Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    త్రాసులో తూయబడెను

    తన ఆలయమందలి త్రాసులో మన శీలములను, ప్రవర్తనలను, ఉద్దేశ్యములను దేవుడు తూచచున్నాడు. మన హృదయములను తన వైపుకు ఆకర్షించు నిమిత్తము సిలువపై మరణించిన రక్షకుడు ప్రేమయందును, విధేయతయందును మనము తక్కువగా నున్నామని వెలువరించుట భయంకరమయిన సంగతి. దేవుడు మనకు గొప్పనియు ప్రశస్తములును అయిన వరములను అనుగ్రహించెను. మనము తప్పిపోయి చీకటిలో నడువకుండుటకుగాను దేవుడు మనకు వెలుగును తన చిత్తమును గూర్చిన పరిజ్ఞానమును అనుగ్రహిం చెను. తుది పరిష్కారము ప్రతిఫలముల దినమున త్రాసులో తూయబడి తక్కువగా నున్నట్లు కనుగొనబడుట భయంకర విషయము. ఘోరమయిన యీ దోషము ఎన్నటికిని సంస్కరింపబడనేరదు. యౌవన స్నేహితులారా, మీ పేళ్లు దైవ గ్రంథమందుండని ఎడల అది యెంత శోచనీయం!CChTel 360.1

    దేవుడు మీకొక కార్యమును నియమించి యున్నాడు. అది మిమ్మును ఆయనతో జతపనివారిగా చేయుచున్నది. మీ చుట్టుప్రక్కల రక్షించబడవలసిన ఆత్మలనేకములున్నవి. మీ ఉత్సాహ పూరిత కృషి ద్వారా ప్రోత్సాహము నీయగలవారు కలరు. ఆత్మలను పాపము నుండి నీతికి మళ్ళించవచ్చును. మీరు దేవునికి జవాబుదారులని గుర్తించినచో ప్రార్థన యుండును. సాతాను శోధనలకు లొంగకుండ మెలకువగా నుండుటయందును నమ్మకముగా నుండుట ఆవశ్యకమని గుర్తించెదరు. మీరు యధార్థ క్రైస్తవులైనచో నిర్లక్ష్య భావము కలిగి వస్త్రాహంభావముతో విర్రవీగుటకు బదులు లోకమందలి నైతిక అంధకారమును గూర్చి ప్రలాపించెదరు. దేశములో జరుగుచున్న హేయకరమయిన కార్యముల విషయము నిట్టూర్చుచు కేకలు వేయు వారి మధ్య మీరు కూడా ఉందురు. శుష్క ప్రీతి, డంబపు దుస్తులు ఆభరణముల కొరకు సాతానుడు కలిగించు శోధనలను మీరు ప్రతిఘటించెదరు. ఉన్నత బాధ్యతలను అలక్షము చేసి యీ వ్యర్థ విషయములతో తృప్తి చెందుట ద్వారా మనస్సు సంకుచితమయినది; బుద్ది క్షీణించినది.. .. CChTel 361.1

    తమ కిష్టమయినచో నేటి యువజనులు క్రీస్తుతో జత పనివారు కావచ్చును. ఇట్లు పనిచేయుట ద్వారా వారి విశ్వాసము బలపడును. దైవచిత్తమును గూర్చిన వారి జ్ఞానము వృద్దియగును. యధార్థమయిన ప్రతి ఆశయము, ప్రతి సత్క్రియ, జీవ గ్రంథమందు వ్రాయబడును. యువజనులు తమ స్వకీయేచ్ఛల కొరకు జీవించి యీ జీవితమందలి చౌకరకపు వ్యర్థ విషయాసక్తి వలన తమ బుద్దిని క్షీణింపజేసి కొనుట యందు గల పాపమును గుర్తించునట్లు చేయగలిగిన బాగుండును. వ్యర్థమయిన యీ లోకపు ఆకర్షణలను గూర్చి గాక ఉన్నతముగా తలంచి మాటలాడి దేవుని మహిమపరచుట తమ గురిగా పెట్టుకొన్నచో సమస్త జ్ఞానమునకు మించిన ఆయన సమాధానము వారికి లభించును. 73T 370, 371; CChTel 361.2

