Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 10 - క్రీస్తు మన నీతి

    “మన పాపాములను మనము ఒప్పుకొనిన యోడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మనపాపములను క్షమించి సమస్త దుర్ణీతినుండి మనలను పవిత్రులను చేయును”CChTel 131.1

    న పాపములను ఒప్పుకొని ఆయన యెదుట వినయ హృదయులపై యండవెలరనని దేవుడు మనలను కోరుచున్నాడు. అయితే ఆయన తనయందు విశ్వాసముందువారిని విడనాడని దయగల తండ్రియని మనము నమ్మిక యుంచవలెను. మనలో చాలమంది దృష్టిద్వారా నడుతురుగాని విశ్వాసముద్వారా కాదు. కనబడు వానిని మనము నమ్ముదుము కాని దైవగ్రంధమందున్న ప్రశస్త వాగ్దత్తములను అభినందిపము. ఆయన సెలవిచ్చు దానిని నమ్ముటలేదని చూపించుచు నిజముగా మనతో నున్నాడా లేక మనలను మోసగించి చున్నాడాయని శంకించుట కన్న ఘెరమైన అగౌరవము మరియొకటిలేదు. CChTel 131.2

    దేవుడు మనపాపములనుబట్టి మనలను త్యజింపడు. తప్పుచేసి అయన ఆత్మను మనము దు:ఖపరచు వచ్చును. కాని మనము పశ్చాత్తాపపడి, విరిగి నలిగిన హృదయముతో ఆయన యొద్దకు వచ్చునపుడు మనల నాయన విసర్జింపడు. అభ్యంతరములు కొన్ని కలవు. వానిని తొలగింప వలెను. మనయందు దురుద్ధేశ్యములున్నవి; మనయందు గర్వము, ఆహంకారము, అసహనము, నణుగుడు ఉన్నవి. ఇవన్నియు మనలను దేవుని నుండి వేరుచేయుచున్నవి. మనము మన పాపములను ఒప్పుకొనవలెను. మన హృదయములలో కృపయొక్క గంభీర కృషి జరుగవలెను. బలహీనులమని తలంచి అధైర్యపడిన వారు బలముగల దైవజను లుగా మారి ఆయనకు గొప్ప సేవ చేయవచ్చును. కాని, వారు ఒక ఉన్నత దృక్పథము కలిగి పనిచేయవలనెను. స్వలాభ చింతలకు వారు లోను కారు. CChTel 131.3

    మనము క్రీస్తు పాఠశాలయందు విద్యనభ్యసింపవలెను. క్రీస్తు యొక్క నీతియే ఆయన కృపకు మనలను ఆర్హులను చేయుచున్నది. ఈ యాశీస్సులను పొందవలెనని మనము బహుకామునుండి ఆసించి వాని కొరకు ప్రయత్నించుచున్నాము. వానిని పొందు టకు మన స్వక్రియలు కొన్ని యవసరమని మనము తలించితిమి. కనుక వానిని మనము పొందలేక పోతిమి. యేసు మన సజీవరక్షకుడని నమ్మి మనము అత్మాపేక్ష చూపవలెను. మన కృప, సత్కారాయములు మనలను రక్షింపగలదని మనము తలంచరాదు. క్రీస్తు కృపయే మనకు రక్షా నరీక్షణ. మన ప్రవ్తద్వారా ప్రభువిట్లు వాగ్ధానము చేయుచున్నాడా. “భక్తి హీనులు తమ మార్గమును విడువ వలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను: వారు యెహొవావైపు తిరిగియెడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును”. యేషయా 55:7. CChTel 131.4

    మనము ఈ వాగ్ధానమును ఉన్నదున్నట్లు నమ్మవలెను. అభిప్రాయముల వలన నడిపింపబడక విశ్వాసముతో నడవవలెను. మనము దేవుని పూర్తిగా విశ్వాసించినపుడు పాపములను క్షమించు రక్షకునిగా నమ్మి యేసు సద్గుణములపై మన మాధారపడినపుడు; మనము వాంచించు సహాయము నంతటిని పొందగలము. CChTel 132.1

    మనలను మనము రక్షించుకొనుశక్తి మనకున్నదోరయున్నట్లు మనము మనపై అనుకొందుము. ఇది మనము చేయలయేముగనుక యేసు మనకొరకు మరణించెను. ఆయన మనకు నిరీక్షణ, పరిశుద్దత, నీతి అయియున్నాడు. మనము నిస్పృహచెంది రక్షకుడు మనకు లేదని భీతిల్లరాదు. లేక ఆయనకు మనపట్ల కృపాలోచనలే లేవని రక్షకుడు మనకు లేడని బీతిల్లరాదు. లేక ఆయనకు మనపట్ల కృపాలోచనలే లేవని భయపడరాదు. ఇప్పుడాయన మన పక్షమున తన పనిని సాగించున్నాడు. మన అపనమ్మకము వలన ఆయనకు అగౌరవపరచుచున్నాము. మన ఉత్తమస్నేహితుని మనము మన్నించుచున్న విధము అశ్చర్యకరముగా నున్నది. మనలను సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడను, మనయెడల తన గంభీర ప్రేమను నిదర్శనముగా చూపిన అయనయందు మనము ఎంత అల్ప విశ్వాసము కలిగి యున్నాము!CChTel 132.2

