Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దేవునికి చేయు వాగ్ధత్తము విధాయకమైనది, పవిత్రమైనది

    ప్రతివాడు తనకుతానే లెక్క చూచుకొని తన సంకల్పము చొప్పున ఇచ్చుటకు స్వేచ్ఛ కలిగియున్నాడు. అననీయా సఫీరాలు చేసినట్టి పాపము చేయువారును కలరు. దశమ భాగపద్దతిద్వారా దేవుడు కోరుదానియందు కొంత భాగము మిగిలించుకొన్నను సహోదరులకు తెలియదులేయని వారు తలంచెదరు. దోషులైన ఈ దంపతులుఇట్లే తలంచిరి. వీరి మాదిరి మనకు హెచ్చరిక కలుగుటకు ఇయ్యబడినది. తాను హృదయమును పరిశోధించువాడనిదేవునికి మరుగుపడ జాలవు. సార్వదా మానవ హృదయములు చేయనాశించు పాపము విషయము జాద్రత్తపడుడని సర్వయుగములందలి క్రైస్తవులకును దేవుడ నిత్య హెచ్చరిక విడిచియున్నాడు. CChTel 120.1

    కొంత సోమ్ము నిచ్చుటకు సహోదరుల సమక్షమందు వాగ్రపముగాగాని లిఖిత రూపముగాగాని వాగ్దానము చేసినచో దేవునికిని మనకును మధ్య జరిగిన ఒడండడికకు వారే ప్రత్యక్ష సాక్షులు. వాగ్దానము మానవునికిగాక దేవునికి చేయబడినది. ఇది ఒక పొరుగువానికి వ్రాసి యిచ్చిన పత్రము వంటిది. డబ్బు విషయము దేవునితో క్రైస్తవులు చేయ వాగ్దానము మానవులతో చేయి నే ఒడంబడికకన్నను ఎక్కువ బాధ్యతాయుతమైనది. తమతోడి మానవులకు వాగ్దానములు చేసిని వారు వానినుండి విడుదల చేయడని సాధరణముగా యూచింప తలపడరు. మేళ్లన్ని ఇచ్చు దాతయగు దేవునికి చేయి నాగ్దత్తము విశేష ప్రాముఖ్యత గలది. దేవునికి మనము చేసిన వాగ్ధానములనుండి విడుదల పొందుటకు మనమేల యత్నించవలెను? వాగ్దానము దేవునికి చేయబడినది గనుక అది తక్కువ బాధ్యత గలదని మానవుడు పరిగణించుచున్నాడా? మానవ న్యాయస్థానములలో దానిని గూర్చి పిర్యదు చేయుట సంభవించదు గనుక అది బలమైనది కాకపోవునా?CChTel 120.2

    యేసుక్రీస్తు యొక్క వెలలేని రక్తము ప్రాణత్యాగములద్వారా రక్షించబడితినని చెప్పుకొను మానవుడు “దేవుని దోచుకొనునా? పరలోక న్యాయస్థానమందు న్యాయమను త్రాసులో అతని వాగ్ధానములును క్రియలును తూయబడును. CChTel 120.3

    సంఘస్థుల వ్యక్తిగత వాగ్థానములు విషయము సంఘమే జవాబుదారి. తన వాగ్దానములను నెరవేర్చక ఆశ్రద్ద చూపుచున్న సభికుని సంఘము కనుగొన్నచో ఆ సంఘము అతనితో దయగాను స్పష్టముగాను మాటలాడవలెను. తాను చెల్లించవలసిన దాని నతడు చెల్లించలేని పరిస్థితులలో నున్నచో అతడు యోగ్యుడును, ఇచ్చుటకిష్టపడు మనస్సుకు వాడును అయినచో అప్పుడు సంఘము అతని సహాయమునకు వచ్చును. ఇట్లు వారు కష్టమునధిగమించి ఆశీర్వాదములు పొందవచ్చును. 224T 469476;CChTel 120.4