Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విజయ వాగ్దానము.

    ఈ సమయముందు మనము చేయు పని హృదయ మానసాత్మలపై తన ప్రభావము చూపగలందులకు నేను పట్టుదలతో ప్రార్ధించుచున్నాను. కలవరము అధికరించును. అయినను దేవిని నమ్మిన మనము ఒకరి నొకరు దైర్యపరచుకొన వలెను. నియమము తగ్గించక మన విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచి దానిని పెంచుదము. CChTel 528.3

    రాత్రి సమయమందు నేను నిద్రించలేకున్నప్పుడు దేవినికి ప్రార్ధన చేసెదెను. ఆయన నన్నుబలపరిచి తాను స్వదేశమందును దూరదేశములందును తన సేవచేయు వారితో నుందునని వాగ్దానము చేయును. ఇశ్రాయేలీయుల దైవము ఇంకను తన ప్రజలను నడిపించుచున్నాడనియు, అంతయు వరకు ఆయన వారితో నుండుననియు గ్రహించుకొలది నాకు దైర్యము చేకూరును. నేను ఆశీర్వదించ బడుదును. CChTel 529.1

    మూడవ దూత వర్తమాన బోధము అతి దక్షతతో ముందుకు సాగవలెనని కాంక్ష తన ప్రజలకు జయమునిచ్చుటకు సర్వయుగములందును పనిచేసిన రీతిగా ఈ యుగమందు కూడ ఆయన తన సంఘముపట్ల తన సంకల్పమును ఈడేర్చవలెనని ఆయ ఆకాక్షించుచున్నాడు. అత్యధిక బలము, విశ్వాసము, దృతసత్యము నందు నమ్మకము, తన సేవ యొక్క నీతి కలిగి తనను నమ్ము విశ్వాసులు సంయుక్తముగా ముందుకు సాగవలెనని ఆయన ఆనతిచ్చుచున్నాడు. CChTel 529.2

    ప్రతినూతన భావమును ఎదుర్కొనుటకు బలము నిచ్చుటకు దేవుడు మనతోనున్నాడని జ్ఞాపకముంచుకొని బండవలె మనము దైన వ్యా సూత్రములయందు బలముగా నిలువవలెను. దైవ నామమందు అత్యధిక బలముతో ముందుకు సాగి పోవుటకు గాను నీతి సూత్రములను మన జీవితములయందు అవలంబింతము. మన ప్రారంభ దశనుండి యిప్పటివరకు దైవాత్మ యొక్క ఉపదేశము, అనుమతిద్వారా బలపర్చబడిన విశ్వాసమును మనము పతిత్రముగ కాపాడవలెను. తన ధర్మశాస్రము కాపాడు ప్రజలద్వారా ప్రభువు సాగించుచున్న పని అతి ప్రశస్తమైనదని మనము పరిగణించవలెను. ఇది ఆయన కృపా శక్తివలన కాలము గడుచుకొలది బలపడి వృద్దిచెందును. దైవ ప్రజల అవగాహనము మభ్యపరచి వారి సామర్ధ్యమును బలమీనము చేయుటకు శత్రువు ప్రయాసపడు చున్నాడు. కాని వారు దేవుని యాత్మ నడుపుదలచొప్పున పని చేసినచో ప్రాచీన శిధిల స్ధలములను కట్టటకు ఆయన వారికి తరుణమును మార్గమును అనుగ్రహించును. తన యందు విశ్వాసముంచిన వారిపై తన అంతిమ జయసూచకమైన ముద్రవేయుకు ప్రభువు శక్తి తోను మహిమతోను దిగివచ్చు వరకు వారి యనుభూతి నిత్యము పెరుగు చుండును. CChTel 529.3

    మనముందున్న కార్య నిర్వహణకు మానవుని సర్వశక్తులు అవసరము. దీనికి బలమైన విశ్వాసము, మెళుకవ అవసరము. కొన్నిసార్లు మన మెదుర్కొనవలసిన కష్టములు మనకు నిస్పృహ కలిగించును. ఆ ఆకార్య మహాత్యము మనకు భయము పుట్టించును. అయినను దైవసహాయము వలన ఆయన సేవకులు జయము పొందెదరు. మీ ముందున్న కష్టములవలన నా సహోదరులారా “మీరు అదైర్యపడవద్దని వేడుకొను చున్నాను.” ( ఎఫెసి 3:13) యేసు మీతో నుండును. తన పరిశుద్దాత్మ వలన మీ మార్గమును సిద్దము చేయుచు మీ ముందు నడుచును. ప్రతి అక్కర యందును ఆయన మీకు సహాయుడై యుండును. CChTel 530.1

    “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటెను అత్యధికరము చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తర తరములు సదాకాలము మహిమ కలుగుచు గాక. ఆమెన్.” ఎఫెసి 3:20-21. 33TT 439-441;CChTel 530.2

    ఇటీవలన రాత్రి వేళ కనబడిన దృశ్యములు నాకు గంభీర ఉద్దేశ్యములను, కలిగించినవి. ఒక గొప్ప ఉద్యమము అనగా ఉజ్జీవ కృషి. అనేక స్ధలములలో పురోగమించు చున్నట్లు ఆగపడెను. దేవుని పిలుపుకు ప్రత్యుత్తరముగా మన ప్రజలు వరసలో చేరుచున్నారు. నా సహోదరులారా, ప్రభువు మనతో మాటలాడు చున్నాడు. ఆయన స్వరము నాలకించవద్దా మనదివిటీలను వెలిగించుకొని తమ ప్రభువు రాకకొరకు ఎదురు చూచువారివలె ప్రవర్తించవద్దా వెలుగును మోయుచు కార్య సాధన చేయుడని కాలము హెచ్చరించుచున్నది. CChTel 530.3

    “కాబట్టి మీరు సమాధానమును బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొనుటయందు శ్రద్ద కలిగిన వారౌ ప్రేమతో ఒకని నొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని.. . బతిమాలు కొనుచున్నాడు.” ఎఫెసి 4:1-3. 43TT 441,442;CChTel 530.4