Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    స్వాస్థ్యనమును భద్రముగా పంచిపెట్టట

    సత్యమునందున, దైవచిత్తజ్ఞానమునందును అనుభవము గడిరచిన సహొదరుల సాహాయ్యమును, వివేకపూరిత యోచనయు ఉండగనే తల్లి దండ్రులు ప్రార్థన పూర్వకముగా ఆలోచించి తమ స్వాస్థ్యమును పంచి పెట్టవలెను. CChTel 117.3

    వ్యాధిబాధితులు, పేదరికముతో బాధపడు వారు ధనమును సరియగు రీతిగా ఉపయోగించుకొనగాలవారు అగు పిల్లలున్నచో వారినిగూర్చియాలోచించవలెను. కాని వారు లోకభోగలాలసులు, ధనికులు లోకమునకు బానిసలు అయిన పిల్లలైనచో కేవలము తమ బిడ్డలైన హేతువుచేత వారికి ధనమిచ్చు తల్లిదండ్రులు తమను గృహనిర్వాహకులుగా చేసిన ప్రభువుపట్ల పాపము చేయుచున్నవారగుదురు. దేవుని హక్కులు ఆజాద్రత్తగా లెక్కింపదగినవి కావు. CChTel 117.4

    తల్లిదండ్రులు తమ వీలునామాను ఇచ్చివేసిన హేతువు తాము బ్రతికి యుండగా దేవుని సేవ కొరకు ధనమీయకుండ అడ్డగించరాదు. ఇది విస్పష్టముగా గ్రహించవలెను. ఇది వారు చేయవలెను. తాము జీవించియుండగానే మిగిలిన ధనమును విరాళముగా నిచ్చుట వలని సంతృప్తిని, ముందు పొందనైయున్న ఫలములగర్నిన తృప్తిని, వారి తల్లిదం డ్రులు పొందవలెను. దైవ సేవా ప్రగతికి వారు తమ భాగమును నిర్వహించవలెను. తమకు ఆస్తినిచ్చిన ప్రభుని ద్రాక్ష తోటలో చేనయబడవలసిన పని నిమిత్తము వారు ధనమును ఉపయోగించవలెను. 193T 121;CChTel 117.5

    దైవ ధనాగారమునందు చెల్లించక తమ ద్రవ్యమును తమ బిడ్డల నిమత్తము నిల్వచేయువాడు తమ బిడ్డల ఆధ్యాత్మిక అభివృద్దికి ఆపాయము కలిగించుచున్నరు. ఈ జీవిత విషయముల సందర్బముగా అనేకులు పెద్ద తప్పు చేయుచున్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిని తమకు అడ్డుబండగా చేసికొనుట మాత్రమే కాక తమ బిడ్డలకు కూడ దానినడ్డుబండగా చేయుచున్నారు. అందుచే పిల్లలు తొట్రిల్లి నిత్యనాశనమొందెదరు. దేవుడు తమకను గ్రహించిన ధనమును సరిగా ఉపయోగించుట వలన కలుగు మేలును తాము పొందక యితరులను పొందనీయక ధనమును నిల్వచేసి స్వార్థము, దారాశలకు గురియగుదురు. తాము ఉపయోగించలేనంత ద్రవ్యమును సంపాదించుటకు వారు తమ ఆధ్యాత్మిక విషయములను అలక్ష్యముచేసి మత సంబంధమగు అభివృద్థిలో గిట్టబారెదరు. తమ ఆస్తిని తమ బిడ్డలకు విడిచిపెట్టదరు. పదింట తొమ్మిది పాళ్లు అది తమకున్న తమ వారసులకు ఎక్కవ శాసకరముగా పరిణమించును. తల్లిదండ్రుల సంపాదపై ఆనుకొని బిడ్డలు ఈ జీవితమును జయప్రదముగా సాగించలేరు. సాధారణముగా రనైయున్న జీవితమును అసలే పొందలేరు. నిస్సార్థ దయాళుత్వముగల జీవితాదర్శము, ప్రయోజనకరమగు పనిని గూర్చిన జ్ఞానముఇదియే తల్లిదండ్రులు తమ బిడ్డలకీయగల ఉత్తమ స్వాస్థ్యము. ద్రవ్యముయొక్క నిజమైనా విలువ చేయుటకేఅక్కరలను తమ కొరతను అది తీర్చి దేవుని సేవను పురోగమింపజేయుటకే యనియు అట్టి జీవితముద్వారా వారు కనపర్చెదరు. 203T 399;CChTel 118.1