Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు ముందు ఐకమత్యము అవసరము

    ఉన్నత స్థానము కొరకు తాపత్రయ పడుటమాని శిష్యులు ఏకమస్కులై యున్నపుడే పరిశుద్ధాత్మ క్రుమ్మరింప బడెనని గుర్తించునది. వారు ఏకాభిప్రాయులై యుండిరి. మనస్మర్థనలను విసర్జించిరి. పరిశుద్ధాత్మ క్రుమ్మరించబడక పూర్వము ప్రకటింపబడిన సువార్తయే అనంతరముకూడ ప్రకటింపబడినది. ఈ వాక్యము గమనించుడి. “విశ్వసించిన వారందరును ఏక హృదయమును, ఏకాత్మగలవారై యుండిరి. (అ. కార్యములు 4:32). పాపులు జీవించుటగాను మృతినొందిన వాని ఆత్మ సమావేశమైన విశ్వాసులందరికి చైతన్యము గలిగించెను. CChTel 228.1

    శిష్యులు ఆశీర్వాదముల కొరకే యడుగలేదు. ఆత్మల భారముచే వారు కృంగిపోయిరి. భూదిగంతముల వరకు సువార్త ప్రకటింపబడవలసి యుండెను. కనుక క్రీస్తు వాగ్ధత్తము చేసిన శక్తి కొరకు వారు విజ్ఞాపన చేసిరి. అప్పుడు పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడెను. ఒక దినమందే వేలకొలది ప్రజలు క్రైస్తవ మతమును స్వీకరించిరి. CChTel 228.2

    ఇప్పుడు కూడ నదే సంభవించ వచ్చును. క్రైస్తవులు తమ బేధాభిప్రాయము విడిచి నశించిన ఆత్మలను రక్షించుటకు తమ్మునుతాము దేవునికి సమర్పించుకొన వలెను. వాగ్దానము చేయబడిన ఆశీర్వాదము కొరకు విశ్వాసముతో ప్రార్థించినచో వారికది అనుగ్రహింపబడును. అపొస్తలుల కాలమందు పరిశుద్ధాత్మ క్రుమ్మరింపే “తొలకరి వర్షము.” దాని ఫలితము మహిమాన్వితమైనది. అయితే కడవరి వర్షము దానికంటె విస్తారమైనదిగా నుండును. కడవరి దినములలో నివసించువారికి చేయబడిన వాగ్ధానమేమి? “బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా! మీ కోటన మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు (మేలు) చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను.” “కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి ప్రతివాని చేనిలోను పైరు మొలచునట్లు యెహోవా మెరపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును.” (జెకర్యా 9:12; 10:1)28T 20, 21;CChTel 228.3