    సహొదరులారా, ఆయన రక్షణశక్తిని నమ్మకపూర్వము పాప విముక్తి పొందవలెనని తలంచుచు స్యనీతిద్వారా దేవుని ఆదరమును పొందవలెనని మీరు నిరీక్షించుచాన్నరా? మీమనస్సులలో పోరాట మిదియై యున్నచో మీరు బలము పొందలేరనియు మెట్టుకు మీరు అధైర్యపడుదురనియు నేను భయపడుచున్నాను. అరణ్యమందు తిరుగుబాటు చేసిన యిశ్రాయేలీయులను కరచుటకు విషసర్పములను దేవుడు రానిచ్చినప్పుడు, ఇత్తడి సర్పము నెత్తవలసినదిగా మోషే ఆదేశింపబడెను. పాములు కరిచిన వరెల్లరు పైకి చూచి జీవింపవలెనని యాదేశింపబడిరి. దైవ దత్తమగు నీవరణ పద్థతిని అనుకులు గ్రహింపలేక పోయిరి. మరణినంచినవారు, మరణించుచున్నవారు తమ చుట్టపట్ల ఉండిరి. దైవసహొయము లేనిదే తమకు మరణము తప్పదని వారు గ్రహించిరి. కాని తమ శక్తి సన్నగిల్లువరకు గాయములను, భాధలను, అనివార్య మరణమును గూర్చి విలపించగా వారి కండ్లుమూతలు పడినవి. ఒక్క నిముసములో వారికి నివారణ కలిగెడిదే కాని వారాసర్పమును చూడరైరి. CChTel 132.3

    “అరణ్యమలో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో” విశ్వసించు ప్రతివాడు నశంపక ఆయనద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను” మీకు తెలిసిన పాపములు మీ యందున్నచో వానినిగూర్చి ప్రలాపించుటలో మీ యావచ్ఛక్తిని వినియోగింపక ఆయన వంక చూచి రక్షణపొందుడి. యేసు మన యేకైక రక్షకుడు ఆయన దానముచేయు కృపను స్వస్థత అగత్యమైన వేవేల ప్రజలు విసర్జించినను ఆయన సుగుణములను నిమ్మనవాడెవడును మరణించుటకు విడనాడబడడు. స్రీస్తులేని మన నిస్సహాయస్థితిని మనము గురుతించినపుడు మనము ఆధారపడి యుంవవలెను. పాప రోగముకలిగి ఆధైర్యము చెందిన బీద ఆత్మా ఆయనవైపు చూచి జీవించుము. యేసు తన మాట యిచ్చెను. ఆయన యొద్దకు వచ్చువారందరిని ఆయన రక్షించును. CChTel 133.1

    యేసు చెంతకు వచ్చి శాంతి సమాధానములను పొందుడి. ఇప్పుడు సైతము ఆదీవెనను మీరు పొందవచ్చును. మీరు నిస్సహాస్థితియుందున్నారయు మిమ్మిను మీరు ధన్యులుగా చేసికొనలేరనియు చెప్పి సాతాను మిమ్మును నిరుత్సాహపరుచును. ఇది వాస్తవమే; మీరుహాయస్థితియందే యున్నారు. కాని సాతానుని ముందు క్రీస్తును స్తుతించుడి “తిరిగిలేచిన రక్షకుడు నాకున్నాడు. ఆయన యుందు నేను నమ్మిక యంచెదను. నన్ను ఆయన గజిబిజి పడనీయడు. ఆయన నామమందు నాకు జయములుగును. ఆయనే నా నీతి. ఆయనే నా ఆనంద కిరీటము” అనుడి. ఇక్కడున్న వారెవరును తమ స్థితి అధ్వానమైనదని తలంచరాదు. వారిది అధ్వాన్నస్థితికాదు. ఘెరపావులమనియు, నాశన పాత్రులమనియు మీరు అనుకొనవచ్చును. ఇందునిమిత్తమే మీకు రక్షకుడవసరము. ఒప్పుకొనవలసిన పాపములున్నచో వెంటనే ఒప్పుకొనుడి. ఇవి చాల విలువగల గడియాలు. “మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్ణీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” యోహాను నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు నింపబడెదరు. యేసు అట్లు వాగ్దానుము చేసేను. ప్రశస్తమగు రక్షకుడు! మనలను అంగీకరించుటకు ఆయనహస్తములు చాపబడి యున్నవి. ఆయన గంబీర ప్రేమహృదయము మనల నాశీర్వదించుటకు కాచుకొని యున్నది. CChTel 133.2

