Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 5 - మీ కొరకు దేవుడొక పనిని నియమించెను

    మన సంఘ సభ్యత్వముగల స్త్రీ పురుషులు ఏకస్థముగా బోధకులతోను సంఘ నాయకులతోను కలిసి పనిచేయువరకుఈ భూమిపై దేవుని పని ముగింపుకురాదు. 19T 117;CChTel 84.1

    “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి” అను నీ మాటలు క్రీస్తును వెంబడిరచు వారందరికి చెప్పబడినవి. యధార్థ క్రైస్తవులందరును తమ సహ మానవుల రక్షణార్థము పనిచేయు నిమిత్తము ఏర్పరచబడి నశించిన వారిని రక్షించవలెనని ప్రభువు చూపిన ఆత్రమునే వారు కూడా కనపరచవలెను. అందరును ఒకే స్థానము నాక్రమించవలెనని కాదు. కాని ప్రతి ఒక్కరికిని ఒక స్థానమును పనియు నున్నవి. దేవుని ఆశీర్వాదములు పొందిన వారందరు ఆయన సేవ చేయుటద్వారా కృతజ్ఞత చూపవలెను. ఆయన రాజ్య పరివ్యాప్తికైసమర్థతలన్నియు వినియోగించబడవలెను. 28T 16;CChTel 84.2

    ఆత్మలను రక్షించు పనిలో ఒక చిన్న భాగము మాత్రమే. దేవుని ఆత్మ పాపులను సత్యమంగీకరించునట్లు చేసి వారిని సంఘము యొక్క కాపుదలలో నుంచును. బోధకులు తమ వంతు పనిని చేయవచ్చును గాని సంఘము చేయవలసిన కార్యమును వారు చేయజాలరు. విశ్వాసమునందును అనుభవమునందును పసిపిల్లలుగా నున్నవారిని సంఘము సంరక్షించవలెనని దేవుడు కోరుచున్నాడు. వారితో పిచ్చపాటి మాట్లాడుటకు గాక ప్రార్థించుటకును, “చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్లవంటి” మాటలు వారితో మాట్లాడు నిమిత్తము వారు వెళ్ళవలెను. 34T 69;CChTel 84.3

    భూమిపై వెలుగై యుండు నిమిత్తము దేవుడు ప్రాచీన ఇశ్రాయేలీయులను పిలిచినట్లు నేడు తన సంఘమును పిలుచు చున్నాడు. మూడు దూతల వర్తమానములను సత్యకరవాలముతో ఇతర సంఘముల నుండియు ప్రపంచము నుండియు ఆయనతో దగ్గర సంబంధము కలిగియుండు నిమిత్తము వారిని వేరుపరచెను. వారిని తన ధర్మశాస్త్రమును భద్రపర్చువానిగా ఏర్పరచి ప్రస్తుత కాల ప్రవచన సత్యములను వారికిచ్చెను. ప్రాచీన ఇశ్రాయేలీ యులకు అనుగ్రహించబడిన దేవోక్తులవలె ఇవి కూడా ప్రపంచమున కందించు నిమిత్తము అనుగ్రహించబడిన పరిశుద్ద విషయములై యున్నవి. CChTel 84.4

    దేవుని వర్తమాన కాంతిని అంగీకరించి ప్రపంచ దశదిశలకును హెచ్చరిక నందించుటకు దైవ ప్రతినిధులుగా వెళ్ళు ప్రజలను ప్రకటన 14వ అధ్యాయమందలి ముగ్గురు దూతలు సూచించుచున్నారు. క్రీస్తు తన అనుయాయులకిట్లు చెప్పుచున్నాడు: “మీరు లోకమునకు వెలగైయున్నారు.” మత్తయి 5:14. క్రీస్తు నంగీకరించు ప్రతిఆత్మతో కలువరి సిలువ ఇట్లు చెప్పుచున్నది: “ఆత్మ యొక్క విలువ చూడుము. ‘మీరు సర్వలోమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. ’ ”మార్కు 16:15. ఈ పనిని ఆటంకపరచుటకు దేనికిని తావీయరాదు. ఈ కాలములోనిది సర్వతోముఖ ప్రాముఖ్యతగల పని. ఇది నిత్యత్వమంత విస్తృతమైనది. మానవాత్మల రక్షణార్థము చేయబడినసమర్పణ యందు యేసు చూపిన ప్రేమయే ఆయన అనుచర బృందమును ప్రోత్సహించును. 45T 455,466; CChTel 85.1

    క్రీస్తు ఎంతో ఆనందముతో తనకు వశమైన ప్రతి మానవ ప్రతినిధిని అంగీకరించును. మూర్తీభవించిన ప్రేమను గూర్చిన మర్మములను ప్రపంచమునకు బయలుపరచు నిమిత్తము ఆయన మానవులను దేవునితో ఐక్యపరచును. దానిని గూర్చి ప్రస్తావించి, ప్రార్థించి, పాడుడి; సత్యసువార్తతో ప్రపంచమును నింపుచు దూరప్రాంతములకు సాగిపోవుడి. 59T 30,CChTel 85.2