక వారములోనే వారి రాక. ఇండ్లకు వెళ్ళుచున్న సభ్యులను వెనుకకు పిలుచుకొని వచ్చు నిమిత్తము పిల్లలు పంపబడిరి. తోటలో ఒక స్థలము సిద్ధము చేయవలెననియు సభ్యులు తమ పొరుగువారిని, ముఖ్యముగా సంఘమును విడిచి పోయిన సభ్యులను ఆహ్వానించవలెనని నిర్ణయించబడినది. CChTel 36.5

    జూలై 20, సబ్బాతు ఉదయమున ఎల్డరు వైటుగారు శ్రీమతి వైటమ్మగారు అరువది మంది గుమిగూడిన ఆ తోటకు వెళ్ళిరి. ఉదయము ఎల్డరు వైటుగారు మాట్లాడిరి. మధ్యాహ్నము శ్రీమతి వైటమ్మగారు మాట్లాడుటకు లేచిరి. కాని మూలవాక్యము చదివిన పిమ్మట ఆమె తికమక పడినట్లగపడెను. ఏమియు చెప్పకుండా బైబిలు మూసి వారితో వ్యక్తిగత ధోరణిలో మాటలాడనారంభించెను. CChTel 37.1

    “ఈ మధ్యాహ్న సమయమున నీముందు నేను నిలుపబడగా రెండు సంవత్సముల క్రిందట నాకు దర్శనమందు చూపబడిన వారి ముఖములు కనబడుచున్నవి. మీ ముఖములలోనికి చూచుచుండగా మీ యనుభవము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. దేవుని వద్ద నుండి మీకు ఒక వర్తమానము తెచ్చియున్నాను. CChTel 37.2

    “ఆ అనాసచెట్టు సమీపముననున్న సహోదరుని నేను చూచితిని. నేను మీ పేరు చెప్పలేను. ఏలయనగా మీతో నాకు పరిచయము లేదు. కాని మీ ముఖము నాకు తెలిసినదే. మీ అనుభవము నాకు స్పష్టముగా జ్ఞాపకమున్నది.” అప్పుడే ఆ సహోదరుడు వెనుకంజ వేయుటను గూర్చి ఆమె అతనితో మాటలాడెను. తిరిగి వచ్చి దైవ ప్రజలతో నడువవలసినదని యాతనిని ఆమె ప్రోత్సహించెను. CChTel 37.3

    పిదప సభలో నున్న ఒక సహోదరి వైపుకు తిరిగి వైటమ్మగారిట్లు చెప్పిరి: “గ్రీన్‌నిల్‌ సంఘమునకు చెందు సహోదరి మేనార్డ్‌ ప్రక్క కూర్చున్న ఈ సహోదరి ` పేరు నాకు ఎరుక పర్చబడలేదు. గనుక తెలియదు`రెండు సంవత్సరముల క్రితము మీ సంగతి నాకు దర్శనమందు చూపబడినది. మీ యనుభవము నాకు తెలిసినదే” సహోదరి వైటమ్మగారు అప్పుడామెకు ప్రోత్సాహమిచ్చిరి. CChTel 37.4

    “వెనుక సింధూర వృక్షము ప్రక్కనున్న సహోదరుడా, మీ పేరు నాకు తెలియదు. నేను మిమ్ము నెన్నడును కలిసికొనలేదు. కాని మీ సంగతి నాకు విస్పష్టముగా తెలియును.” అక్కడున్న వారందరికి ఈ సహోదరుని అంతరంగిక ఉద్దేశ్యమును ఎరుకపరచి అతని యనుభవముగూర్చి వారికి చెప్పెను. CChTel 37.5

