Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భర్తల కుండవలసిన వివేచన

    భర్తలు జాగ్రత్తగను ,చురుకుగను ,నిలుకడగను ,నమ్మకముగను దయగను ,ఉండవలెను. ప్రేమ సానుభూతులను భర్తలు ప్రదర్శించ వలెను. క్రీస్తు మాటల మేరకు వారు ప్రవర్తించినచో వారి ప్రేమ తమ శరీరములను నాశనమునకు నడిపి తమ భార్యలకు దౌర్బల్యమును ,వ్యాధిని తెచ్చిపెట్టు తుచ్ఛమైన ,లౌకికమైన ,ఇంద్రియానంద ప్రేరక మైనదిగా నుండదు. ప్రతి విషయముమందును భార్యలు భర్తలకు లోబడి యుండవలెనని చెప్పి వారు తమ తుచ్ఛ కామాసక్తులను నెరవేర్చుకొన జూడరాదు. ప్రతి క్రైస్తవునికి నుండవలసిన సౌశీల్యము, శుద్ధ హృదయము మానసిక సమున్నతి భర్తకున్న పక్షమున అవి దాంపత్య జీవిత మందు కనపర్చబడును. అతడు క్రీస్తు మనస్సును కలిగియున్నచో శరీరమును పాడుచేయక క్రీస్తు నందు అత్యత్తమ ప్రమాణము చేరవలెనను లక్ష్యమును కలిగి అతడు ప్రేమతో నిండి యుండును. CChTel 284.5

    భార్య తన భర్తకు దాసిjైు అతని తుచ్ఛ కామేచ్ఛలను తీర్చుటకు తన్ను తాను అతనికి అప్పగించుకొన్నప్పుడు ఏ పురుషుడును తన భార్యను యథార్థముగా ప్రేమింప జాలడు. అట్లు ఆమె అతని వశమగుట ద్వారా పూర్వము అతని దృష్టిలో ఆమెకున్న విలువనామె పోగొట్టుకొనును. ఆమె ఉన్నత స్థితి నుండి క్రిందకి దిగజారినట్లాతడు పరిగణించును. తనకువలె పరాయి వానికి కూడా నామె సులభముగా వశమగునని యాచిరకాలములో నతడు ఆమెను శంకించును. ఆమె యథార్థమును, సావిత్య్రమును అతడు శంకించును. అతని కామెయందు విరక్తి పుట్టును. తన తుచ్ఛకామేచ్ఛలను అధికము చేసికొని అతడు నూతన వనితల కొరకు తారాడును. దేవుని చట్టమును అలక్ష్యము చేయును. ఇట్టి పురుషులు మూర్ఖులకన్న అధములు. వారు మానవ రూపమును ధరించిన దయ్యములు. యధార్థమైన, పవిత్రమైన ప్రేమ యొక్క ఉదాత్త నియమములు వారికి అగోచరములు. CChTel 285.1

    భార్యకు కూడా భర్త యందు అసూయ జనించును. అవకాశము చిక్కినచో తనకు వలె ఇతర స్త్రీకి తన ప్రేమను చూపునని ఆమె అతనిని శంకించును. అతడు మనస్సాక్షి చెప్పుచేతలలో లేడనియు, దేవునికి భయపడుట లేదనియు ఆమె గుర్తించును. పరిశుద్ధములైన ఈ కట్టడములన్నియు శరీరేచ్ఛల వలన భిన్నా భిన్నములు చేయబడును. భర్తయందున్న దేవుని పోలిక యంతయు తుచ్ఛమును మూర్ఖమునైన కామేచ్ఛకు దాసిగా చేయబడును. CChTel 285.2