Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సృష్టిని దేవునిగా చేయుటకు సాతానుని సంకల్పము

    పదార్థ సిద్ధాతములను, ప్రకృతి నిబంధనలను గూర్చి నిత్యము తలంచు ననేకులు దేవుని నిత్య ప్రత్యక్ష సాధనమును ఉపేక్షించిన యెడల దేవుని మరచెదరు. దైవ సహాయము లేకుండగనే సృష్టి పరిమితమైన తన శక్తితో తనంతట తానే పనిచేయ గలదను అభిప్రాయమున వారు (ప్రజలు) వెలిబుచ్చెదరు. ప్రకృతికిని దేవునికిని సంబంధము లేదని వారు తలంచెదరు. సృష్టి స్వాభావిక కారణము వలన కలిగెననియు దానితో దైవశక్తికి సంబంధము లేదని వారు అనెదరు. జీవ శక్తి పదార్థ సంబంధమైనదరి చెప్పి ప్రకృతిని దేవుడని పరిగ ణింతురు. పదార్థము కొన్ని సంబంధములలో నమర్చబడినదనియు అది కొన్ని నిబంధనల ననుసరించి పని చేయునని ఈ నిబంధనలతో దేవుడు జోక్యము కలిగించుకొన లేదనియు వారు తలంతురు. ప్రకృతికి కొన్ని శక్తులను గ్రహించబడినవనియు, అది కొన్ని నియమములకు సంబంధించబడి ఆ మీదట ఈ నియమముల ననుసరించి ఆదిలో సంకల్పించిన కార్యమును చేయుటకు విడువబడినదనియు వారు తలంతురు. CChTel 482.4

    ఇది తప్పుడు శాస్త్రము. దీనిని బలపర్చుటకు దైవ వాక్యమందేమియు ఆధారము లేదు. దేవుడు తన చట్టములను రద్దు చేయడు. కాని వానిని ఉపకరణములుగా నుపయోగించుచు ఆయన సర్వదా పని చేయుచున్నాడు. దేవుని ప్రకృతి నిబంధనల తమట పనిచేయజాలవు. సృష్టిలో దేవుడు నిత్మఉ పనిచేయుచున్నాడు. ప్రకృతి ఆయన చిత్త ప్రకారము తన హస్త కృత్యముల యదు చరించునని సాక్ష్యమిచ్చుచున్నది. ప్రతి సంవత్సరము పుష్కలముగా ఫలసాయము నిచ్చుచు సూర్యునిచుట్టు తన భ్రమణమును సాగించునట్లు భూమికి తోడ్పడునది సృష్టిలో స్వతస్సిద్దముగా నున్న శక్తి కాదు. అనంతుడగు దేవుని హస్తము ఈ గృహమును నిత్యము నడుపుచున్నది. భూమి తన చుట్టు తాను తిరుగునపుడు తన స్థలమును తప్పకుండా చేయునది క్షణ క్షణము ప్రదర్శితమగు దైవ శక్తియే. CChTel 483.1

    మానవ శరీర నిర్మాణము క్రియను సంపూర్ణముగా గ్రహింపజాలము. దాని మర్మములు మేధావుల కచోచరములు. నాడి కొట్టుకొనుట శ్వాస క్రియ జరుగుట ప్రకృతి శక్తి వలన కాదు. మనము దేవుని యందు జీవించు యునికి కలిగి యున్నాము. మన ఊపిరి హృదయ స్పందనము నిత్యుడగు దేవుని గూర్చి సర్వదా సాక్ష్యమిచ్చుచున్నవి. CChTel 483.2

    ప్రకృతిలో ప్రత్యక్షమైన యెహోవాను గూర్చి మర్మములను గొప్ప ప్రతిభ గల వ్యక్తులు గ్రహింపజాలరు. గొప్ప మేధావులకు అర్థంగాని ప్రశ్నలన దైవ వాక్యము వేయుచున్నది. మనము సమాధానము చెప్పుటకీ ప్రశ్నలు వేయబడుట లేదు. కాని దేవుని గంభీర మర్మములకు మన గమనమును త్రిప్పి మన జ్ఞానము పరిమితమైనదని బోధించుటయే వారి కర్తవ్యము. మన అనదిన జీవితములో మన పరిమిత జ్ఞానమునకు మించిన విషయములనేకముల కలవనియు, దేవుని తీర్పు ఆశయములు గ్రహింప జాలనివనియు వ్యక్తము చేయుటకవి వేయబడచున్నవి. ఆయన జ్ఞానము పరిశోధించనలవి కానిది. 48T 259-261;CChTel 483.3

    ఇక్కడ ప్రారంభమయిన విద్య ఈ జీవితమందు పూర్తి కాదు. అది నిత్యకాలము కొనసాగుచునే యుండును. దానికి అవధి యుండదు. అది సర్వదా ప్రగతి చెందును. దినదినము దేవుని ఆశ్చర్య కరములగు కార్యములు విశ్వమున సృజించి దానిని పోషించుటలో ఆయన శక్తిని గూర్చిన విస్మయ పూరిత నిదర్శనములు నూతన రమ్యతతో మనస్సునకు ఎరుకపడును. సింహాసము నుండి ప్రకాశించు వెలుగులో మర్మములు మటుమాయమగున. ముందెన్నడును అర్థము గాని విషయములు సులభముగా తెలియబడుటను గూర్చి ఆత్మ విస్మయముతో నిండును. 58T 328;CChTel 484.1