Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అభ్యర్థులను సంపూర్తిగా సిద్ధపరచవలెను

    బాప్తిస్మము పొందగోరు అభ్యర్థులు సంపూర్తిగా సిద్ధపడవలసిన అగత్యము కలదు. సర్వ సాధారణముగా వారికీయబడుచున్న ఉపదేశము కన్న ఎక్కువ ఉపదేశము వారికవసరము. నూతనముగా సంఘము నందు ప్రవేశించు వారికి క్రైస్తవ జీవిత సూత్రములు సుస్పష్టములు గావించబడవలెను. క్రీస్తుతో వారికి సంబంధమున్నదనుటకు సత్యము నందు వారికున్న బలమైన నమ్మిక చాలినంత ఋజువుకదా. “నమ్ముచున్నాడు” అని చెప్పుట మాత్రమే చాలదు. మనము సత్యముననుసరించి నడుచుకొనవలెను. మన మాటల యందును, దైవచిత్తము ననుసరించుట ద్వారా ఆయన తోడి మన సంబంధమును మనము నిరూపించుకొనెదము. ఆజ్ఞాత్కిమము పాపము నొకడు ఎప్పుడు విసర్జించునో అప్పుడాతని జీవితము ధర్మశాస్త్రాను సారమైనదై సంపూర్ణ విధేయతను కలిగి ఉండును. ఇది పరి శుద్ధాత్ముని పనియై యున్నది. శ్రద్ధగా పఠించబడు వాక్యము, మనస్సాక్షి స్వరము, ఆత్మ ప్రేరణములు ఇవి వ్యక్తి యొక్క శరీరాత్మ స్వభావములను సాకల్యముగా రక్షించుటకు తన్నుతాను సంపూర్ణముగా సమర్పించుకొన్న క్రీస్తు పట్ల మదిలో యధార్ధమైన ప్రేమను పుట్టించును. విధేయతయందు ప్రేమ ప్రదర్శితమగును. ఆనను ప్రేమించి ఆయన యాజ్ఞలనుల గైకొనువారికిని ఆయనను ప్రేమించకయు ఆన ఆజ్ఞలను గైకొనకయు నుండువారికిని మధ్య గొప్ప వ్యత్యాసము కాన్పించును. CChTel 240.1

    దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొన వలసిన ఆగత్యమును ఎవరును గుర్తించకుండునట్లు సాతానుడు చేయుచున్నాడు. వ్యక్తి ఈ సమర్పణ చేయజాలనపుడు పాపము తిష్ట వేసికొని యుండును. అభిరుచులు, కామేచ్ఛలు జయము పొంద యత్నించును. నిజ మైన మారుమనస్సు రాకుండ శోధనలు మనస్సాక్షిని ఉక్కిరి బిక్కిరి చేయును. ఆకర్షించి, శోధించి మోసగించ జూచుచున్న సాతాను ప్రతినిధి వర్గముతో ప్రతివాడును సల్పవలసిన పోరాటమును అందరును గ్రహించుచో సత్యమందు నూత్నముగా ప్రవేశించు వారి కొరకు అధిక కృషి జరుగునని గ్రహింపనగును. CChTel 240.2