Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వివాహ సంకల్పము గలవారికి హెచ్చరికలు

    యౌవనస్తులు పూర్తిగా ఉద్రేకమునకు దాసులై యుండరాదు. అతి సులభముగా వశులగుట గాని, ప్రియుని బాహ్యాకర్షణలకు సునాయాసముగా లొంగుటగాని వాంఛనీయము కాదు. వరించుట యనునది ఈ యుగమునందు వేషధారణ, మోసముల పన్నాగముగా యున్నది. ఇది ఎక్కువగా ఆత్మలకు విరోధియగు అపవాది సంబంధమైనది. ఈ విషయమందు అనేకులు వివేచనా శూన్యులైనందున, కుశాగ్రబుద్ధి అవసరము. CChTel 259.5

    ఊహాగానమును, మన్మధోద్రేకములు గల ఉద్దేశములను, కుష్టురోగమువలె పరిగణించి వీనిని హృదయమున చొరనీయకుండ జాగ్రత్తగా నుండవలెను. ఈ యుగమందలి అనేక యువకులలోను యువతులలోను సద్గుణములు కొరవడి యున్నవి. అందుచే హెచ్చరిక అగత్యమయ్యెను. పవిత్ర శీలమును సాధించుకొన్నవారు ఇతర సలక్షణములను కలిగి యుండకపోయినను నైతికముగా యోగ్యులనవచ్చును. CChTel 260.1

    మతానుభవముతో మిళితమైన యీ నీచాభిప్రాయము నేటి ప్రపంచమందలి యువజనులలో నెక్కువగా నున్నది. నా సహోదరీ, నీవు మార్పుచెందవలెనని దేవుడు కోరుచున్నాడు. నీ ప్రేమను సమున్నత పరుచుకొమ్మని నిన్ను బ్రతిమాలుచున్నాను. నిన్ను కొనియున్న రక్షకుని సేవకొరకు నీ మానసిక, భౌతిక శక్తులను వినియోగించుము. పవిత్రాలతోచనలు చిత్తవృత్తులు కలిగి సకల కార్యములను దేవునియందే చేయుము. CChTel 260.2

    రాత్రియందెక్కువ భాగమును ప్రేమ కలాపముకై వెచ్చించువారు సాతాను దూతల ప్రభావమునకు ఎక్కువ లోనైయున్నారు. తమ ఆధ్యాత్మిక నేత్రములు తెరువబడి యున్నచో తమ మాటలను క్రియలను గ్రంథములలో దాఖలు చేయుచున్న దేవదూతను వారు చూడగలరు. ఆరోగ్యము, మర్యాదలకు సంబంధించిన నిబంధనలు అతిక్రమించబడుచున్నవి. వివాహమునకు పూర్వము జరుగుచున్న ప్రేమ చేష్టలు వివాహమైన పిదప జరుగుట సమంజసము. కాని సర్వసాధారణముగా మరులు కొన్ని దినములలో చూపబడిన ఆసక్తి వివాహముతో అంతరించుచున్నది. CChTel 260.3

    ఎవరితోనెట్లు వ్యవహిరించవలెనో సాతానుడెరుగును. ఆత్మలను మోసగించి నాశనము చేయుటకాయాయి పద్ధతులను ఉపయోగించుటలో నాతడు తన వివేకమును కనపరచును. ప్రతి ఘట్టమును పరిశీలించి అనేక యోచనలను చెప్పును. తరచు దైవ వాక్యమునకు ప్రతిగా సాతాను చెప్పు ఈ సలహాలు అనుసరించబడుచున్నవి. చక్కని అల్లికలు గల అపాయకరమైన యీ వల అజాగ్రత్తగా నున్న యువజనులను చిక్కులలో పెట్టుటకే నైపుణ్యముగా తయారు చేయబడినది. తరచు ఇది వెలుగు ముసుగును మారువేషముగా ధరించును. దానికి గురిjైున వారు అనేక విచారములతో చిక్కుకొనెదరు. దీని పర్యవసానముగా ఎక్కడ చూచినను విచ్చిన్న కుటుంబములే అగపడును. CChTel 260.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents