Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 46 - క్రైస్తవ విద్య

    మనము ప్రపంచ చరిత్ర యొక్క అంతిమ క్లిష్ట ఘట్టమును సమీపించు చున్నాము. మన పాఠశాబలిచ్చు విద్యా విషయక లాభములు లోక విద్యా సంస్థ లిచ్చులాభములకన్న వ్యత్యాసముగా నుండవలెనని మనము గ్రహించుట ప్రాముఖ్యము. 1CT 56CChTel 382.1

    విద్యను గూర్చి మన అభిప్రాయములు సంకుచితములై అల్ప విస్తృతి కలిగియుండుట కద్దు. సమధిక విస్తృత సమున్నత లక్ష్యము అవసరము. కొన్ని పాఠ్య గ్రంధములను పఠిoచుట మాత్రమె నిజమైన విద్య కానేరదు. ఇందింత కన్న నెక్కువ యిమిడి యున్నది. ప్రస్తుత జీవనము కొరకు సిద్దపడుట కన్న నిజ విద్యాశబ్దమందెక్కువ భావము గర్భితమై యున్నది. అది మానవ శక్తులన్నిటి యొక్కయు ఆయుహ్ ప్రమాణము యొక్కయు నభి వృద్ధికి సంభంధించినది. వాస్తవిక విద్య యనగా శరీరక ,మానసిక ,ఆధ్యాత్మిక శక్తుల సమగ్రాభివృద్ధియని భావము. అది యీ ప్రపంచ సేవానందము కొరకును రానున్న ప్రపంచ విస్తృత ,సమధిక సేవానందము కొరకును విద్యార్ధిని సిద్దము చేయును. నిజముగా విద్యా కర్తవ్యయమును విమోచన కర్తవ్యము నొకటే. ఏలయనగా విమోచన యందువలె విద్యయందు కూడ “వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే”3Ed. 30;CChTel 382.2

    మానవుడి తన సృష్టి కర్తయొక్క స్వరూపమును మరల ప్రతి ఫలింపజేయు నిమిత్తము ఆతని నైతిక స్వభావమును సమున్నత పరచి, ఉదాత్తము చేయుటకు ఆతనిని దేవునితో తిరీగి సమైక్య పరచుటయే విద్యావ్యసంగము యొక్కయు జీవిత శిక్షణ యొక్కయు లక్ష్యమై యున్నవి. ఈ కార్యము చాల ప్రాముఖ్యమయినది కనుకనే రక్షకుడు పరలోకము వీడి ఉన్నత జీవితార్హతను మానవుడెట్లు సంపాదించవలెనో నేర్పించుటకు ఈ భువికి స్వయముగా వచ్చెను. 4CT 49;CChTel 382.3

    లోక సంభందమయిన ఏర్పాటులలోను, పద్దతులలోను, ఆచారములలోను, నిమగ్నులమయి మనము నివసించు చున్నకాలమును గూర్చి తలంచకుండుట లేక నిర్వర్తించ వలసిన మహత్తర కార్యములను గుర్తించక నోవాహు దినములందలి ప్రజల వలె నుండుట సులభమే. దేవుడొసంగని అలవాటులు, ఆచారములు పారంపర్యముగా వచ్చు నియమములు, పాటించిన యూదులు చేసిన పొరపాటులనే మన విద్యావేత్తలు కూడ చేయు ప్రమాదము కలదు. కొందరు పాత అలవాటులను పట్టుదలతో గట్టిగా పట్టుకొని తమ రక్షణ వాని పయినే అనుకొనియున్నచో అన్నట్లు ఆ ప్రాముఖ్యమైన విద్యలను నేర్చుకొన కాంక్షించెదరు. దీనిని చేయుటలో వారు దేవుని ప్రత్యేకమైన పనిని వీడి విద్యార్థులకు తప్పుడు విద్యను గరపెదరు. 56T 150, 151;CChTel 382.4

    సంఘములలో పనిచేయుటకు అర్హులైన స్త్ర పురుషులు కావలెను. వారు మన యువజనులను ప్రత్యేకమయిన పనుల కొరకు తర్పీతు చేసి ఆత్మలు క్రీస్తును వీక్షించుటకు తేబడునట్లు చేయవలెను. మనము స్థాపించు పాఠశాలలు ఈ లక్ష్యమును సాధించవలెను గాని ఇతర సంఘములు స్థాపించు మత పాఠశాలలను అనుసకరించి గాని లేక కళాశాలలు, ఆధ్మాత్మిక విద్యా సంస్థలను అనుకరించిగాని స్థాపించబడరాదు. మన పాఠశాలలు ఉన్నత స్థాయిలో స్థాపితములు కావలెను. అందు అవిశ్వృాస సిద్ధాంతముల ఆ విర్భూతిగాని వానిని సహించుటగాని ఉండరాదు. విద్యార్థులకు ప్రాయోగిక క్రైస్తవ మతమును నేర్పవలెను. బైబిలు సమున్నతమయిన అతి ప్రాముఖ్యమయిన పాఠ్య గ్రంథముగా పరిగణించబడవలెను. 6FE 231;CChTel 383.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents