Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 15 - అపరాధుల యెడల మన వైఖరి

    అందరికి రక్షణను సాధ్యపరచుటకుగాను క్రీస్తు భువికి వచ్చెను. నశించిన ప్రపంచము కొరకు ఆయన కల్వరి సిలువ మ్రానిపై అపార క్రయధనమును చెల్లించెను. ఆయన ఆత్మోపేక్ష, ఆత్మ త్యాగము నిస్వార్థసేవ, అణకువ, అన్నింటికన్న ముఖ్యముగా తన ప్రాణత్యాగము ఇది ఆయనకు నశించిన ప్రపంచము పట్లగల ప్రేమ యొక్క లోతును వ్యక్తము చేయుచున్నవి. నశించిన వారిని వెదకి రక్షించుటకే ఆయన భూమికి వచ్చెను. ప్రతి వర్గమునకు, భాషకు, రాజ్యమునకు చెందు పాపుల కొరకు ఆయన వచ్చెను. మానవులకు పాపి విమోచన కలుగజేసి వారిని తనతో సమైక్యపరచి తన సానుభూతికి వారిని పాత్రులుగా చేయుటకు గాను ఆయన అందరి నిమిత్తము క్రయధనము చెల్లించెను. ఎక్కువ అపరాధులను, ఘోర పాపులను ఆయన విసర్జించలేదు; ఆయన అందించ వచ్చిన రక్షణ ఎవరికి ఎక్కువ అవసరమయ్యెనో వారి కొరకాయన ప్రత్యేక కృషి చేసెను. ఎక్కువ మార్పు కావలసి వచ్చిన వారిపట్ల ఆయన ఎక్వు ఆసక్తిని ఎక్కువ సానుభూతిని చూపి వారి కొరకు ఇతోధికముగా కృషి చేసెను. అపాయకరమైన పరిస్థితియందును, పరివర్తనకరమగు కృపావశ్యకతయందును, ఉన్న వారిని గూర్చి ఆయన ప్రేమా హృదయము కలత చెందెను. CChTel 170.1

    కాని శోధితుల పట్ల, అపరాధులపట్ల, గాఢమైన, యధార్థమైన, హృదయపూర్వకమైన ప్రేమ, సానుభూతులు ఉండవలసినంతగా మనయందు లేవు. అనేకులు సహాయము ఎక్కువ కావలసిన వారికి సాధ్యమైనంత దూరముగా నుండి నిర్లక్ష్యభావమును, అజాగ్రత్తను కనపర్చిరి. వీరినే వేరొక మార్గమును పోవు వారిని వ్యక్తము చేసెను. క్రొత్తగా సత్యము నంగీకరించిన ఆత్మ తరచు క్రితము ఏర్పడిన అలవాటులతో సతమత మగుచుండును. లేక ఒక ప్రత్యేకమయిన శోధనచే ఆవహించబడును. లేక తాను జయించరాని ఒక ఇచ్చకో, అభిప్రాయమునకో లోనై అవివేకి యగును, లేక అపరాధియగును. అతడు తన ఆధ్యాత్మిక ఆరోగ్యమును తిరిగి సంపాదించుకొనుటకు సహ నిశ్వాసుల బలము, నేర్పు, వివేకము అప్పుడు అతనికి కావలెను. ఇట్టి సందర్భములతో దైవ వాక్యమందలి ఉపదేశములు వర్తించును. “సహో దరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వీకమైన మనస్సుతో అట్టి దానిని నుంచి దారికి తీసికొని రావలెను.” గలతీ 6:1. “కాబట్టి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై యున్నాము.” రోమా. 15:1. 156T 03-605;CChTel 170.2

    ప్రేమ పూరిత విధానములు, సరళ సమాధానములు ఉత్సాహ వచనములు. ఇవి మార్పు కలుగ జేసి రక్షించుటలో కృారత్వము కాఠిన్యముకన్న ఉత్తమ మార్గములు నిర్దయ ఎక్కువగా చూపుట వలన కొందరు వ్యక్తులు మీ వశము తప్పి పోయెదరు. అట్లు కాక సమోధాన స్వభావము చూపుట వలన వారు మిమ్మును హత్తుకొందురు. అప్పుడు మీరు వారిని మంచి దారిలో పెట్టి గుణపర్చవచ్చును. మీరు క్షమాపణ స్వభావముతో మెలుగుచు మీ చుట్టుపట్ల ఉన్నవారి సదుద్దేశములను, సత్క్రియలను గౌరవించుడి. 24T 65;CChTel 171.1