Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నిజ ప్రవక్త యొక్క సార్థక పరీక్షలు

    ఈ నాలుగు ప్రధాన బైబిలు పరీక్షలే గాక ఆమె పని తన నడుపుదల క్రింద సాగినదే యని స్పష్టపరచుటకు ప్రభువు కొన్ని నిదర్శనములను ఇచ్చెను. వీనిలో కొన్ని ఈ దిగువనీయబడినవి. CChTel 48.4

    1. వర్తమానము యొక్క సమయౌచిత్యము. దైవ ప్రజలు ఒక ప్రత్యేక అవసరతయందున్నారు. ఆ యక్కర తీర్చుటకు వర్తమానము ఉచిత సమయమునకు వచ్చును. శ్రీమతి వైటమ్మగారికీయబడిన ప్రథమ దర్శనము ఇట్టిదే. CChTel 49.1

    2. వర్తమానములయొక్క ఆచరణీయ స్వభావము, దర్శనములలో శ్రీమతి వైటమ్మగారికీయబడిన సమాచారము ప్రయోగాత్మకమైన విలువగలదై గొప్ప అవసరతలను తీర్చినది. మన దైనందిక జీవితములలో సాక్షోపదేశములు ప్రవేశించుచున్న విధమును చూడుడి. CChTel 49.2

    3. వర్తమానముల ఉన్నత ఆధ్యాత్మిక స్థాయి. సామాన్య పసితనపు చేష్టలతో కూడిన విషయములనవి వ్యక్తము చేయక, ఉత్కృష్టము, సమున్నతమలునైన అంశములనవి విశదము చేయుచున్నవి. అందలి భాష గంభీరమైనది. CChTel 49.3

    4. దర్శనములీయబడిన విధము. ఈ గ్రంథారంభ అధ్యాయములలో వ్యక్తము చేయబడిన రీతిగా ఈ దర్శనములలో నెక్కువ భాగము భౌతిక ప్రదర్శనములతో కూడినవి. దర్శనమందు వైటమ్మగారి అనుభూతి బైబిలు ప్రవక్తల అనుభూతితో సమానమైనది. ఇది ఒక పరీక్ష కాకపోయినను ఇతర నిదర్శనములలో నొకటియై యున్నది. CChTel 49.4

    5. దర్శనములు కచ్చితమైన యనుభవములేగాని ఉద్దేశ్యములు కావు. దర్శనమందు శ్రీమతి వైటమ్మగారు దూతలద్వారా ఇయ్యబడిన ఉపదేశమును చూచి, విని, అనుభవించి, స్వీకరించిరి. ఈ దర్శనములు సంభ్రమము వలన గాని ఊహాగానము వలనగాని కలిగినవి కావు. CChTel 49.5

    6. తన చుట్టు నున్న వారి యిష్టము ననుసరించి వైటమ్మగారు వ్యవహరించలేదు. ఒక వ్యక్తి కామె ఇట్లు వ్రాసినది: “వ్యక్తులు నా మనస్సు మార్చిరని మీరు తలంచుచున్నారు. నేనిట్టి స్థితియందున్నచో దైవ సేవ చేయుటకు నేను అనర్హురాలను.”CChTel 49.6

    7. తన సమకాలికులామె పనిని గుర్తించిరి. ఆమె సమకాలీనులై తమతో కలిసి పనిచేసిన సంఘ సభ్యులు, సంఘమునకు చెందనివారు శ్రీమతి వైటమ్మగారిని “దైవ రాయబారిణి”గా గుర్తించిరి. ఆమెతో మిక్కిలి సాన్నిహిత్యము కలిగియుండినవారు ఆమె పనియందు పిలుపునందు ఎక్కువ నమ్మకము కలిగియుండిరి. CChTel 49.7

    రాయబారియందును రాయబారమునందును తన ప్రజలు నమ్మకము కలిగియుండు టకుగాను దేవుడొసగిన యీ నాలుగు బైబిలు పరీక్షలు వైటమ్మగారి సేవ దైవసంబంధమైనదై పూర్ణ విశ్వాసమునకు పాత్రమైనదని బుజువుచేయుచున్నవి. CChTel 49.8

    ఇ. జి. వైటమ్మగారి బహు గ్రంథములు సంఘము కొరకు శాశ్వతమైన విలువగల ఉపదేశముతో నిండియున్నవి. ఈ సాక్ష్యములు సార్వజనిక స్వభావము కలవియైనను, కుటుంబములకు, వ్యక్తులకు వ్యక్తిగతముగా నీయబడిన సాక్ష్యములైనను, అవి నేడు మనకు ఉపయోగకరములే. ఈ విషయముగూర్చి శ్రీమతి వైటమ్మగారిట్లు నడుపుచున్నారు:CChTel 50.1

