Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఇతోధిక దైవమార్గదర్శకత్వము తల్లిదండ్రుల కవసరము

    మీ బిడ్డల సక్రమ శిక్షణను మీరు అలక్ష్యము చేయుట వలన మీకు శిక్షానిధి తప్పదు. మీరు చూపిన అపనమ్మకమును వారి శీలదౌర్బల్యములు వెల్లడి చేయును. సవరించకుండా పోనిచ్చిన మట్టు మరియాదలు లేని ప్రవర్తన, అమర్యాద, అవిధేయత, సోమరితనము, అజాగ్రత్త మున్నగు అలవాటులు మీకు అపకీర్తి ఘటించి తీరని విచారము కలిగించును. మీ బిడ్డల భవిష్యత్తు చాల మట్టుకు మీ వశమందే యున్నది. మీరు మీధర్మములను నెరవేర్చకయున్నచో వారిని మీరు శత్రువశము చేసి తద్వారా వారు ఇతరులను పాడు చేయుటకు కారకులగుదురు. అట్లుగాక మీరు వారికి నమ్మకముగా హితవుచేసి మీ జీవితముల ద్వారా భక్తియుతమయిన ఆదర్శమును చూపినచో మీరు వారిని క్రీస్తు వద్దకు నడుపవచ్చును. అప్పుడు వారు ఇతరులకు మంచి ఆదర్శము చూపెదరు. ఇట్లు మీ ద్వారా అనేకులు రక్షించబడవచ్చును. 317T 66;CChTel 379.1

    మనము మన బిడ్డల యెడల నిరాడంబరముగా ప్రవర్తించవలెనని, దేవుడు కోరుచున్నాడు. పెద్ద వారి వలె పిల్లలకు అనేక వత్సరముల తర్భీతు లేదనుసంగతి మనము మరతుము. ప్రతి విషయమందును పిల్లలు మన ఉద్దేశానుసారము వర్తించకున్నచో వారికి మందలింపు అవసరమని కొన్ని సార్లు అభిప్రాయపడెదము. కాని యిది విషయములను చక్కచేయజాలదు. వారిని రక్షకుని వద్దకు తీసుకొని పోయి విషయమంతయు ఆయన కెరుకపరచుడి. ఆ మీదట ఆయన దీవెన వారి మీద ఉండునని నమ్ముడి. 32CG 287;CChTel 379.2

    ప్రార్థన సమయమును గౌరవించునట్లు పిల్లలకు శిక్షణ నీయుడి. పనికి వెళ్లక ముందు కుటుంబమును ఒక చోట గుమిగూర్చి తండ్రి గాని తండ్రి లేనపుడు తల్లిగాని వారిని దినమంతయు కాపాడుమని పట్టుదలతో దేవుని వేడవలెను. దయా పూరిత హృదయంతోను, మీ ముందును మీ బిడ్డల ముందును ఉన్న శోధకులను గుర్తించిన హృదయముతోను వినయముగా సమావేశము కావలెను. విశ్వాసము ద్వారా వారిని బలిపీఠముపై నుండి ప్రభుని కాపుదల కొరకు ప్రార్థించుడి. ఇట్లు దేవునికి సమర్పించబడు పిల్లలకు పరిచర్యచేయు దూతలు కపాడెదరు. ఉదయము, సాయంకాము తమ బిడ్డల చుట్టు ప్రార్థన ద్వారాను, విశ్వాసము ద్వారాను కంచె వేయుట క్రైస్తవ తల్లిదండ్రుల విద్యుక్త ధర్మము. దేవుని సంతోషపరచుట యెట్లో దయతోను ఓరిమితోను వారు ఉపదేశించవలెను. 33IT 397, 398;CChTel 379.3

    అనుదినము పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట ఒక ఆధిక్యతయని మీ పిల్లలకు నేర్పించుడి. తన యేర్పాటులను కొనసాగించుటలో క్రీస్తుకు తోడ్పడుడి. మీ బిడ్డలకు మీరు చేయు సేవను ఫలవంతము చేయగల అనుభవమును మీరు ప్రార్థన ద్వారా పొందవచ్చును. 34CT 131;CChTel 380.1

    తల్లి యొక్క ప్రార్థన ప్రాభావము మన జ్ఞానమునకు మించినది. బాల్య దశలో కలుగు మార్పులయందు, యౌవనమున కలుగు అపాయముల యందు కుమారుడు, కుమార్తె ప్రక్క మోకరించి ప్రార్థించు తల్లి ప్రార్థనల ప్రభావము న్యాయవిమర్శ దినమందే బయలుపడును. దేవ కుమారునితో విశ్వాసముద్వారా జతపర్చబడినచో శోధనకు లొంగకుండా తల్లి తన కుమారుని అదుపుచేయగలదు. పాపము చేయకుండ తన కుమార్తెను వారించగలదు. శరీరాశలు ఆధిపత్యము చేయుటకు ప్రయత్నించినప్పుడు ప్రేమ యొక్క శక్తి అదుపు చేయు, పట్టుదల గల నిష్కర్షయై న మాతృప్రభావము ఆత్మను సత్యము వైపునకు మొగ్గునట్లు చేయును. 35AH 266;CChTel 380.2

    మీ బిడ్డల పట్ల మీ ధర్మమును నమ్మకముగా నిర్వర్తించిన పిమ్మట వారిని దేవుని కడకు కొనిపోయి మీకు సాయము చేయమని ఆయనను కోరుడి. మీ భాగమును మీరు నిర్వహించితిరనియు, మీరు చేయశక్యముకాని ఆయన భాగమును ఆయనచే నిర్వహించవలెననియు విశ్వాసముతో దేవుని అడుగుడి. వారి మనః ప్రవృత్తులను తీర్చుదిద్దుమనియు పరిశుద్దాత్మవలన వారిని నమ్రత, సాధుత్వము గల బిడ్డలుగా చేయుమనియు ఆయనను అభ్యర్థించుడి. మీ ప్రార్థన నాయన ఆలకించును. మీ ప్రార్థనకు ప్రతి ఫలమిచ్చుట కాయన ముచ్చటపడును. మీరు మీ బిడ్డలను క్రమపర్చవలెననియు వారు ఏడ్చినను శిక్షించుట మానవద్దనియు దేవుడు తన వాక్యముద్వారా మీకుపదేశిమిచ్చుచున్నాడు. ఈ విషయములలో ఆయన వాక్యమును అనుసరించవలెను. 36CG 256, 257;CChTel 380.3