    ఆయన అశీస్సులు పొందకముందు తాము మార్పు చేందితిమని ప్రభువుకు నిరూపించుటకుగాను పరీక్షింప బడవలెనని కొందరు తలంచున్నట్లు అగపడుచున్నది. ఇప్పుడు సైతము ఈ ప్రియాఆత్మలు ఆయన ఆశీస్సు పోందవచ్చును. తమ బలహినతను దిద్దుకొనునిమత్తము క్రీస్తు ఆత్మకృప వారికి నవసరము. లేకున్నచో క్రైస్తవ ప్రవర్తనను వారు సాదింపలేరు. ఉన్న రీతిదనే మనము ఆయన యొద్దకు రావలెనని యేసు కోరిక. మన పాప స్వబావముతో, నిస్సహాయస్థితియందు ఆయనపై నాధారపడి మనము రావలెనని ఆయన కోరిక. CChTel 134.1

    పశ్చాత్తాపము, పాపక్షమాపణలు క్రీస్తు ద్వారా దేవుని వరములై యున్నవి. పరిశుద్దాత్మ ప్రభావమే మనము పాపులమని నిరూపించి దాని క్షమాపణావశ్యకతను గ్రహింపజేయును విరిగినలిగిన హృదయము గలవారే క్షమింపబడుదురు. హృదయ పశ్చాత్తపము కలుగజేయునది దైవకృపయే. మన బలహీనతలు, గుణదోషములు ఆయనకు ఎకుకయే. కనుక మనకు సహాయము చేయును. CChTel 134.2

    పశ్చాత్తాపము ద్వారాను, పాపము ఒప్పుకొనుటద్వారాను దేవుని యెద్దకువచ్చి తమ పాపములు క్షమింపబడినవని కూడా నమ్ముకొందురు దైవవాగ్దానఫలమును పొందవలసినంతగా పొందజాలకున్నారు. యేసు నిత్యము సమక్షమగు రక్షకుడని వారు గ్రహింపరు. హృదయములలో ప్రారంభింపబడిన కృపా కృత్యసంపుర్ణ సిద్దికి ఆయనపై అనుకొని తమ ఆత్మలను ఆయన కప్పగించుటకు సంసిద్దముగాలేరు. వారు తమ్మును తాము దేవునికి సమర్పించు కొనుచాన్నామాని తలంచుచున్నారు గాని వాస్తవమునకు వారు తమపై యాధారపడి యున్నారు. మనస్సాక్షిగల కొందరు కొంతమట్టుకు దేవుని, కొంతమట్టుకు తమ్మునుతాము నమ్ముకొని యుందురు. ఆయనశక్తి అదుపాజ్ఞలలో నుండుటకుగాను వారు ఆయన నాశ్రయింపక శోదను లొంగకుండ జాగ్రత్తగా నుండుటపై నాధారపడియుందురు. ఇట్టి విశ్వాస మందు జయములేదు. అట్టి వ్యక్తులు వ్యర్థ ప్రయత్నములు చేయువారే; వారి యాత్మలు నిత్యబానిసత్వమందు మ్రగ్గును. యేసు పాదములు చెంత తమ భారములు మోపుపర్యంతము వారికి యుండదు. CChTel 134.3

    నిత్యము జాగృతి కలిగి యుండి యధార్ధమగు,ప్రేమో యుతమగు ధ్యానము చేయ వలసిన అగత్యము కలదు: విశ్వాసము ద్వారా దైవశక్తి అదుపులో అత్మయున్నపుడు ఇవి స్వాభావికముగా సంధిల్లును. దైవాదారము నాపదించుటకు మనము చేయగలిగినది యేమియు లేదు. లెశమైనను లేదు. మనలనుగాని మన సత్ర్కియులను గాని మనము. నమ్ముకోనరాడు కాని ,తప్పిదములతొను పాపములతోను కూడిన మానవులమైన మనము క్రీస్తు చెంతకు వట్టుమేని ఆయన ప్రేమయందు మనకు విశ్రాంతి. లభించును. . సిలువ వేయ బడిన రక్షకుని సద్గుణములను సంపూర్ణ ముగానమ్మి ఆయన చెంతకు వచ్చు ప్రతి వానిని దేవుడంగీకరించును. ప్రేమ హృదయమందు జనించును. ఆనంద పరవశ్యకత లేకపోవచ్చు గనుక ప్రతి భారము తేలికగా నుండును. విధ్యుక్త ధర్మము ఆనందమయముగను,సమర్పణ ముదావహముగను నుండును. క్రితము చీకటిమయముగా నగపడిన మార్గము నీతి సూర్యకిరణ ప్రభాచే ప్రకాశించును. క్రీస్తు వెలుగులో నున్నట్లు వెలుగులో నడుచుటయనగా ఇదే. 12TT 91-95. CChTel 135.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents