Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వ్యక్తిగత ధ్యానముల ప్రాముఖ్యత

    రహస్య ప్రార్థన, లేఖన పఠనములు, ఒకసారి అలక్ష్యము చేయబడినపుడు రెండవ సారి మరెక్కువగా అలక్ష్యముచేయు మనస్తత్వమేర్పడును. అంతస్సాక్షి దీని విషయము గుర్తించదు. అలక్ష్య పరంపర లేర్పడును. ఇదంతయు హృదయమందు విత్తబడిన ఒక్క విత్తనము వలన కలిగిన ఫలితము. అయితే పెంపొందించబడిన ప్రతి కాంతిరేఖ వెలుగు పంట పండును. ఒకసారి శోభనం ప్రతిఘటించినచో రెండవమారు శోధనము ఇంక బలముగా ప్రతిఘటించ వచ్చును. స్వార్థముపై పొందిన ప్రతి జయము ఉన్నతమైన ఉదాత్తమైన జయములకు మార్గము సరాళము చేయును. ప్రతి జయము నిత్య జీవార్థము విత్తబడిన విత్తనమై యున్నది. 95T 120;CChTel 511.3

    యధార్థ హృదయముతో దేవుని యొద్దకు వచ్చి విశ్వాసముతో ఆదాయనకు తన విజ్ఞాపనలను అందజేయు ప్రతి పరిశుద్ధుని ప్రార్థనలకు సమాధానము దొరుకును. మీ ప్రార్థనలకు రక్షణ సమాధానము రానప్పుడు దైవ వాగ్ధానముయందు మీ విశ్వాసము సడలరాదు. దేవుని నమ్ముటకు భయపడకుడి. “అడుగుడి మీ కియ్యబడును” అను నిశ్చిత వాగ్దానమును నమ్ముడి. యోహాను 16:24. CChTel 511.4

    దేవుడు మహాజ్ఞాని, ఆయన పొరబడడు. యధార్థముగా జీవించు తన పరిశుద్ధులకు రావలసినదేదియు ఆయన నిలుపుచేయడు. ఆయన చాల దయగలవాడు. మానవుడు పొరపాట్లు చేయును. అతడు తన మానవుల యధార్థ హృదయముతో పైకి పంపినను తనకు మేలు చేయు విషయములను లేక దేవునికి మహిమ కలుగు విషయములను మానవుడు ఎప్పుడును అడుగడు. ఇట్టి స్థితిలో జ్ఞానము గల మన తండ్రి మన ప్రార్థనల నాలించి కొన్ని సార్లు వెంటనే వానికి సమాధానమిచ్చును. కాని మనకు మేలు చేయు విషయములను ఆయనకు మహిమనిచ్చు విషయములను ఆయన మనకిచ్చును. దేవుడు మనకు దీవెనలనిచ్చును. ఆయన ఏర్పాటును మనము చూడగలిగినచో మనకు శ్రేయస్కరమైనదేదో ఆయనకు బాగుగా తెలియుననియు మన ప్రార్థనలకు సమాధానము ఈయబడినదనియు మనము స్పష్టముగా గ్రహించ గలము. హానికరమైనదేదియు అనుగ్రహింపబడదు. మనమడిగిన దాని స్థానే మనకు హానికరముగ నుండుటచే దానిని మనకీయడు. CChTel 512.1

    మన ప్రార్థనలకు తక్షణ సమాధానము రాకున్నచో మనము విశ్వాసము కలిగి విచారించక యుండవలెనని నేను చూచితిని. అటు మనము విచారించినచో అది మనలను దేవుని నుండి విడదీయును. మన విశ్వాసము చంచలముగా నున్నచో ఆయన యొద్దనుండి మన మేమియు పొందము. దేవుని యందు మన విశ్వాసము బలముగా నుండవలెను. మనకు అత్యవసరమయినపుడు వర్షమువలె దీవెనలు పడును 10IT 120,121;CChTel 512.2