Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 24 - ప్రార్థన కూటము

    ప్రార్థనకూటములు అత్యంత ఆశాజనకములుగా నుండవలెను. అయితే యిది తరుచుగా అట్లుండుటలేదు, అనేకులు ప్రసంగమునకు హాజరగుదురు గాని ప్రార్థనకూటమును అలక్ష్యము చేతురు. ఇక్కడ యోచన చేయవలసి యున్నది. వివేకము కొరకు దేవుని నర్ధించిన మీదట కూటములు ఆశాజనకములుగాను, ఆకర్షణీయముగాను, ఉండుటకు సమాలోచన చేయవలెను. జీవాహారము కొరకు ప్రజలు ఆకలిగొందురు; ప్రార్ధనకూటమందు అది వారికి అభ్యమగుచో వారచ్చటకు చనెదరు. CChTel 232.1

    ఏ స్థలమందైనను`ముఖ్యముగా బహిరంగ కూటములో సుదీర్ఘ ప్రసంగము కాని ప్రార్థనలుకాని అవాంఛనీయ ములు. అందరికన్న ముందులేచి మాటలాడుటకు సిద్ధముగానుండు వారికి తరుణమిచ్చుట వలన బితుకు బితుకుగా నుండి తటపటాయించు వ్యక్తులు సాక్ష్యమిచ్చుటకు అవకాశము చిక్కదు. సారములేని మాటలు చెప్పువారే ఎక్కువ సేపు మాటలాడెదరు. వారి ప్రార్థనల నాలకించువారిని విసిగించును. మన ప్రార్థనలు క్లుప్తముగాను, అంశమునకు పరిమితముగాను నుండవలెను. ఎవరికైన సుదీర్ఘమైన విజ్ఞప్తులున్నచో వానిని రహస్యప్రార్థనలకు ఉంచుకొనవలెను. మీ హృదయములలోనికి దేవుని ఆత్మను ఆహ్వానించుడి, అది అవాంఛనీయమైన ఆచారమును తుడిచివేయును. 14T 70,71;CChTel 232.2