    “వై యుక్తిక సందర్భములలో సాక్ష్యములద్వారా ఇయ్యబడిన హెచ్చరికలు ఉపదేశములు ప్రత్యేకించి పేర్కొనబడని అనేక ఇతర వ్యక్తులకు కూడ సమానబలముతో అన్వయించునుగాన సంఘము యొక్క క్షేమము కొరకు ఈ వ్యక్తి గత సాక్ష్యములను ప్రచురించుట నా బాధ్యతగా తోచినది.. . సామాన్యమైన అపాయములను, దోషములను, దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను కాపాడువారి బాధ్యతను గూర్చి నా దృక్పథములను ఎరుకపరచు తెరవు సాక్ష్యములద్వారాకన్న వేరొకటి తోపకున్నది.”CChTel 50.2

    ఒక సహోదరుని విమర్శించుటకు ఆధారము కనుగొనవలెనను ఉద్దేశ్యముతో సాక్ష్యములను చదువుట వానిని దుర్వినియోగము చేయుట యగును. మన దృక్పథములతోనేకీభవించునట్లు ఒక సహోదరునిగాని సహోదరినిగాని కూడకట్టు ఉపకరణముగా సాక్ష్యములు వినియోగించబడ వీలులేదు. ఒక వ్యక్తి కేవలము దేవునితోనే పరిష్కరించుకొనవలసిన విషయములు కలవు. CChTel 50.3

    నేడు మన జీవితములకు అన్వయించు ప్రాతిపదిక సూత్రములను కనుగొనుటకు ఈ ఉపదేశములు పఠించబడవలెను. ఈ వర్తమానములలో కొన్ని నిర్దిష్టస్థలమునకు, కాలమునకు ఉద్దేశించబడిన హెచ్చరికలుగనో గద్దింపులుగనో యియ్యబడినవి. అయినను అందలి సూత్రములు సార్వత్రికములై సమయోచితములుగ నున్నవి. లోకమందెల్లెడల మానవ హృదయము ఒకే విధముగా నుండును. ఒకరి సమస్యలు ప్రాయికముగా నితరుల సమస్యలై యుండుట కద్దు. “ఒకనిని అతని తప్పుల విషయము గద్దించుటద్వారా అనేకులను సరిదిద్దుట దైవ సంకల్పము” అని వైటమ్మగారు వ్రాసిరి. “ఇతరులకు హెచ్చరిక కలుగునట్లు ఆయన కొందరి తప్పిద ములను బహిర్గత మొనర్చును.”CChTel 50.4

    వైటమ్మగారు తన మరణమునకు ముందు ఈ హెచ్చరిక చేసిరి:CChTel 50.5

    “పరిశుద్ధాత్మద్వారాను, సర్వదా హెచ్చరికలద్వారాను, ఉపదేశముద్వారాను దేవుని స్వరము మనకడకు వచ్చినది.. . సమయము, వ్యక్తులకు వచ్చు పరీక్షలు వేర్వేరుగా నున్నను ఇయ్యబడిన ఉపదేశమునవి నిరర్థకము చేయలేదు.. .. ఈ వర్తమానము ఆరంభదశలో ననుగ్రహించబడిన ఉపదేశము ఈ వర్తమానపు అంత్యదిన ముందుకూడ క్షేమకరమైన ఉపదేశముగ పరిగణించబడవలసి యున్నది.” ఈ గ్రంథమందలి యుపదేశములు ఇ. జి. వైటమ్మగారి బహు గ్రంథముల నుండి సేకరించబడినవి ` ముఖ్యముగా నివి “టెస్టిమొని ట్రెజర్సు” అను మూడు సంపుటముల నుండి సేకరించబడినవి. “టెస్టిమోనీస్‌ ఫర్‌ ది చర్చి” ప్రపంచ ప్రచురణయై వెలసినది. సంఘసభ్యులు తక్కువగా నుండుటచే ఒకటికన్న ఎక్కువ సంపుటములు ప్రచురించుట సాధ్యపడని స్థలములందలి సంఘములకు ఎక్కువ ఉపయోగకరమని తలంచబడిన ఉపదేశములే యీ గ్రంథమున గలవు. ఈ ఉపదేశములను ఎంచి కూర్చు పనిని ఒక పెద్ద కమిటీ నిర్వహించినది. ఈ కార్యమును ఈ కమిటీ ఎలెన్‌ జి. వైట్‌ ప్రచురణల ధర్మకర్తృత్వ సంఘమువారి అనుమతిని నిర్వహించినది. ఎలెన్‌ జి. వైట్‌ ధర్మకర్తృత్వ సంఘముపై ప్రవచన సార ప్రచురణల భధ్రత, వాని యభివృద్ధి ఇత్యాది బాధ్యతలు పెట్టబడినవి. కొన్ని విషయములు సంక్షిప్తమై ఆచరనీయమైన ప్రాతిపదిక సూత్రముల మేరకే కూర్చబడినవి. ఇట్లు వివిధాంశములను పొందుపరచితిమి. CChTel 50.6

    “మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతార్థులగుదురు.” 2 దినవృత్తాంతములు 20:20. CChTel 51.1

    —ఎలెన్‌ జి. వైట్‌ ప్రచురణల ధర్మకర్తృత్వ సంఘము. CChTel 51.2

    వాషింగ్టన్‌, డి. సి.
    జూలై 22, 1957.
    CChTel 51.3