Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సందేహము కలిగించుటయే సాతాను లక్ష్యము

    అనేక సందర్భములలో సాక్ష్యములు పూర్తిగా అంగీకరింపబడు చున్నవి. వీని పర్యవసానముగా పాపము, పాపకార్యములు విసర్జింపబడుట దేవుడను గ్రహించిన వెలుగు ప్రకారము తక్షణమే చిత్త సంస్కారము ప్రారంభమగుట జరుగుచున్నది. కొన్ని సందర్భములలో పాపకార్యములు ప్రియముగా పెంచబడుచున్నవి. సాక్ష్యములు నిరాకరింపబడుచున్నవి. సాక్ష్యము లను విసర్జించుటకు కారణముగా అనేక అబద్దపు సాకులు సంధింపబడుచున్నవి. యధార్ధమైన కారణము చూపబడుటలేదు. హానికరమైన అలవాటులను విసర్జించుటకు దైవాత్మచే బలపర్చబడి అదుపు చేయబడు సాహస చ్తిము వారికి లేకపోవుటే దీనికి యధార్ధమగుకారణము. CChTel 207.4

    సందేహములను కలిగించుటకును, దేవుడు పంపు సూటియగు సాక్ష్యములను ప్రతిఘటించుటకు మార్గములను యోచించుటకును, సైతానుడు సామర్ధ్యము కలవాడే. అనేకులు అవిశ్వాసము కలిగి ప్రశ్నలు వేయుచు శ్లేషార్థములతోమాటలాడుట తమకు గల చతురత విజ్ఞతలకు సూచనయని భావింతురు. సదేహించగోరువారికి అవకాశములు చాలకలవు. అవిశ్వాసమునకు గల అవకాశము లన్నిటిని దేవుడు తొలగింపడు. ఆయన నిదర్శనముల నిచ్చును. అవి వినయమనస్సుతోను, బోధకులొంగు ఆత్మతోను పరిశీలింప వలెను. నిదర్శన బలముపై ఆనుకొని ఎల్లరును బలమైన సాక్ష్యమని తీర్మానించుకొనవలెను. నమ్ముటకు యథార్థ మనస్కునికి చాలినంత నిదర్శనమును దేవుడనుగ్రహించును. కాని తమ పరిమిత జ్ఞానమునకు అందలి కొన్ని విషయములుండుట వలన నిదర్శనమును లక్ష్యపెట్టని వారు అపనమ్మకము, వేదించు సందేహము అను చలిగాలిలో విడువబడుదురు. వారి విశ్వాసమును ఓడ బ్రద్దలగును. CChTel 208.1

    సాక్ష్యముల యందు దైవజనుల విశ్వాసమును బలహీనము చేయుటయే సైతాను సంకల్పము. ముట్టడి చేయు విధానము సాతానుకు ఎరుకయే. మనస్సులలో పనిచేసి నాయకుల యెడల అసూను అసంతృప్తిని రేకెత్తించును. పిదప వరములను గూర్చిన సందేహమును లేవదీయును. అప్పుడు సహజముగా సాక్ష్యముల యందు అవిశ్వాసము హెచ్చరిల్లును. దర్శనముద్వారా అనుగ్రహింపబడిన ఉపదేశము అలక్ష్యము చేయబడును. ఆ మీదట మన స్థితికి స్థంభములైన విశ్వాస మూలసూత్రముల విషయము అపనమ్మకము జనించును. మనము పరిశుద్ధ లేఖనములను శంకంతుము. ఆ మీదట నాశన మార్గము గుండా మనము పురోగమింతుము. ఒకప్పుడు విశ్వసించిన సాక్ష్యములను శంకించి విసర్జించినచో మోసగించబడి, వారు అంతటితో ఆగరని సాతానుకు అవగతమే. వారు బాహాటముగా తిరుగుబాటు చేయువరకు వారిని ప్రోత్సహించుటకు సాతానుడు రెట్టింపు శ్రమ పడును. ఈ తిరుగు బాటు మాన్పరానిదై సర్వనాశనముతో అంతమొందును. దైవవాక్యము విషయము సందియమునకు, అవిబూవ్వసమునకు ఎడమిచ్చుట వలన, అపనమ్మకము, అసూయలను గూర్చి చింతన చేయుట వలన వారు తమ్మునుతాము సంపూర్ణ వంచనకు సిద్ధము చేసుకొనుచున్నవారగుదురు. తమ తప్పిదములను,పాపములను విమర్శించువారిపైకి ద్వేష స్వభావముతో లేచెదరు. CChTel 208.2

    సాక్ష్యములను బాహాటముగా విసర్జించువారు లేక వానిని శంకించువారు మాత్రమే అపాయకరమైన స్థితియందున్నవారు కారు, అలక్ష్యము చేయుట వాటిని విసర్జించుటయే. CChTel 209.1

    సాక్ష్యములయందు మీకు నమ్మిక లేకున్నచో బైబిలు సత్యములనుండి మీరు తొలగిపోవుట తథ్యము. అనేకులు ప్రశ్నించుచు శంకించుచున్న స్థితియందున్నారని భయపడుచు మీ యాత్మలను గూర్చిన విచారము కొలది నేను మిమ్మును హెచ్ఛరించుచున్నాను. ఎంత మంది యీ హెచ్చరిక నాలకింతురు? 65T 672-680;CChTel 209.2