    ఆ సభులోని వారందరికి తమ్మును గూర్చి రెండు సంవత్సరములకు పూర్వము దర్శనమందామెకేమి చూపబడునో వ్యక్తము చేసెను. శ్రీమతి వైటమ్మగారు గద్దింపులేగాక ప్రోత్సాహముతోకూడిన ఆ ప్రసంగమును ముగించిన పిమ్మట కూర్చుండెను. సభలోని ఒక వ్యక్తి లేచి యిట్లనెను. “ఈ మధ్యాహ్న సోదరి వైటమ్మగారు మనకు చెప్పినదంతయు నిజమో కాదో నేను తెలుసు కొనగోరు చున్నాను. ఎల్లరు వైటుగారు శ్రీమతి వైటమ్మగారు ఇక్కడకు ఎప్పుడును రాలేదు. మనలను వారు ఎరుగరు. మనలో ఎక్కువమంది పేళ్ళు సోదరి వైటమ్మగారెరుగరు. అయినను ఈ మధ్యాహ్నము ఆమె యిక్కడకు వచ్చి రెండు సంవత్సరముల క్రిందట తనకొక దర్శనము కలిగినదనియు అందు మన సంగతులు ఆమెకు చూపబడినవనియు చెప్పుచు మనలో ఒక్కొక్కరితో వ్యక్తిగతముగా మాటలాడి ప్రతివాని జీవిత విధానమును, ఆంతరంగిక ఆలోచనలను బయలుపర్చెను. ఇవన్నియు నిజమేనా? లేక సోదరి వైటమ్మగారు పొరబడిరా? లేక సోదరి వైటమ్మగారు పొరబడిరా? నేను తెలిసికొనగోరుచున్నాను” అని పలికెను. CChTel 38.1

    ఒకరి తరువాత ఒకరు ప్రజలందరు లేచిరి. అనాస చెట్టు ప్రక్కనున్న వ్యక్తి లేచి తాను చెప్పగలిగినదానికన్న తననుగూర్చి సోదరి వైటమ్మగారు ఎక్కువగా చెప్పిరని పలికెను. తానవలంభించిన అవిధేయ మార్గమును గూర్చి అతడు క్షమాపణ కోరెను. తిరిగి వచ్చి దైవ ప్రజలతో కలిసినడువ నపేక్షించుచున్నానని అతడు వ్యక్తము చేసెను. గ్రీన్‌ విల్‌ సంఘమునకు చెందిన సహోదరి మేనాల్డ్‌ ప్రక్క కూర్చున్న సహోదరి కూడా లేచి సాక్షమిచ్చినది. తన అనుభవమును సోదరి వైటమ్మగారు తాను చెప్పగల్గినదానికన్న వివరముగా చెప్పెనని సాక్షమిచ్చెను. సిందూర వృక్షము ప్రక్క కూర్చున్న వ్యక్తి లేచి సహోదరి వైటమ్మగారు తన వృత్తాంతము తాను చెప్పగలిగినదానికన్న సవివరముగా వివరించగలిగెనని చెప్పెను. ఈతనకామె గద్దింపు ప్రోత్సాహముల నిచ్చెను. అందరు క్షమాపణ కోరిరి. పాపములను విసర్జించిరి. దైవాత్మ వారిలో ప్రవేశించెను. బుష్‌నెల్‌ సంఘం ఉజ్జీవము పొందెను. CChTel 38.2

    మరుసటి సబ్బాతు ఎల్లరు వైటుగారు శ్రీమతి వైటమ్మగారు తిరిగి వచ్చిరి. బాప్తిస్మము లీయబడినవి. బుష్‌నెల్‌ సంఘము స్థిరపడి వృద్ధి జెందినది. CChTel 38.3

    తనపై నాధారపడువారందరిని ప్రేమించునట్లు ప్రభువు బుష్‌నెల్‌లోని ప్రజలను ప్రేమించెను. “నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందును.” (ప్రకటన 3:19) అను వచనము వారిలో కొందరి మనస్సులకు వచ్చియుండవచ్చును. CChTel 38.4

    దైవ ప్రేరేపణ వలన ప్రజలు తమ హృదయముల నిజస్థితిని వారు గ్రహించి, తమ జీవితములలో పరివర్తన కలుగవలెనని ఆపేక్షించిరి. వైటమ్మ గారికీయబడిన అనేక దర్శనముల ముఖ్యోద్దేశమిదే. CChTel 39.1

