Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సబ్బాతు ఒక ప్రాముఖ్య విషయము

    ప్రపంచమంతయు పాల్గొనబోవు మహత్తర అంతిమ సంఘర్షణలో సబ్బాతు ప్రధమ సమస్యjైు యుండును. పరలోక పాలన సూత్రములకన్న సాతాను సూత్రములను మానవులెక్కువ మన్నించిరి. తన అధికారలాంఛనముగా సాతానుడు ఘనపరచిన కృత్రిమ సబ్బాతును వారు అంగీకరించిరి. కాని దేవుడు తన ఆజ్ఞను ముద్రించెను. సబ్బాతు సంస్ధ తన మూల కర్త నామమును ధరించును. అది తన మూల కర్త యొక్క అధికారమును సూచించు చెరగని గురుతై యున్నది. దీనిని గ్రహించునట్లు ప్రజలకు దారి చూపవలసిన వారము మనము. దైవ రాజ్య లాంఛనమును అంగీకరించెదరో లేక తిరుగుబాటు రాజ్యలాంఛనమును అంగీకరించెదరో యనునది ప్రాముఖ్యమైన విషయమని మనము వారికి వ్యక్త పరచవలెను. ఏలయనగా వారెవరి లాంఛనమును కలిగి యుందురో వారి రాజ్య పౌరులై యుందురు. CChTel 496.3

    పాద క్రాంతము చేయబడిన తన సబ్బాతు ధ్వజమును పైకెత్తుటకు దేవుడు మనలను పిలచెను. 26T 352; CChTel 497.1

    కడచిన యుగములలో నివసించిన విశ్వాసుల నాశనమునకు కుట్ర పన్నిన ఆ నిపుణుడే ఇప్పుడు కూడా దేవునికి భయపడి ఆయన ఆజ్ఞకు విధేయులై యుండు వారిని లేకుండ చేయవలెనని యత్నించుచున్నాడు. సుప్రసిద్ధములైన ఆచారములు, అలవాటులను మనశ్శుద్ధితో నిరాకరించు అల్ప సంఖ్యాకులపై సాతానుడు ప్రజల కోపమును రెచ్చగొట్టును. అధికారము నందును గొప్ప పలుకుబడి యందును ఉన్న వ్యక్తులు దైవ ప్రజలకు కీడు చేయుటకు వేద బాహ్యులతోను దుర్మార్గులతోను సంప్రదించెదరు. వారిని ద్వేషభావముతో నింపుటకు భాగ్యవంతులు, ప్రతిభావంతులు, విద్యావంతులు ఏకమగుదురు. హింసించు రాజ్యాధి నేతలు, మంత్రులు, సంఘసభికులు వారిపై కుట్ర చేసెదరు. ఉపన్యాసముల ద్వారా, రచనల ద్వారా, అపహాస్యము ద్వారా వారు దైవ ప్రజల విశ్వాసమును పొగొట్టుజూతురు. అబద్దపు సాక్ష్యముల ద్వారాను, కోపపూరితమైన ఫిర్యాదుల ద్వారాను, ప్రజల ఉద్రేకములను వారు రెచ్చగొట్టెదరు. బైబిలు విశ్రాంతి దిన వాదుల మీదికి తెచ్చుటకు లేఖనములిట్లు చెప్పుచున్నవి. అను ఋజువు లేకపోగా వారిని బాధించుటకు నిర్థాక్షిణ్యములైన శాసనములను రూపొందించ బూనుకొనెదరు. పలుకుబడి, ఆదరాభిమానములు సంపాదించుటకు గాను శాసనసభ్యేలు ఆదివార శాసనములను రూపొందించుటకొప్పుకొనెదరు. దేవునికి భయపడువారు పదియాజ్ఞలలో నొక దానిని మాజీ చేయు చట్టము నంగీకరించలేరు. ఈ యుద్ధ రంగములో సత్యాసత్యముల మధ్య అంతిమ మహా సంగ్రామము జరుగును. దీని ఫలితమును గూర్చి మనకు సంశయమేమియు లేదు. మొర్దెకయి దినములలో వలె నిప్పుడు కూడా ప్రభువు తన సత్యమును బయలు పరచి తన ప్రజలను సమర్థించును. 35T 450,451;CChTel 497.2