Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భుజించుటయందు క్రమము

    సక్రమమైన ఆహారమును భుజించిన పిమ్మట అన్నకోశము అయిదు గంటలు విశ్రమించవలెను. తరువాతి భోజన సమయము సరకు ఏమియు భుజింపరాదు. ఈ విరామకాలములో అన్నకోశము తన పనిని చేయును. ఆ పిదప మాత్రమే ఆహారమును గ్రహించు స్థిలో నది యుండును. 17CD 179;CChTel 412.6

    భుజించుట యందు క్రమమును అనుసరించవలెను. భోజనమునకును భోజనముకును మధ్య ఏమియు తినరాదు. ఏవిధమైన తీపి సరకులు, గింజలు, ఆహారము భుజించరాదు. క్రమబద్దతలేక భుజించుట వలన జీర్ణావయవము ఆరోగ్యము పాడవును. ఇది వ్యక్తి ఆరోగ్యమునకును, ఆనందమునకు హానికరిము. పిల్లలు భోజనపు బల్ల వద్దకు వచ్చినపుడు ఆరోగ్యదాయక భోజనముపై ఆసక్తి ఉండదు. హాని కలిగించు పదార్థముల కొరకే వారు తహతహ లాడెదరు. 18MH 384;CChTel 413.1

    మనము విశ్రమించుతరి అన్నకోశము తన విధులను నెరవేర్చి తద్వారా ఆదియు ఇతర అవయవములను విశ్రాంతి నొందవలెను. కూర్చుని పనిచేయు వారికి రాత్రియందు ఆలస్యముగా భుజించుట ముఖ్యముగా హానికరము. CChTel 413.2

    దినమంతయు జీర్ణావయవములు ఎక్కువ పని చేయుల వలన ఆహారవాంఛకు దారి తీయు బలహీనత యేర్పడును. ఒకసారి ఆహరముపై పని చేసిన పిదప జీర్ణావయములకు విశ్రాంతి అవసరము. కనీసము అయిదు ఆరు గంటలు వ్యవది భోజనమునకు భోజనమునకు మధ్య ఉండవలెను. మూడు పూటలు భుజించుటకన్న రెండు పూటలు భుజించు పద్దతి నవలంబించదలచినవారు అది ఆరోగ్యదాయకమని గుర్తించెదరు. 19MH 304;CChTel 413.3

    దినమునకు రెండు మారులు భుజించు అలవాటు ఆరోగ్యదాయకము. అయినను కొన్ని పరిస్థితులలో కొందరికి భోజనము అవసరము. అయితే ఈ మూడవ భోజనము ఎక్కువగా నుండరాదు. ఇది సులభముగా జీర్ణమగు పదార్థమయి యుండవలెను. 20MH 321;CChTel 413.4

    విద్యార్థులు మానసికముగాను, శారీరకముగాను ఎక్కువ కష్టించి పని చేసినపుడు మూడవ పూట కూడ భుజించవచ్చును. విద్యార్థులకు మూడవ పూట భోజనముగా శాఖములతో తయారు చేయబడిన భోజనమునుకాక సామాన్యమును బలవర్ధకమును అగు ఫలములు, రొట్టెవంటి హారము నీయవలెను. 21CD 178;CChTel 413.5

    ఆహారము ఎక్కువ వేడిగా నున్నపుడు గాని, ఎక్కువ చల్లగా నున్నపుడుగాని భుజించరాదు. ఆహారము చల్లగా నున్నచో అది జీర్ణంచకముందు దానిని వేడిచేయు దానిని వేడిచేయు నిమిత్తము అన్నకోశపు శక్తి వినియోగించబడవలెను. ఈ హేతువు చేతనే చల్లని పానీయములు హానికరములు, అయితే వేడి పానీయములను తరుచు ఉపయోగించుటద్వారా దౌర్భల్యము ఏర్పడును. వాస్తవమేమనగా ఆహారముతోపాటు ఎంత యెక్కువ ద్రవపదార్థములను ఉపయోగించిన ఆహారము జీర్ణమగుట అంత కష్టము. కారణమేమనగా జీర్ణ ప్రక్రియ ప్రారం భము కాకముందు ద్రవము హరించబడవలెను. ఎక్కువ లవణములను భుజింపరాదు. ఊరగాయి, మసాల దినుసులతో నిండిన ఆహారమును విసర్థించుడి, ఫలములను ఎక్కువ భుజించుడి. అప్పుడు భోజన సమయమున ఎక్కువ నీళ్లు త్రాగునట్లు చేయు ఆ మంట మాయమగును. ఆహారమును బాగుగా నమలి నెమ్మదిగా భుజించవలెను. ఆహారముతో లాలాజలము సరిగా మిళితమయి జీర్ణద్రవముల ప్రక్రియ సాగుటకు ఇది యవసరము. 22MH 305, 306;CChTel 413.6