Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ప్రార్థన సిద్దికి షరతులు

    ఆయన వాక్యప్రకారము జీవించినప్పుడే ఆయన వాగ్దాన సిద్దిని మనము పొందగలము. దావీదు ఇట్లు నుడువుచున్నాడు: “నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.” (కీర్తనలు 66:18) ఆయనకు మనము పూర్ణ విధేయత చూపనిచో మన యెడల ఆయన వాగ్దానము నెరవేరదు. CChTel 452.1

    రోగుల స్వస్థత కొరకు చేయవలసిన ప్రత్యేక ప్రార్థనను గూర్చి దైవ వాక్యమునందు ఉపదేశము కలదు. అట్టి ప్రార్థనా ప్రక్రియ అతి గంభీరమైన కార్యము. దీనిని అనాలోచితముగా నిర్వహించరాదు. రోగుల స్వస్థత కొరకు చేయబడు ప్రార్థన యందు అనేక సందర్భములలో విశ్వాసమని పిలువబడుచున్నది దురభిమానము మాత్రమే. CChTel 452.2

    అనేకలు లోకభోగముల వలన రోగమును తమపైకి తెచ్చుకొను చున్నారు. వారు ప్రకృతి నిబంధన ప్రకారము లేక పవిత్రతా సూత్రముల ననుసరించి జీవించరైరి. కొందరు తినుటలోను త్రాగుటలోను ధరించుటలోను లేక పనిచేయుటలోను ప్రకృతి నిబంధనలను అలక్ష్యము చేసిరి. తరచుగా మానసిక మయిన శారీరకమయిన దుర్భలతకు ఏదో ఒక దురభ్యాసము హేతువగుచున్నది. ఈ వ్యక్తులు ఆరోగ్యమును దీవెనను పొందినచో అనేకులు దేవుడిచ్చిన ప్రకృతి నిబంధనలను, ఆధ్యాత్మిక నియమావళిని అతిక్రమించుచునేయుందురు. దేవుడు తన ప్రార్థనలకు అనుగుణ్యముగా వారిని స్వస్థపరచినచో తమ అనారోగ్యదాయకములగు అభ్యాసములను విడువక హానికరమయిన భోజన పానములను స్వేచ్ఛగా చేయవచ్చునని వారు తలంతురు. ఈ వ్యక్తులకు స్వస్థతనిచ్చుటలో దేవుడొక అద్భుతమును చేసినచో, ఆయన పాపమును ప్రోత్సహించిన వాడగును. CChTel 452.3

    ప్రజలకు అనారోగ్యదాయకములైన అభ్యాసములను విడిచి పెట్టుట నేర్పకుండ తమ వ్యాధులను పోగొట్టుటకు దేవుని నాశ్రయించుడని వారికి నేర్పుట వ్యర్థ కృషి యగును. తమ ప్రార్థన ఫలముగా దీవెన పొందుటకు వారు కీడును వీడి మేలు చేయవలెను. వారి పరిసరములు పరిశుభ్రముగాను వారి యలవాట్లు నిర్దుష్టములుగను నుండవలెను. దేవుని ప్రకృతి శాసనమును అనుసరించి వారు జీవించవలెను. దేవుని ప్రకృతి చట్టమునైనను ఆధ్యాత్మిక చట్టమునైనను మీరుట పాపమనియు ఆయన దీవెనలను పొందనపేక్షించుచో వారు పాపము నొప్పుకొని దానిని విసర్జించవలెననియు ఆరోగ్యము కొరకు ప్రార్థన నపేక్షించు వారికి స్పష్టపరచవలెను. CChTel 452.4

    లేఖన మిట్లాదేశించు చున్నది. మీ పాపములు ఒకనితో నొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందనట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. (యాకోబు 5. 16). ప్రార్థించుడని యడుగు వ్యక్తికి నిట్టి తలంపులను వెలిబచ్చుడి. మేము హృదయ రహస్యముల నెరుగుము. ఇవిమీకును దేవునికిని మాత్రమే తెలియును. మీ పాపములను గూర్చి మీరు పశ్చాత్తాపCChTel 453.1

