Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 52 - దైవమానవసంబంధమును నిర్మలముగ నుంచుడి

    దేవుడు సర్వశరీరమునకు వార్తలనందించు మెదడు నందలి నరములద్వారానే మానవునికి సందేశము పంపి అతనిలో పనిచేసి జీవితమును మార్చగలడు. నాడీ మండల మందలి విద్యుచ్ఛక్తిని ఏది పాడుచేయునో అది జీవశక్తుల బలమును తగ్గించును. తత్పర్యవసానముగా మనస్సు యొక్క విచక్షణశక్తి అంతరించును. 12T 347;CChTel 435.1

    ఎట్టి అమిత భోగమయినను జ్ఞానేంద్రియములను మొద్దుబాలరజేసి తద్వారా మెదడు యొక్క శక్తులను బలహీనపరచును. దీని ఫలితముగా నిత్యజీవ విషయములు రుచించవు. అవి సామాన్య విషయముల స్థాయికి దిగజారును. ఉన్నత కార్యముల కొరకు ఉద్దేశించబడిన ఉన్నత మానసిక శక్తులు తుచ్ఛశరీరేచ్ఛలకు లోనగును. మన శారీరకాభ్యాసములు సరిjైునవి కాకున్నచో మన మానసిక, నైతిక శక్తులు బలపడజాలవు. కారణమేమనగా భౌతిక, నైతిక శక్తులకు సబంధముకలదు. 23T 50,51;CChTel 435.2

    గాఢతరమయిన, గాఢతమమయిన బాధలకు వ్యాధులకు మానవ కుటుంబము గురియగుట సాతానుకు సంతసము. దురభ్యాసములు, బలహీన శరీరములు కల వ్యక్తులు ఆరోగ్యవంతులవలె యథార్థతతోను, ఓరిమితోను, పవిత్రతతోను దేవుని సేవించలేరని అతనికి విదితమే. వ్యాధిగ్రస్తమగు శరీరము మెదడును పాడుచేయును. మనము ప్రభువును మనస్సుతో సేవింతుము. శిరస్సు శరీరమునకు కేంద్రస్థానము. తనను, ఇతరులను నాశనముచేయు అభ్యాసములను అలవరచుకొనుటకు మానవ కుటుంబమును నడుపుటద్వారా కలుగు నాశనమునందు సాతానుడు ఆనందించును. దేవునికి చెందవలసిన సేవను ఈ విధముగా అతడు తసకరించుచున్నాడు. CChTel 435.3

    మానవ సంతతిని వశపరచుకొనుటకు సాతానుడు నిత్యము మెలకువగా నున్నాడు. మానవుని చేజిక్కించుకొనుటకు అతని మహత్తర సాధనము తిండియే. ఆహారేచ్ఛను రెచ్చగొట్టుటకు అతడు సాధ్యమయినన్ని విధముల ప్రయత్నించుచున్నాడు. 3Te 13, 14;CChTel 435.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents