Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    కేవలం ఉద్రేకము పరిశుద్ధీకరణకు సూచనకాజాలదు

    సంతోషమునుగాని, అసంతోషముగాని ఒక వ్యక్తి పరిశుద్ద పరచబడెననుటకుగాని, పరిశుద్ధ పరచబడలేదనుటకుగాని నిదర్శనము కాజాలదు. పరిశుద్దీకరణ యనునది లేనేలేదు. యథార్థ పరిశుద్ధీకరణ ప్రాణమున్నంత వరకు దినదినము సాగుపనియై యున్నది. దైనందిన శోధనలతో పోరాటము సల్పుచు, పాపాలోచనములను జయించుచు పవిత్ర హృదయము కొరకును, పవిత్ర జీవితము కొరకును పాటుపడువారు మేము పరిశుద్దలమని ప్రగల్భములు పలుకరు. నీతి విషయము వారు ఆకలిదప్పులు గొందురు. పాపము వారికి నీచముగా అగపడదు. 16SL 10;CChTel 146.1

    మన పాపములను బట్టి దేవుడు మనలను త్యజించును. తప్పులు చేసి మన మాయన ఆత్మను దుఃఖపరచవచ్చును; కాని పాశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో మనమాయన చెంతకు వచ్చునపుడు మనల నాయన విసర్జించడు. అభ్యంతరములుకొన్ని యున్నవి. వానిని మనము తొలగించవలెను. మనలో దురుద్ధేశ్యములున్నవి. మనయందు గర్వము,అహంభావము, అసహనము, సణుగుడు ఉన్నవి. ఇవన్నియు మనలను దేవుని నుండి వేరు చేయుచున్నవి. మనము పాపములను ఒప్పుకొనవలెను. మన హృదయములలో కృప యొక్క గంభీరకృషి జరుగవలెను. బలహీనులమని తలంచి అధైర్యపడినవారు బలముగల దైవజనులుగా మారి ఆయనకు గొప్ప సేవ జేయవచ్చును. కాని వారు ఒక ఉన్నత దృక్ఫథము కలిగి పనిచేయవలెను. స్వలాభాశయములకు వారు లోనుకారాదు. CChTel 146.2

    ఆయన ఆశీస్సు పొందకముందు తాము మార్పు చెందితిమని ప్రభువుకు నిరూపించు కొనుటకుగాను పరీక్ష కాలములో నుంచబడవలెనని కొందరు తలంచుచున్నట్లు కనబడుచున్నది. ఇప్పుడు సైతము వీరు ఆయన ఆశీస్సును పొందవచ్చును. వారి బలహీనతలను దిద్దుకొను నిమిత్తము ఆయన కృప అనగా క్రీస్తు ఆత్మ వారికి అవసరము; లేకున్నచో క్రైస్తవ శీలమును వారు సాధించలేరు. మనమున్నరీతిగనే మన పాపములతోను, నిస్సహాయ స్థితిలోను, నిరాధార స్థితిలోను మనము రావలెనని ఆయన వాంఛ. CChTel 146.3

    పశ్చాత్తాపము, పాపక్షమాపణ క్రీస్తు ద్వారా దేవుడనుగ్రహించు వరములై యున్నవి. పరిశుద్ధాత్మ ప్రభావమున మనము పాపమును గుర్తించి, పాప క్షమాపణావశ్యకతను గ్రహింతము. విరిగినలిగిన హీదయము గలవారే క్షమింపబడుదురు. హృదయపశ్చాత్తాపము కలుగ జేయునది దైవకృపయే. మన బలహీనతలు గుణ దోషములు ఆయనకు ఎరుకయే, గనుక ఆయన మనకు సహాయము చేయును. 172TT 91-94;CChTel 146.4