    పడినచో వానిని ఒప్పుకొనుట మీ విధియై యున్నది. రహస్య పాపము దేవునికిని మానవునికినిమధ్యవర్తియగు క్రీస్తతోడనే యొప్పుకొనవలెను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు (యోహాను 2. 1) ప్రతి పాపము దేవునికి విరోధముగా చేయబడు నేరము. కనుక దానిని క్రీస్తు ద్వారా ఆయనతో ఒప్పుకొన వలెను. ప్రతి బహిరంగ పాపమును బహిరంగముగానే ఒప్పుకొనవలెను. తోడి మానవుని యెడల చేసిన పొరపాట్లున అతినతోడనే సరిచేసికొనవలెను. ఆరోగ్యమునపేక్షించు వారెవరైనను చెడ్డగా మాటలాడినచో గృహమునందు గాని, ఆ పరిసరమందుగాని సంఘమునందు గాని వారు అసమాధాన బీజములను విత్తి తద్వారా వేరుపాటును, అనైక్యతను కలిగించినచో, ఏదేని దురభ్యాసము వలన ఇతరులను పాపములోనికి నడిపించినచో, ఈ తప్పిదమును దేవుని ముందు నష్టపరచబడిన వ్యక్తితో ఒప్పుకొనవలెను. మనము మన పాపములను ఒప్పుకొనినయెడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్ణీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును (యోహాను 1 : 9)CChTel 453.2

    తప్పులను సరిచేసికొన్న మీదట పరిశూద్ధాత్మ నడుపుదల చొప్పున మనము విశ్వాసముతో రోగి యొక్క అవసరములను ప్రభువు కెరిగించ వచ్చును. ఆయన ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసగా ఎరుగును. తన కొరకే తన కుమారుని ఇచ్చినట్లు ప్రతి వ్యక్తి విషయము ఆయన శ్రద్ధ వహించును. దైవప్రేమ అంత మహత్తరమయినది. నిశ్చితమయినది. గనుక రోగులాయన యందు విశ్వాసముంచి ఉల్లాసముగా నుండవలెను. తమ్మును గూర్చి తాము ఎక్కువ ఆత్రముగా నుండుట యనునది బలహీనతను వ్వాధిని కలిగించును. విచారము, ఆందోళనలకు లోనుకాకుండా ఉన్నచో వారు స్వస్థత పొందు అవకాశము ఎక్కువ యుండును. యెహోవా దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టువారి మీద నిలుచును. (కీర్తనలు 33. 18)CChTel 453.3

    రోగుల కొరకు చేయు ప్రార్థన యందు యుక్తగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. అని జ్ఞాపకముంచుకొనవలెను. (రోమా 8. 26) మనము కాంక్షించు దీవెన ఉతమత మైనదో కాదో మనమెరుగము. కనుక మన ప్రార్థనలలో నీ తలంపుండవలెను. ప్రభువా ఆత్మ సర్వరహస్య మెరిగిన వాడవు నీవే. ఈ వ్యక్తులతో నీకు పరిచయమున్నది. వారి ఉత్తరవాది యగు యేసు వారి కొరకు తన ప్రాణము నిచ్చెను. వీరిపట్ల మాకుండవలసిన ప్రేమ కంటె ఆయనకున్న ప్రేమ మెండు. కనుక ఇది మీ నామ మహిమార్థమును రోగి క్షేమార్థమును అయినచో వీరికి స్వస్థత నీయుమని యేసు నామమందడుగుచున్నాము. వీరు స్వస్థత పొందుట మీ చిత్తము కానియెడల మీ కృప వీరిని ఓదార్చి మీ సముఖము వారిని తమ బాధలలో ఆదకొనవలసినదిగా వేడుకొనుచున్నాము. CChTel 454.1

    దేవునికి ఆద్యంతములు తెలియును. ఆయన సర్వమానవ హృదయములను ఎరుగును. ఆత్మయొక్క ప్రతి రహస్యము ఆయనకు ఎరుకయే. వారి జీవితములు తమకును లోకమునకును ఆశీర్వాదకరములుగ నుండునో ఉండవో ఆయనకు ఆకళింపే. ఇందుచేతనే మానవులను విన్నవించునపుడు మనము ఆతురతతో నిట్లందుము. అయినను నా యిష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాను. (లూకా 22. 44) గెత్సెమను వనములో విజ్ఞాపన చేయుతరి యేసు ఈ మాటల ద్వారా దేవుని జ్ఞానమునకు చిత్తమునకు తన్నుతాను అప్పగించుకొనెను. నా తండ్రీ సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము (మత్తయి 26. 39) దైవకుమారుడగు ఆయనకిని తగియున్న పక్షమున కొరగాని పాప మానవుల పెదవులకివి యింక నెత యెక్కువగా తగియున్నవి. CChTel 454.2

