Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విధేయతద్వారా బలము

    సత్యమును ఎరిగిన వారిపై బృహత్తర బాద్యత పెట్టుబడినది. వారి సమస్త క్రియలు తమ విశ్వాసమునకు అనుగుణ్యముగా నుండవలెను. వారి జీవితములు సంస్కృతి చెంది పరిశుద్ధ పరచబడవలెను. వర్తమానము సమాప్తము కానున్న యీ దినములలో సత్వరముగా చేయబడవలసిన పనికి వారు సిద్ధపడవలెను. అన్నపానములయందు నిమగ్నుములగుటకు వారికి సమయము లేదు. ఈ మాటలను మనము అత్యాసక్తితో శిరసావహించవలెను. “మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునటు ను మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారుమనస్సు నొంది తిరుగుడి.” అ. కా. 3:20. మనలో ననేకులకు ఆధ్యాత్మికత లోపించి యున్నది. వారు సంపూర్తిగా మారుమనస్సు పొందకున్నచో వారికి నాశనము తథ్యము. ఈ అపాయమందుండుట మీ కిష్టమా?CChTel 426.3

    తన ప్రజలు నిత్యము ప్రగతి చెందవలెనని దేవుని ఆకాంక్ష. తిండిపోతు తనము మానసికాభివృద్దికి ఆత్మ పరిపూర్ణతకు గొప్ప అవరోధమని మనము గ్రహించవలెను. ఆరోగ్య సంస్కరణము ననుసరించుచున్నామని చెప్పుకొను మనలో ననేకులు క్రమముగా ఆహారమును భుజించుచు తిండిబోతు తనము శారీరక మానసిక దౌర్బల్యమునకు ప్రబల కారణమై బలహీనతకు అకాల మరణమునకు దారితీయుచున్నది. పవిత్ర స్వభావము కలిగియుండవలెనని కోరు వ్యక్తి భోజన కాంక్షను అదుపులో పెట్టుట క్రీస్తు నందు సాధ్యమగునని జ్ఞాపకముంచుకొన వలెను. CChTel 426.4

    మాంసాహారముద్వారా మనకు మేలు చేకూరినచో నేను మీ కీ విజ్ఞప్తి చేయనే చేయను. కావున దాని ద్వారా లాభము కలుగదని తెలియుచున్నది. శరీర క్షేమమునకు మాంసాహారము. కనుక దానిని మనము వర్జించవలెను. శాకాహారము దొరుకు తావులలో నున్న వారు అ విషయములో తమ ఇచ్ఛను అనుసరించి తమ యిచ్ఛ వచ్చినట్లు తినుచు త్రాగుచు నున్నచో ప్రస్తుత కాల సత్యము విషయము దేవుడిచ్చిన ఉపదేశమును నిర్లక్ష్యము చేసెదరు. సత్యమును గుర్తించు శక్తి సన్నగిల్లును. నిశ్చయముగా వారు తాము నిత్తిన పంటనే కోసెదరు. CChTel 427.1

    మన పాఠశాలలోని విద్యార్థులకు మాంసాహారముగాని అనారోగ్యదాయకమగు ఆహారమునుగాని వడ్డించరాదని నేనుదేశించబడితిని. ఉద్రేకము రెచ్చగొట్టునదేదియు వారికి వడ్డించరాదు. వృద్ధులకు, యువజనులకు, నడివయస్సునందున్నవారికి నేను చేయు విజ్ఞప్తియిది. మీకు హాని కలిగించు పదార్థములను భుజింపకుడి. వీనిని త్యాగము చేయుటద్వారా ప్రభువుకు సేవ చేయండి. CChTel 427.2

    మాంసాహారము లేనిదే జీవించేట కష్టమని భావించువారనేకులున్నారు. కాని వారు దేవుని పక్షమున జేరి ఆమన నడిపించు మార్టమున నడుచులకు దృముగా తీర్మానించు కొన్నచో దానియేలు, అతని స్నేహితులు పొందినట్లు వారు కూడా బలమును వివేకమును పోందగలరు. తమకు దేవుడు మంచి వివేచన నిచ్చునని వారు గ్రహింతుడు. ఆత్మోపేక్ష క్రియల వలన దేవుని సేవకు నిల్వచేయ వీలున్న పైకమును చూచి అనేకులు దిగ్భ్రమ చెందెదరు. ఆత్మాపేక్షలేని గొప్ప విరాళములు సాధించ గలిగినదానికన్న త్యాగకార్యములద్వారా నిల్వచేయబడిన చిన్న మొత్తములు దైవసేవాభ్యుదయమునకు ఎక్కువ తోడ్పడగలవు. CChTel 427.3