Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బాల్యప్రాయమందే పిల్లలను బడికి పంపుట యందలి అపాయము

    ఏదేనువాసులు ప్రకృతి నుండి నేర్చుకొన్న విధముగా, అరేబియా మైదానములోను, పర్వతములపైని మోషే గ్రహించిన విధముగా, యేసు బాలుడు నజరేతు పర్వత ప్రాంతమందు గ్రహించినరీతిగా నేటి బాలబాలికలు కూడ ఆయనను గూర్చి నేర్చుకొనవచ్చును. అదృశ్యములు దృశ్యమైన వస్తుజాలమునే తెలియనగుచున్నవి. CChTel 391.1

    సాధ్యమైనంతవరకు విశిష్టమైన యీ ప్రకృతి గ్రంథము లభ్యమగు స్థలమందు బాల్యము నుండియు పిల్లవాని నుంచవలెను. 28Ed. 100, 101;CChTel 391.2

    మీ పిల్లలను చిన్నతనమందె పాఠశాలకు పంపకుడి. ఈ పనికందుల మనస్సులను తీర్చిదిద్దుటకు వారిని ఇతరులకప్పగించుటలో తల్లి జాగ్రత్తగా నుండవలెను. పిల్లలకు ఎనిమిది లేక పది వత్సరముల ప్రాయము వచ్చు వరకు తల్లిదండ్రులే వారికి ఉపాధ్యాయులుగ నుండుట ఉత్తమము. పుష్పముల మధ్య, పక్షులమధ్య, ఆరుబయటి ప్రదేశమే వారి పాఠశాల. వారి పాఠ్య పుస్తకము ప్రకృతి సంపదయే. వారి మనసులు గ్రహించుకొలది తల్లిదండ్రులు వారికి దేవుని మహత్తర ప్రకృతి గ్రంథమును బోధపర్చవలెను. అట్టి పరిసరములతో నేర్పు పాఠములను పిల్లలు మరువలేరు. 29FE 156, 157;CChTel 391.3

    పసితనమందే బడికి పంపుటద్వారా పిల్లల శారీరక మానసికారోగ్యమునకు హాని కలుగుటయేగాక నైతికముగా కూడ వారికి నష్టము కలుగును. అమర్యాద పరులగు పిల్లలతో వారు సాంగత్యము చేతురు. కరకుగాను మొరటుగాను ఉండువారితో వారు సాంగత్యము చేయుట తప్పనిసరియై నది. ఆ స్నేహితులు అబద్ధములాడెదరు. ఒట్టుపెట్టుకొనెదరు. దొంగలించెదరు. మోసగించెదరు. వారికన్న చిన్నవారిక ి తమ దుర్ణీతిని నేర్పించుటలో సంతసించెదరు. పిల్లలను అశ్రద్దగా విడిచిపెట్టినచో వారు మంచికన్న చెడుగును త్వరలో నేర్చుకొనెదరు. స్వాభావికమయిన హృదయమునకు చెడ్డ అలవాటులు వచ్చును. తమ పనితనమందు చూచి వినిన సంగతులే వారి మనసులలో పాతుకొని పోవును. వారి లేత మనసులలో విత్తబడిన చెడ్డ విత్తనములు వేరుసారి వాడిగల ముండ్లయి తమ తల్లిదండ్రుల హృదయములను గాయపరచును. 30CG 302;CChTel 391.4