    యుక్తమయిన మార్గమేదనగా మన వాంఛలన సర్వజ్ఞానియగు మన పరమజనకుని హస్తమందుంచి ఆ మీదట సంపూర్ణ విశ్వాసముతో సమస్తమును ఆయనకు అప్పగించుటయే. తన చిత్త ప్రకారము మనము అడిగినచో ప్రభువు మన మొర నాలించునని మన మెరుగుదము. కాని లొంగుబాటుకు గాని ఆత్మలేకుండ మన మనవులను పొందజూచుట గాని మంచిది కాదు. మన ప్రార్థనలు ఆజ్ఞల కాక విజ్ఞాపనలై యుండవలెను. CChTel 454.3

    స్వస్థపరుచుటలో దేవుడు నిష్కర్షగా తన దైవ శక్తిని ప్రదర్శించు సందర్భములు కొన్ని యుండును. కాని రోగ గ్రస్తులందరును స్వస్థపరచబడరు. అనేకులు ఏసునందు నిద్రించెదరు. CChTel 454.4

    పద్మను ద్వీపములో యోహాను ఇట్లు వ్రాయవలసినదిగా ఆదేశించబడియెను, “ఇప్పటి నుడి ప్రభువనందు మృతినొందు మృతుల దన్యులని వ్రాయుమని పరలోకము నుడి యొక స్వరము చెప్పగా నింటిని. నిజమే; వారుతమ ప్రయాసమలు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియల వారి వెంట పొవునని ఆత్మ చెప్పుచున్నాడు,” (ప్రక. 14:13) స్వస్థపరచబడక పోయినచో ఆ కారణముగా వారికి విశ్వాసము లోపించినదని మనము తలంచరాదని దీనిని బట్టి మనకు వ్యక్తమగు చున్నది. CChTel 455.1

    మన మెల్లరమును మన ప్రార్ధనలకు తక్షణమైన, ప్రత్యక్షమైన జవాబలు రావలెనని యపేక్షింతుము. జవాబు ఆలస్యమైనచో లేక తలంపులకు విరుద్ధముగా ఆ జవాబులు వచ్చినచో ఆధైర్యము చెందుటకు శోధితుల మగుదుము. ఆయన మహా వివేకియు సద్గుణసంపన్నుడును గనుక మన ప్రార్ధనలకు మనము కోరిన సమయమంద మనమ కోరిన విధమున జవాబుల నీఉడు. మన మడిగిని దానికన్న ఎక్కువ గాన మంచివియునైన ఈవుల ననుగ్రహించును. మన మాయన జ్ఞానమను, నమ్ముదము గాన మన చిత్త ప్రకారము చేయుమని మన మాయనను అడగరాద. అట్లకాక మనమాయన యేర్పాటులవలెను. విశ్వాసమును పరీక్షించు ఈ యనుభవమలు మనకు శ్రేయస్కరముల. దేవుని వాక్యముపై మాత్రమే ఆధారపడి మన విశ్వాసము దార్ధమయినదో లేక పరిస్ధితలపై నానుకొని అనిశ్చితమై మారునదో వీనిని బట్టి వ్యక్తమగును. దేవునిపై నాధారపడవారికి లేఖనమల యద ప్రశస్తములైన వాగ్దానములున్నవని జ్ఞాపకమ చేసికొనుచు ఓర్పును కలిగియుండవలెను. CChTel 455.2

    ఈ సూత్రముల నందరును గ్రహించలేరు. ప్రభుని స్వస్థపరచు కృపను కాంక్షించువారిలో ననేకులు తమ ప్రార్థనలకు తక్షణ, ప్రత్యక్ష సమాధానము రావలెననియు అట్లు రానిచో తమ విశ్వాసము లోపభూయిష్ఠమైనదనియు తలంతురు. ఈ కారణముచే రోగముచే బలహీనులైనవారు జ్ఞానయుతముగా వర్తించు లాగన వారికి హితవు గరపుట యవసరము. జీవమున్నంత వరకు తమకు సేవ చేయుచున్న స్నేహితుల యెడల తమకు గల విధిని రోగులు ఉపేక్షించరాద. లేక తమ స్వస్థత కొరకు ప్రకృతి శక్తులను ఉపయోగించు కొనుట ఆశ్రద్ధ చేయరాదు. CChTel 455.3