    ఆయన సేవయందు పనిచేయుటకు, బాధ్యతలను వహించుటకు యోగ్యులగు నిమిత్తము యువజనులు యధార్థమైన మనస్సు కలిగి యుండవలెనని దేవుడు కోరుచున్నాడు. దేవుని మహిమ మానవాళికి ఆశీర్వాదముగా జీవించు నిమిత్తము నిష్కళంక హృద మన రక్షకుడు ప్రపంచమునకు వెలుగై యుండెను. కాని ప్రపంచమాయనను తెలిసి కొనలేదు. ఆయన ఎల్లప్పుడు కృపా కార్యములనే చేసి మార్గమును వెలుగుతో నింపెను. అయినను తన అపరూప సుగుణమును, ఆత్మోపేక్షను, ఆత్మార్పణను, ధాతృత్వమును చూడవలసినదిగా తనతో కలిసి మెలసి యున్నవారిని కోరలేదు. అట్టి జీవితమును యూదులు అభినందించరైరి. ఆయన మతము వారి భక్తి ప్రమాణములకు అనుకూలంగా లేనందున దానిని మీరు వ్యర్థ మతముగా నెంచిరి. స్వభావమందుగాని, శీలమందుగాని క్రీస్తు మత వైరాగ్యము లేనివాడని వారు నిర్వచించిరి. ఏలయనగా వారి మతము డంభమునకు బహిరంగ ప్రార్థనకు, మెచ్చుకోలు కొరకు డాంభికదానములు చేయుటకు స్థానమై యుండెను. CChTel 361.3

    సాత్వికమను సద్గుణము పరిశుద్ధత ఫలించు అతి ప్రశస్తఫలమై యున్నది. ఈ సద్గుణము ఆత్మలో నున్నచో దాని ప్రభావమున స్వభావము మార్పు చెందును. ఆత్మ నిత్యము దైవసేవకై వేచియుండును. చిత్తము ఆయన చిత్తమునకు లొంగియుండును. CChTel 362.1

    నిజముగా దేవునితో జతపర్చబడినవారు దిన దినము ఫలించు ఫలములు ఆత్మోపేక్ష, ఆత్మార్పణ, దాతృత్వము, కనికరము, ప్రేమ, ఓరిమి, ధైర్యము, క్రైస్తవ నమ్మకము. వారి క్రియలు ప్రపంచమునకు వెల్లడి కాకపోవచ్చును. కాని వారు మాత్రము దిన దినము అవినీతితో పోరాడి శోధన, దుర్మార్గతలపై గొప్ప విజయములు సాధింతురు. నిత్యము మెళుకువగా నుండి శుద్ధ హృదయముతో ప్రార్థించుట వలన చేకూరిన బలము ద్వారా పవిత్ర ప్రమాణములు నూత్న పర్చబడి సిద్ది పొందును. ఈ నిశ్శబ్ద సేవకుల బాధకసాధకములను పైకి భక్తి కలిగిన అత్యుత్సాహి గ్రహింపజాలడు. హృదయ రహస్యముల నెరిగిన ఆయన నేత్రము దీనత్వముతోను సాత్వికముతోను, సల్పు యత్నమును గమనించి ప్రతిఫలమిచ్చును. ప్రవర్తనయందలిని నిర్మల ప్రేమను, విశ్వాస సువర్ణమును, పరీక్ష కాలమే బయలు పరచును. సంఘమును కష్టములు, క్లిష్ట సమస్యలు ఆవరించినప్పుడు క్రీస్తుని వాస్తవిక అనుచరుల ఉద్రేకము, ప్రేమ వృద్ది చెందును. CChTel 362.2

    అతనితో సావాసము చేయువారందరు అతని క్రైస్తవ జీవిత సౌందర్యమును, పరిమళము గ్రహించెదరు. కాని దీనిని గూర్చి యతడెరుగడు. ఏలనగా అట్టి జీవితము అతనికి స్వాభావికమైన అలవాటు అయ్యెను. దేవుని వెలుగు కొరకతడు ప్రార్థించును. 8MYP 21-23. CChTel 362.3