Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మీ తలాంతులొక యక్కర దీర్చును

    దేవుని మహా సంకల్పమందు ప్రతి వారికి ఒక స్థలము కలదు. అవసరము కాని తలాంతులు అనుగ్రహించబడవు. ఆతలాంతు చిన్నదే యనుకొందము. దానికొక స్థలమును దేవుడు ఏర్పాటు చేసెను. నమ్మకముగా వినియోగించబడుచో ఆ ఒక తలాంతే దేవుడు దాని కొరకు సంకల్పించిన పనిని సాధించగలడు. పూరికొంపలోని పేదవాని తలాంతు ఇంటింట సువార్త సేవ చేయుటకు అవసరము. ఇతర వరములు చేయలేని యీపనిని ఈ తలాంతు చేయును. 49T 37, 38;CChTel 95.2

    మనుజులు దేవుని నడుపుదల చొప్పున తమ శక్తులను ఉపయోగించినపుడు వారి తలాంతులు అధికరించును; వారి సామర్థ్యము వృద్ధి పొందును. నశించిన వారిని రక్షించ వెదకుటలో వారికి పరలోక జ్ఞానము కలుగును. ఇతరులకు బోధించుట అను దేవుడిచ్చు బాధ్యతపట్ల సంఘ సభ్యులు నిరసన భావము అశ్రద్ధ చూపి పరలోకధనము నెట్లు పొందజూచెదరు? చీకటిలోనున్న వారికి వెలుగునిచ్చు భారమును క్రైస్తవులమని చెప్పుకొనువారు సహించనప్పుడు, కృపాజ్ఞానములను ఆందించు పనిని వారు విరమించునపుడు, వారి అవగాహనశక్తి సన్నగిల్లును. దైవ బహుమానమును అభినందించు శక్తిని పోగొట్టుకొని ఇతరులకు దానిని గూర్చి వివరించవలసిన అగత్యమును కూడ గుర్తింపజాలకుందురు. CChTel 95.3

    ఆయా స్థలములలో పెద్ద సంఘములు సమావేశమగుట మనము చూతుము. ఆ సంఘములోని సభికులు కొంత సత్యపరిచితి సంపాదింతురు. అనేకులు జీవ వాక్యము వినుటతో సంతృప్తి జెందదరు గాని ఇతరులకు వెలుగు నందింప యత్నించరు. దైవ సేవాభివృద్ధి పట్ల వారు బాధ్యతలేని వారిగా నుందురు. ఆత్మల రక్షణ క్రియయందు వారాశచూపరు. లోక వ్యవహారములందు వారు అమితాసక్తులై యుందురుగాని తమ వర్తక వ్యాపారములో మతమునుప్రదర్శించరు. “మతము మతమే, వ్యాపారము వ్యాపారమే” అని వారనెదరు. దేని స్థానము దానికున్నదని యీ రెండిరటినిగూర్చి తలంతురుగాని “అవి వేరువేరుగా నుండవలెను” అని మాత్రము అందురు. CChTel 96.1

    అవకాశములు తృణీకరింపబడి నందునను తరుణములను దుర్వినియోగపరచుట చేతను ఈ సంఘములందలి సభ్యులు “మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును” అభివృద్ధి పొందుటలేదు. 2 పేతురు 3:18. ఆకారణముగా వారు విశ్వాసమునందు బలహీనులుగను, జ్ఞానమునందు అధములుగను, అనుభవము నందు చిన్న పిల్లలుగను ఉన్నాడు. సత్యము నందు వేరు పారి బలపడినవారు కావు. వారట్లే యున్నచో సత్యాసత్యములను గుర్తుపట్టుటకు వారికి ఆధ్యాత్మిక దృష్టి ఉండదు గనుక కడసరి దినముల మోసములు వారిని నిశ్చయముగా వంచించును. 56T 424, 425;CChTel 96.2