    తరచుగా ఇక్కడనే పొరపాటు జరుగు నపాయము కలదు. ప్రార్ధన ఫలితముగా స్వస్థపడెదమని నమ్మి ఆ మీదన చేయబడ మానవ ప్రయత్నమలు తమ అవిశ్వాసమునకు గురుతని వారు భయపడెదరు. మరణము సంభవమని వారు నమ్మినచో చివరగా చేయవలసిన ప్రతి కార్యమును అప్పుడు చేయుటకు అశ్రద్ధ చేయరాదు. లేక తమ ప్రియుల నెడబాయునపుడు వారు చెప్ప కాంక్షించు చివరి సలహాలను, ధైర్యపు మాటలను చెప్పుటకు భయపడరాదు. CChTel 456.1

    ప్రార్ధన ద్వారా స్వస్థత నపేక్షించు వారు తమ కందుబాటులోనున్న ఉపదేశమును, విధానములను అలక్ష్యము చేయరాదు. బాధన ఉపశమింపజేసి స్వస్థతను గూర్చుటకు ప్రకృతికి సహాయము చేయుటకు దేవుడనుగ్రహించిన ఔషదములను ఉపయోగించుట విశ్వాసము నుపేక్షించుట కానేరదు. జీవన విధులను గూర్చిన పరిజ్ఞానము సమార్జించుటను దేవుడే మనకు సాధ్యపరెను. మనముపయోగించు నిమిత్తమే యీ జ్ఞానము మనకు అందుబాటులో నుంచబడినది. ప్రకృతి చట్టముల కనుగుణముగా పనిచేయుచు ప్రతి సదవకాశమును పురస్కరించుకొని ఆరోగ్య పునస్ధాపన కొరకు మనము కృషి ఏయవలెను. మనకున్నదుకు ఆయనకు వందనములు చెల్లించుచు ఆయన అనుగ్రహించు సాధనములను దీవించుమని అభ్యర్థించుచు ఇతోధక శక్తితో మనము పనిచేయ వచ్చును. CChTel 456.2

    మనము ఔషధములనుపయోగించుటకు దేవుడగీకరించెను. ఇశ్రాయేలు రాజగ హిజ్కియా వ్యాధిగ్రస్తుడు కాగా అతడు మరణించవలెనని దైవ ప్రవక్త వర్తమానమ తెచ్చెను. అతడు దేవునికి మొరపెట్టుకొనగా దేవుడాతని మనవి నాలించి తనకు మరిపదునైదు వత్సరములను గ్రహించ బడినవని వర్తమాన మంపెను. దేవుడొక మాట పలికిచనో నది హిజ్కియాకు తక్షణ స్వస్థత కూర్చియుండెడిదే. కాని ప్రత్యేక ఉపదేశమీయబడెను. “అజూరపు పండ్లు ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను. అప్పుడతడు బాగపడునని చెప్పెను.” (యెషయా 38:20)CChTel 456.3

    రోగికి స్వస్థత కలుగవలెనని మనము ప్రార్థింఉనపుడు, దాని ఫలితమేమయినను దేవుని యదు విశ్వాసమును మనము కోల్పోరాదు. మనకు దు:ఖము సంప్రాప్తమయినచో తడ్రిహస్తమ చేదుగిన్నెను మన పెదవులకడ ఉచి యున్నదని జ్ఞాపకముంచుకొని ఆ గిగ్నెను పుచ్చుకొందము. అయిఏ ఆరోగ్యము పునర్లభ్యమగుచో స్వస్థతా కృపను పొందిన వ్యక్తి సృష్టి కర్త పట్ల నెరవేర్చ వలసిన బాధ్యత నూత్న పర్చబడినదని గుర్తించవలెను. పది మంది కుష్టు రోగులు సుద్ధి పొందిన పిదప మహిమ పరుచు నిమిత్తము క్రీస్తు కడకు ఒకడే తిరిగి వచ్చెను. దైవ కృపచే కదిలింప బడని కృతఘ్నులైన తక్కిన తొమ్మండుగురు వలె మన ముండరాదు. “శ్రేష్ఠమైన ప్రతి యీనియు సంపూర్ణ మయిన ప్రతి వరమును వరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమమయినను గమనగామనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు.”CChTel 456.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents