Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దైవ అంగీకార నిశ్చయిత గోరు వారికి హితవు

    దేవుడు మిమ్మునంగీకరించెనని తెలిసికొనుట యెట్లు? ఆయన వాక్యమును ప్రార్థన పూర్వకముగా పఠించుడి. ఏ యితర పుస్తకమును పఠించు నిమిత్తము దీనిని మానకుడి. ఈ గ్రంథము పాపమును ఒప్పింప జేయును. సుస్పష్టముగా రక్షణ మార్గమును బయలు పర్చును. మహిమా తేజస్సులు గల బహుమానమును ఇది మన మనస్సుకుదెచ్చును. ఇది మీకు సంపూర్ణుడైన రక్షకుని బయలుపరచి ఆయన అనంత కృపద్వారానే రక్షణ కలుగునని బోధించును. CChTel 144.4

    రహస్య ప్రార్థనను అశ్రద్ధ చేయకుడి. అది మతమునకు జీవగర్ర. ఆసక్తితో కూడిన, బలమైన ప్రార్థనద్వారా ఆత్మపావిత్య్రము కొరకు విజ్ఞాపన చేయుడి. భౌతిక జీవము అపాయమందున్నప్పుడు ప్రాణ రక్షణ కొరకు ఎంత ఆసక్తితోను, ఆతురతతోను విజ్ఞాపన చేతురో అట్లు విజ్ఞాపన చేయుడి. రక్షణార్థమైన అనిర్వచనీయ వాంఛలు మీతో జనించు వరకు పాపము క్షమించబడినదని నిదర్శనము దొరుకు వరకు దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేయుడి. 141T 163;CChTel 144.5

    బాధలతోను, కష్టములతోను సతమతమగుటకు యేసు మిమ్మును విడువడు. వానిని గూర్చి ఆయన మీకు చెప్పెను. కష్టములు వచ్చినప్పుడు కృంగిపోరాదని కూడ ఆయన మిమ్మును హెచ్చరించెను. మీ రక్షకుడగు క్రీస్తు వైపు చూచి నిరీక్షణకలవారై ఆనందించుడి. మన సహోదరులు, స్నేహితులు పెట్టు కష్టములే సహింపశక్యముగానవి. అయినను వీరిని కూడా ఓరిమితో సైపవలెను. యేసు యోసేపు క్రొత్త సమాధియందు లేడు. మన పక్షమున విజ్ఞాపన చేయు నిమిత్తము ఆయన లేచి పరమున కేగెను. మననెంతో ప్రేమించి తన ద్వారా మనకు నిరీక్షణ, బలము, ధైర్యము, ఆయన సింహాసనముపై నొక స్థానము లభించు నిమిత్తము మన కొరకు మరణించిన రక్షకుడు మనకున్నాడు. ఆయనను అర్థించినప్పుడెల్ల మీకు సహాయము చేయుట కాయన సమర్థుడు. సహాయము చేయుట కాయన సిద్ధముగానున్నాడు. CChTel 145.1

    మీరాక్రమించు బాధ్యతాయుత స్థానమునకు అయోగ్యుమని మీరనుకొనుచున్నారా? అందుకు దేవునికి వందనములు. మీ బలహీనతను మీ తక్కువను గుర్తించు కొలది, సహాయకుని వెదకుటకు మీరెక్కువ శ్రద్ధ వహించెదరు. CChTel 145.2

    “దేవునియొద్దకు రండి అప్పుడాయన మీ యొద్దకు వచ్చును.” యాకోబు 4:8. మీరుసంతోషముగా నుండవలెనని యేసు కోరుచున్నాడు. దేవుడిచ్చిన శక్తితో మీరు చేయగలిగినదంతయు చేసి ఆ మీదట ప్రభువు మీకు సహాయము చేయుననియు భారము వహించుటలో మీకు సహాయకులను ఆయన లేపుననియు విశ్వసించుడి. CChTel 145.3

    మానవుల నిశిత విమర్శములు మీకు బాధ కలిగించరాదు. యేసును గూర్చి మనుజులు పరుషవాక్యములు పలుకలేదా? వారు తప్పుడుచేసి కొన్ని సార్లు నిశిత విమర్శకు తరుణ మీయవచ్చును. కానియేసు ఎన్నడును తప్పుచేయలేదు. ఆయన పరిశుద్ధుడు, అనింద్యుడు నిష్కళంకుడు. మహిమా రాజుపొందిన దాని కన్న నుత్తమమైన దానిని ఈ జీవితమందు పొందజూడకుడి. మిమ్మును నొప్పింపగలమని మీ శత్రువులు గుర్తింపగలిగినప్పుడు వారు సంతసించెదరు. సాతానుడు కూడా హర్షించును. యేసునందు దీక్షయుంచి పనిచేయుడి. దైవ ప్రేమయందు మీ హృదయమును భద్రపరచుకొనుడి. 158T 128,129;CChTel 145.4