    కొన్ని సార్లు అంధకారము, అధైర్యము, ఆత్మను ఆవహించి మనలను మంచివేయునట్లు భయపెట్టును. కాని మనము మన విశ్వాసమును వీడరాదు. మన మనస్తత్వమెట్లున్నను మనము మన దృష్టిని యేసుపై నిలుపవలెను. తెలిపిన ప్రతి విధి నియమము నమ్మకముగా నెరవేర్చ యత్నించి, మా మీదట ప్రశాంతముగా దైవవాగ్ధత్తమలపై నాధారపడి యుండవలెను. CChTel 147.1

    కొన్నిసార్లు మన అయోగ్యతను గూర్చిన గాఢాలోచన మన ఆత్మకు భయంకరమగు గగుర్పాటు కలిగించును. అయితే మనపట్ల దేవుని వైఖరిగాని, దేవుని పట్ల మన వైఖిరి మారినదనిగాని యనుటకిది నిదర్శనము కాదు. అమిత మానసిక ఉద్రిక్తత మనస్సును నడిపించుటకు ప్రయత్నించరాదు. నిన్నటి మనశ్శాంతి ఈనాడు మనకుండకపోవచ్చును; కాని విశ్వాసముతో మనము క్రీస్తు హస్తము పట్టుకొని వెలుగునందు వలె చీకటి యందు కూడా ఆయనలో సంపూర్ణ విశ్వాసము కలిగి యుండవలెను. CChTel 147.2

    జయించువారి కొరకు దాచబడిన కిరీటములు విశ్వాసముతో వీక్షించుడి. మనలను దేవుని కొరకై విమోచించుటకు వధింపబడిన గొర్రెపిల్ల యోగ్యమైనది. యోగ్యమైనదని రక్షించబడిన వారు చేయు ఉత్సాహగానము నాలకించుడి. ఈ సన్నివేశములు యధార్థమైనవిగా భావించుటకు యత్నించుడి. CChTel 147.3

    క్రీస్తును గూర్చియు పరలోక రాజ్యము గూర్చియు మన మనస్సు లెక్కువడా తలంచుచో ప్రభుని యుద్ధమందు పోరుటకు మనకు గొప్ప ఉత్సాహము కలుగును. అచిర కాలముతో మనకు నివాసము కానున్న ఉత్తమ లోక వైభవములను గూర్చి తలంచునపుడు, గర్వము లోకాశ తమ శక్తులను కోల్పోవును. క్రీస్తు సౌందర్యము ఎదుట లోకాకర్షణ లన్నియు కొరగాని వగును. CChTel 147.4

    పౌలు గగాలి వెలుతురులుసోకని రోమా చెరసాలలో బంధింపబడినను సువార్తు సేవ చేయుటకు అడ్డగింపబడిననను ఏ క్షణములోనైనను మరణదండన తనపైకి వచ్చునని కనిపెట్టుచుండినను ఏ క్షణములోనైనను మరణ దండన తన పైకి వచ్చునని కని పెట్టుచుండినను సంశయమునకుగాని అధైర్యమునకుగాని లొంగినవాడు కాడు. ఆయనపుడిచ్చిన సాక్ష్యము, ఆ చీకటి బిలమునుండి, ఆయన మరణించినప్పుడిచ్చిన సాక్ష్యము శ్రేష్టమగు విశ్వాసముతోను, ధైర్యముతోను నిండినదై తరువాత యుగములందలి భక్తవరుల హృదయములను హతసాక్షులు హృదయములను ఆవేశముతో నింపినది. ఈ పుటలలో వ్యక్తము చేయుటకు యత్నించుచున్న పరిసుద్దీ కరణయొక్క ఫలితములను ఆయన పలుకులు సమంజసముగా వివరించుచున్నవి. “నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా నిర్వాణ కాలము సమీపమైనది. మంచి పోరాటమును పోరాడితిని నా పరుగు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతి కిరీటముంచబడి యున్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతియైన ప్రభవు అది నాకును ,నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించువారందరికిని అనుగ్రహించును. ”(2 తిమొధి. 4:6-8. )18SL 89-86. 89CChTel 147.5