Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సబ్బాతుబడి

    సబ్బాతు బడి యొక్క లక్ష్యము ఆత్మలను పోగు చేయుటయై యుండవలెను. కార్య నిర్వహణ క్రమము నిర్దుష్టముగా నుండవచ్చును; కావలసిన సదుపాయములన్నియు ఒనగూడి యుండవచ్చును; బాలలు, యువజనులు క్రీస్తు వద్దకు చేర్చబడినిచో ఆ బడి అపజయము పొదినట్లే. కారణమేమనగా ఆత్మలు క్రీస్తు వద్దకు చేర్చబడకున్నచో ఆచారముల దొంతరయైన మత ప్రభావము క్రిందనున్న వారి ఆసక్తి రాను రాను మొద్దుబారును. సహాయ మవసరమైన వారి హృదయద్వారమును క్రీస్తు తట్టునపుడు ఉపాధ్యాఉడు సహకరించవలెను. పరిశుద్ధాత్మ చేయు విజ్ఞాపనకు లొంగి విద్యార్థులు క్రీస్తులోనికి వచ్చు నిమిత్తము, తన హృదయ ద్వారములను తెరచుచో దైవ సంగతులను గ్రహించునట్లు వారికి ఆయన గ్రహింపశక్తి ననుగ్రహించును. ఉపాధాయుని పని సామాన్యమైనదే. కాని యది క్రీస్తు స్వభావముతో నిర్వహించబడినచో దేవుని ఆత్మ పనిచేయుట వలన ఆ పనికి గాంభీర్యము, నైపుణ్యము కలుపబడును. CChTel 74.5

    తల్లి దండ్రులారా, ప్రతి దినము మీ బిడ్డలతో కలిసి సబ్బాతు బడి పాఠములను చదువుటకు కొంత సమయమును ప్రత్యేకించుడి. అవసరమగుచో మీ పొరుగు వారిని దర్శించటు మానిన మంచిదేగాని పరిశుద్ధ చారిత్రక ప్రశస్త పాఠములను చదువుటకు ఏర్పరచు కొనిన సమయమును పోగొట్టుకొనవద్దు. ఈ పాఠనమువలన తల్లిదండ్రులకును బిడ్డలకును లాభము చేకూరును. పాఠమునకు సంబంధించిన ప్రముఖ లేఖన భాగములను కంఠస్తము చేయుడి. ఇది యొక విధియని గాక తరుణమని భావించవలెను. ఆదిలో మీ జ్ఞాపకము బలహీనముగా నుండినను అభ్యాసము వలన నది బలపడును, కొంత కాలమునకు సత్యవాక్య సంపత్తిని భద్రపరచుకొనుటలో గొప్ప సహాయముగా నుండును.. .. CChTel 75.1

    మీ కుటుంబములో లేఖనములను పఠించుటలో నొక నిర్ధిష్ట పద్ధతి నవలంభించుడి. ప్రాపంచికమైన దేదియు లెక్కచేయకుడి; అనవసరమైన కుట్టులను, వంటలను మాని వేయుడి. కాని జీవాహారముతో ఆత్మను నింపబడుటలో మాత్రము శ్రద్ధ వమించుడి అనుదిన్మఉ ఒక గంట లేక అరగంట అయినను సంతోషముతో దైవ వాక్యమును ధ్యానించినచో దాని సత్ఫలితములు ఊహింపరానివి. బైబిలుకు దానినే వ్యాఖ్యానముగా నుపయోగించుచు ఒక అంశముపై ఆయా కాలములందు ఆయా పరిస్థితుల క్రింద నీయబడిన వాక్యములను క్రోడికరించుడి. ఈ కుటుంబ గోష్టిని స్నేహితులు వచ్చుట వలన విరమించకుడి. చర్చ జరుగు సమయమందు వారు వచ్చుట తటస్థించుచో అందు పాల్గొనవలసినదిగా వారిని ఆహ్వానించుడి. ఐహిక వినోదములను గాని సంపదలనుగాని పొందుటకన్న దైవవాక్య జ్ఞానము ప్రాముఖ్యమని మీరు పరిగణించునట్లు కనబరచుడి. CChTel 75.2

    కొన్ని (సబ్బాతు) బడులలో వచనములను పాఠ పుస్తకములనుండి చదువు ఆచారమున్నదని చెప్పుట నాకు చాల విచారము. ఇది శ్రేయస్కరము కాదు. తరుచు వ్యర్థముగాను, పాపకార్యములందును వెచ్చింపబడు సమయము లేఖన పఠనమునకు వినియోగింపబడినచో ఇది సంభవించవలసిన అగత్యముండదు. ఉపాధ్యాయులుగాని విద్యార్థులుగాని సబ్బాతుబడి పాఠములంత క్షుణ్ణముగా నేర్చుకొనలేక పోవుటకు కారణములేదు. ఇవి అన్నిటికన్నా ప్రాముఖ్యమగు అంశములు గనుక వారు వీని నెక్కువ శ్రద్ధతో పఠించవలెను. వీని నశ్రద్ద చేసినచో దేవునికి విచారము కలుగును. CChTel 76.1

    సబ్బాతుబడిలో బోధించువారు దైవ సత్యముతో తమ హృదయములను బలపరచు కొనవలెను. వారు వాక్యమును వినువారు మాత్రమే గాక దాని ప్రకారము చేయువారకై యుండవలెను. ద్రాక్షవల్లి నుండి తీగలు పోషణపొందు రీతిగా క్రీస్తునందు వారు పోషణ పొందవలెను. దైవ ఉద్యానవనమందలి పుష్పముల వంటి కృతజ్ఞతా సువాసనలీను పుష్పములతో నిండిన వృక్షములు వలె వారి హృదయములుండునట్లు పరలోక కృపాతుషారబిందువులు వారిపై పడవలెను. ఉపాధ్యాయులు దైవ వాక్యమును జాగృతిలో పఠించు విద్యార్థులై ఉండవలెను. క్రీస్తు పాఠశాలలో వారు అనుదినము పాఠములు నేర్చుకొను చున్నారను వాస్తవమును బయలు పరచుచు, ప్రపంచమునకు వెలుగును మహోపాధ్యాయుడునగు ప్రభువు వద్ద నుండి తాము పొందిన వెలుగును ఇతరులకు అందించగల సమర్థత కలదని నినిరూపించుకొనవలెను. CChTel 76.2

    అప్పుడప్పుడు నాయకుల ఎన్నిక సందర్భముగా వ్యక్తిగత ఆసక్తులను చొరనీయకుడి, దైవ భీతి ప్రేమలు కలిగి తమ సలహాదారునిగా దేవుని నెన్నుకొనిరని మీరు నమ్మిన వారినే బాధ్యతాయుత స్థానములలో నుంచుటకు జ్ఞాపకముంచుకొనుడి. 102TT 557,566;CChTel 76.3