Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    కానున్న భర్త యందుండవలసిన లక్షణములు

    పాణిగ్రహణమునకు ముందు ప్రతి స్త్రీ తానెవనితో జతపడనున్నదో అతడు యోగ్యుడో కాడో భోగట్టా చేయవలెను. అతని గత చరిత్ర యెట్టిది? అతడు పవిత్ర జీవియేనా? అతని ప్రేమ యోగ్యమైనదా? సమున్నతమైనదా? లేక కేవలము అది క్షణికమైన మమకారమేనా? ఆమెను సంతోషపర్చగల గుణగణములాతని యందు గలవా? అతని ప్రేమయందామెకు నిజమైన సమాధానము, ఆనందము లభించునా? ఆమె తన వ్యక్తిత్వమును కాపాడుకొనుటకు వీలుండునా? లేక తన వివేచన, మనస్సాక్షి తన భర్త అదుపులో నుంచవలసి యుండునా? దైవ విధులను సమున్నములుగా నామె గౌరవించగలదా? శరీరాత్మలు, ఉద్దేశ్యములు, లక్ష్యములు పరిశుద్దములుగా నుంచుకొన వీలున్నదా? వివాహమాడదలచు ప్రతి స్త్రీ సుక్షేమము ఈ ప్రశ్నలపై నాధారపడి యుండును. CChTel 254.2

    సమాధానకరమయిన, ఆనందదాయకమైన జతనపేక్షించు స్త్రీ, భావి దు:ఖములను తప్పించుకొనగోరు స్త్రీ తన ప్రేమను దానము చేయకముందు, నా ప్రియునికి తల్లి యున్నదా? ఆమె గుణశీలము లెట్టివి? ఆమె పట్ల తన విధుల నీతడు గుర్తించుచున్నాడా? ఆమె కోర్కెలను ఆనందమును ఈతడు లక్షించుచున్నాడా? అని భోగట్టా చేయవలెను. అతడు తన తల్లిని గౌరవించుకున్నచో తన భార్యకు గౌరవము, ప్రేమ, దయ, శ్రద్ధ కనపర్చునా? పెండ్లి బులుపు తీరిన మీదట నన్ను ప్రేమించునా? నా తప్పిదములను పైచునా లేక విమర్శ, అసహనము నియంతృత్వము కలిగి యుండునా? ఋజుప్రేమ అనేక అపరాధములను ఉపేక్షించును. ప్రేమ వానికి సరకు చేయదు. CChTel 254.3

    పవిత్రమైన పురుష లక్షణములు గలవానినే, శ్రద్ధ, ఆసక్తి, నమ్మకము కలిగి దేవుని ప్రేమించి ఆయనకు భయపడు వానినే యువతి తన ప్రాణ నాధునిగా ఎన్నుకొనవలెను. CChTel 255.1

    అమర్యాదపరులను విసర్జించవలెను. సోమరితనమును ప్రేమించు వానిని విసర్ణించవలెను. పరిశుద్ధ సంగతులను గేలిచేయువానిని వర్జించవలెను. దుర్భాషలాడువానితో గాని మద్యపాన ప్రియునితో గాని స్న్రేహించరాదు. దేవుని యెడల తనకు బాధ్యతను గుర్తెరుగని వానిని వివాహమాడరాదు. దేవుని ప్రేమించక ఆయనకు భయపడక నీతి సూత్రములను ఎరుగక యుండు సుందరుని తోడి స్నేహమును తెగత్రెంపులు చేసుకొనుటకు ప్రతిష్టపరుచు సత్యమే మీకు ధైర్యము నిచ్చును. ఒక స్నేహితుని బలహీనతలను అజ్ఞానమును మనము సర్వదా సహించవచ్చును. గాని యాతని దుర్మార్గములను సహించలేము. CChTel 255.2