    ఎల్లరు వైట్‌గారి మరణానంతరము శ్రీమతి వైటమ్మగారు హీల్డ్స్‌బర్గు కళాశాలకు సమీపముగా నుండిరి. కళాశాల విద్య నభ్యసించు అనేక యువతులు ఆమె గృహమందుండిరి. ఆ దినములలో తల వెండ్రుకలు చెదిరిపోకుండ క్రమముగా నుంచుకొనుటకు చిక్కములను ఉపయోగించు ఆహారము కలదు. ఒక దినము వైటమ్మ గారి గదిలో నుండి పోవునపుడు ఒక యువతికి మంచి తల వెంట్రుకల చిక్కము కనుబడినది. దానిని ఆమె ఆశించినది. అది పోయినట్లు ఆరా రాదని తలంచును. ఆ యువతి దానిని తీసి తన పెట్టెలో నుంచుకొన్నది. కొంత సేపటికి శ్రీమతి వైటమ్మగారు బయటికి వెళ్ళుటకు సిద్ధపడుచు తల వెంట్రుకల చిక్కమును కనుగొనజాలక అది లేకుండానే వెళ్ళిరి. సాయంకాలం కుటుంబ సభ్యులందరు సమావేశమైనపుడు శ్రీమతి వైటమ్మగారు తన వెంట్రుకల చిక్కమునుగూర్చి అడిగిరి. కాని అది ఎక్కడున్నదో ఎవరికి తెలిసినట్లు కాన్పించలేదు. CChTel 39.2

    ఒకటి రెండు దినములు కడచిన పిదప వైటమ్మగారు ఆ యువతి గదిలోనుండి వెళ్ళుచుండగా “ఆ పెట్టె తెరువుము” అను శబ్దము వినబడెను. అది ఆమె పెట్టె కాదు గనుక దానిని తెరచుటకామె ఇష్టపడలేదు. రెండవసారి ఆ స్వరము దూత స్వరమనీ గుర్తించిరి. ఆ పెట్ట తెరచినపుడు దూత ఎందుకట్లు పలికెనో గుర్తించిరి. ఆమె తల వెంట్రుకల చిక్కము అందున్నది. కుటుంబము మరల కూడినప్పుడు శ్రీమతి వైటమ్మగారు చిక్కమును గూర్చి మరలఅడిగి దానంతట అది మాయముకాజాలదని పల్కిరి. ఎవరును మాటలాడనందున వైటమ్మగారు ఆ ప్రస్తావన మానిరి. CChTel 39.3

    కొన్ని దినములైన పిదప వైటమ్మగారు వ్రాత పని నుండి విశ్రాంతి తీసికొనుచున్న సమయమున ఒక చిన్న దర్శనము కలిగినది. ఒక యువతి యొక్క హస్తము కిరసనాయిలు దీపములో తల వెంట్రుకల చిక్కమును ముంచుటచూచిరి. నిప్పు అంటించగానది భగ్గున మండిపోయెను. దానితో ఆ దర్వనము ముగిసినది. CChTel 39.4

    ఆ కుటుంబము మరల సమావేశమకైనపుడు చిక్కము మాయమైన సంగతిని గూర్చి వైటమ్మగారు ప్రస్తావించిరి. ఎవరును ఒప్పుకొనుటలేదు. అది ఎక్కడున్నది ఎవరికి ఎరుక లేనట్లు అగుపడినది. కొంతసేపైన పిమ్మటవైటమ్మగారీ యువతిని వెలుపలకు పిలిచి ఆ స్వరమును గూర్చియు పెట్టెలో తాను చూచిన దానిని గూర్చియు తనకు కలిగిన ఆ చిన్న దర్శనము గూర్చియు అందు తలవెంట్రుకల చిక్కము తగులబడుటను గూర్చియు ఆమెకు చెప్పిరి. ఈ సమాచారము విన్న తరువాత ఆ యువతి తాను ఆ చిక్కమును తీసితిననియు పట్టుబడకుండునట్లు దానిని కాల్చివేసితిననియు ఒప్పుకొన్నది. ఆ విషయమును వైటమ్మగారితోను, దేవునితోను సరిచేసుకొన్నది. CChTel 39.5

