Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 38 - విరామము

    క్రైస్తవులకు అనేక విధములైన ఆనందమూలములున్నవి. ఎట్టి ఆనందములు ధర్మ సమ్మత మైనవో వారు నిర్దుష్టముగా చెప్పగలరు. మనస్సును బలహినపర్చనట్టియు ,ఆత్మను అవినీతితో నింపనట్టియు విరామమును ఆశాభంగము కలిగించని ఆత్మ గౌరవమును ,నాశనము చేయని,ప్రయోజకత్వమునకు ఆటంకముగా నిలువని పలుకుబడిగల విరామములందును వారు పాల్గొన వచ్చును. ఈ విరామములకు యేసును తమతో గొనిపోయి ప్రార్ధనా స్వభావమును కలిగి యుండుచో వారు సుక్షేమముగా నుందురు. CChTel 319.1

    శ్వాసము నందు దైవ దీవెన కోరుచు మీరు పాల్గొన గల ఏ వినోదమయినను అపాయకరము కాదు. రహస్య ప్రార్ధన ,ప్రార్ధనా బలిపీఠము నొద్ద సాగిల పడుటకు లేక ప్రార్ధన కూటములో పాల్గొనుటకు మిమ్మును అయోగ్యులనుగా చేయు ఏ వినోదమయినను క్షేమమైనది కాదు ;అది అపాయకరమే. CChTel 319.2

    మన జీవితములలో అనుదినము భూమిపై దేవుని మహిమ పరచుట మన ఆధిక్యత యనియు ఈ లోకములో మనము కేవలము స్వకీయెచ్చల కొరకు ,వినొదముల కొరకు జీవించరాదనియు మానవాళికి మేలు చేసి సమాజమునకు ఆశిర్వాదకరముగ నుండ వలెను. వ్యర్ద విషయములను ,దుర్మార్గమును ఆన్వేశించు ధోరణియున్నచో మన జాతికి , తరమునకు మనమెట్లు ఆశీర్వాదకరముగ నుండగలము?మన సామాన్య విధులను నిర్వహించుటకు మనలను అపమర్దులుగా చేయు ఏ వినోదమునందు మనము పాల్గొనరాదు. CChTel 319.3

    యుక్తమైన విషయములు చాల కలవు. కాని వీనిని సాతానుడు మళిపి ఆజాగ్రత్తగా నున్న వారికి వుచ్చులుగా అమర్చును. CChTel 319.4

    ఇతర విషయములలో వాలే వినొదముల విషయము మితము కలిగి యుండవలసిన అగత్యము ఎంతైన కలదు. ఈ వినోదములు ఏ రకమయిన వో జాగ్రత్తగా పరిగణించ వలెను. ఈ వినోదములు ప్రభావము శారీరక ,మానసిక ,నైతిక ఆరోగ్యముపై నేట్లుండును ?అను ప్రశ్నను ప్రతి యువకుడు ,యువతి వేసికొన వలెను. దేవుని మరచునంతగా నా మనసు వినొదములను మించుచున్నదా ?ఆయన మహిమా వీక్షణమును నేను విరమింతునా ?1AH 512-514;CChTel 319.5