Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యయము 34 - క్రైస్తవగృహము

    గృహమును ఏర్పర్చుకొనుటలో ప్రప్రధముగా మనలను మనకుటుంబములను ఆవరించనున్న నైతిక మాట విషయిక ప్రభావమును గూర్చి పరిగణించవలెనని దేవుడు కోరుచున్నాడు. ఈ లక్షణములను మనస్సునందుచుకొని నూతన నివాసమునకు స్థలమునెన్నుకొనవలెను. ధనసంపాదనా శక్తికిగాని శరిరాశలకుగాని ,సంఘాచారములకు గాని లోను కాకూడదు. సరళతాకు ,పవిత్రతకు ,ఆరోగ్యమునకు నిజమైన యోగ్యతకు అనువగు స్థలమునే ఎన్నుకొనిడి. CChTel 302.1

    మానవాకార్యములే కనబడుచోట,చెడ్డ తలంపులను పుట్టించు దృశ్యములు సంగీతము వుండు చోట ,బడలిక అశాంతికి హేతు భుతలమగు గలిబిలి కోలాహలమున్నచోట నివశించుటకన్న దైవదృష్టి కాన్పించి స్థలమును ఎన్నుకొనిడి. ప్రకృతి సౌందర్యమునందు ,ప్రశాంత వాతావరణమందు ప్రాణమునకు విశ్రాంతి చెకూర్చుడి. CChTel 302.2

    పచ్చని పంట పొలములపైని ,చెట్లతోపులపైని ,గిరులపైని మీ దృష్టి నిసారించుడి. నగరపు దుమారము పొగ అంటని నీలి ఆకాశము వైపుకు కన్నులెత్తి బలప్రదాయకమైన పరలోకవాయువును పీల్చుడి. CChTel 302.3

    దేవుడు మార్గము తెరచు సమయమువచ్చినది కుటుంబములను నగరములను విడిచి పెట్టవలెను. పిల్లలను గ్రామీణ ప్రదేశములకు తోడుకొని పోవలెను. తల్లిదండ్రులకు తమ ఆర్ధిక స్తోమతకు తగిన స్థలమును సంపాదించుకోన వలెను. ఇల్లు చిన్నదైనను దాని వెనుక సేద్యముచేయ వీలున్న పెరడు ఉండవలెను. CChTel 302.4

    మంచి గృహము కొంత పొలముగల తల్లి దండ్రులు రాజులను రాణిలును అయియున్నరు. CChTel 302.5

    సాధ్యమైనంతమట్టుకు గృహము నగరము వెలపల నుండిన బాగుండును. అక్కడ పిల్లలు సేద్యము చేయుటకు స్థలముండవలెను. ఒక్కొక పిల్లవానికి కొంత స్థలము కేటాయింపుగా నుండవలెను. తోట వేయుటను గూర్చియు విత్తనములు విత్తుటకు నేలను సిద్ధముచేయుటను గూర్చియు కలుపు మొక్కలను పెరికివేయ వలసిన ఆవశ్యకతను గూర్చియు ,వారికి నేర్పును దానితో పాటు అసహ్యమైన,హానికరమైన అలవాటులను వర్జించుట చాల ప్రాముఖ్యమని వారికి నేర్పించుడి. వారు తమతోటయందలి కలుపు మొక్కలనేట్లు పెరికి పారవేయుదురో అట్లే దురభ్యాసములను విసర్జించుట వారికి నేర్పుడి. ఈ గుణపాఠములను నేర్పుటకు సమయము పట్టును. అయినను ఇది చాల లాభదాయకము. CChTel 302.6

    ధైర్యము ,చిత్తము ,పట్టుదల కలిగి కృషిచేయు వారికి భుగర్బములొ గొప్ప దీవెనలు దాచబడి యున్నవి. చాలామంది కర్షకులు తమ భుములనుండి ఎక్కువ లాభము రాకపోవుటకు కారణమేమనగా పని నీచమైనదిగా వారు ఎంచుటయే. దానియందు తమ కుటుంబ సభికులకు దీవెనలున్నవని వారు గ్రహించరు. CChTel 303.1

    తాము నమ్ము సత్యమునకు తగినట్లుగా తల్లిదండ్రులు తమ గృహవరణములను ఉంచుకొన బద్దులైయున్నారు. అప్పుడు వారు తమ బిడ్డలకు నిర్దుష్ట పాఠములను నేర్పగలరు. బిడ్డల తమ భూలోక గృహమును బట్టి పరలోక గృహమునకు గూర్చి గ్రహింతురు. సాధ్యమైనంతవరకు ఇక్కడి కుటుంబము పరలోక మందలి కుటుంబమునకు ఒక నమూనా అయి యుండవలెను. అప్పుడు నీచ కార్యములు చేయుటకు కలుగు శోధనలు శక్తి హినములగును. ఇక్కడ తాము తాత్కాలిక వాసులనియు ,ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనువారి కొరకు క్రీస్తు సిద్దము చేయు చున్న భవనముల యందు నివసించుటకు వారు శిక్షణ పొందుచున్నారనియు పిల్లలు నేర్పబడవలెను. ఇది తల్లి దండ్రులు నిర్వహించవలసిని గురుతర బాధ్యత. CChTel 303.2

    మానవ నివాసముకై వుద్దేశించబడు భవనములు ఎత్తైన మురిగి నీటి పారుదల గల శాలమున నిర్మించబడవలెను. ఇట్లు చేసినచో స్థలము పొడిగా ఉండును. తరుచు ఈ విషయములు చులకనగా భావించబడు చున్నవి. తేమగా నుండి పల్లమై మురికి నీటి పారుదలలేని స్థలములయందుండు మలేరియా ఫలితముగా నిత్య అనారోగ్యము ప్రాణాంతక రోగములు అనేక రకములు సంభవించు చున్నవి. CChTel 303.3

    గృహములకు నిర్మించునపుడు వాయు సంచారము సూర్యరశ్మి ధారాళముగా నుండునట్లు ఏర్పాట్లు చేయుట ప్రాముఖ్యము. గృహమునందలి అన్ని గదులలోను చక్కని గాలి ఎక్కువ వెలుతురు ఉండవలెను. దివారాత్రములు ఎక్కువ గాలి ఉండునట్లు పడకగదులను నిర్మించవలెను. దినదినము వెలుతురు సూర్యరశ్మి వచ్చుటకు గాను పూర్తిగా తెరువబడజాలని ఏగదియు పడక గదిగ నుండజాలదు. CChTel 303.4

    ఇంటికి తగినంత దూరములో చెట్లతోటను పూలమొక్కలతోను అలంకరించబడిన పెరడు కుటుంబ శ్రేయస్సుకు దోహదము చేయును. దానిని బాగుగా పెంచినచో అది ఆరోగ్యమునకు తోడ్పడును. కాని ఇంటి చుట్టును నీడ నిచ్చు వృక్షములు పూలమొక్కలు దగ్గర దగ్గరగా ఉండుట మంచిది కాదు. కారణమేమనగా అవి గాలిని సూర్యరశ్మిని అడ్డగించును. తత్ఫలితముగా ఇల్లు తేమగా నుండును. ముఖ్యముగా వర్షాకాలమున నిట్టి పరిస్థితి ఏర్పడును. CChTel 304.1