    తల వెంట్రుకల చిక్కమే గద; ఇది చాల చిన్న విషయము; దేవుడు దీనిని లెక్క చేయడని తలంచవచ్చును. కాని దొంగిలించబడిన వస్తువు విలువకన్న అది ప్రాముఖ్యమైన విషయము. ఈ యువతి సెవెంతుడే ఎడ్వంటిస్టు సంఘ సభ్యురాలు. ఇది పరవాలేదులే అని ఆమె అనుకొన్నదిగాని తన శీలమునందలి లోపములను గుర్తించినదికాదు. దొంగలించి మోసగించుటకు నడిపిన స్వార్థపరత్వమును ఆమె చూచినదికాదు. చిన్న విషయములు కూడా దేవుడు తన భూలోకరాయబారికి తల వెంట్రుకల చిక్కమునుగూర్చి దర్శనమిచ్చునంత ప్రాముఖ్యమైనవని ఈ యువతి గుర్తించినప్పుడు ఆమె వాస్తవిక విషయములను సరిగా చూడగలిగినది. ఈ యనుభవమును ఆమె జీవితమును మార్చినది. అప్పటి నుండి ఆమె యధార్థ క్రైస్తవ జీవితము జీవించినది. CChTel 40.1

    అందులకే శ్రీమతి వైటమ్మగారికి దర్శనము లీయబడినవి. శ్రీమతి వైటమ్మగారు వ్రాసిన సాక్ష్యములలోనెక్కువ భాగము ప్రత్యేక వ్యక్తులకు సంబంధించినవియైనను, ప్రపంచములోని ప్రతి సంఘముయొక్క అవసరతలను తీర్చగల సూత్రములు అందున్నవి. సాక్ష్యముల ఉద్దేశ్యమును, స్థానమును ఈ మాటలలో వైటమ్మగారు వ్యక్తపరచిరిఫCChTel 40.2

    “రచించబడిన సాక్ష్యములు క్రొత్త వెలుగునిచ్చుటకు ఉద్దేశించబడలేదు. కాని బైబిలులో క్రితము ఇయ్యబడిన సత్యములను హృదయములకు స్పష్పరచుటకే. దైవవాక్యమందు దేవుని యెడల, సహమానవుల యెడల మనధర్మములు విస్పష్టముగా నిర్దేశింపబడినవి. అయినను ఇయ్యబడిన వెలుగునుమీలో కొద్దిమంది మాత్రమే అనుసరించుచున్నారు. అదనముగా సత్యము ఇయ్యబడలేదు. కాని ముందీయబడిన మహత్తరసత్యములను సాక్ష్యముల ద్వారా దేవుడు సులభగ్రాహ్యమొనరించి యున్నాడు.. .. . సాక్ష్యములు దైవ వాక్యమును చులకన చేయుటకు రాలేదు. దానిని ఘనపరచి సత్యము యొక్క రమ్యత,సరళత అందరికి అవగతమగులాగున మానవ మనస్సులను దైవ వాక్యమునకు ఆకర్షించుటకే యివి వెలసినవి.”CChTel 40.3

    తన జీవితాంతరము వరకు వైటమ్మగారు దైవ వాక్యమును ప్రజలకట్టెదుట పెట్టిరి. తన ప్రథమ గ్రంథము నామె యీ యుద్దేశ్యముతో ముగించెనుఫCChTel 41.1

    “ప్రియ పాఠక మహాశయా, మీ యాచరణకు ప్రమాణముగా దైవవాక్యమును మీకు సిఫారసు చేయుచున్నాను. ‘అంత్యదినములలో’ దర్శనములిత్తునని ఆ వాక్యమందు దేవుడు వాగ్దానము చేసియున్నాడు. విశ్వాసమునకొక నూతన ప్రమాణముగా సాక్ష్యముల నీయలేదుగాని దైవ ప్రజల ఆదరణ కొరకు బైబిలు సత్యములను వీడి తప్పు చేయు వారిని సరిదిద్దుటకు ఇవి ఇయ్యబడినవి.”CChTel 41.2