Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 2 - అంత్యకాలము

    మనము అంత్యకాలమందు నివసించుచున్నాము. త్వరితముగా నెరవేరుచున్న కాలసూచనలు క్రీస్తు రాకడ సమీపముగా నున్నదని వ్యక్తము చేయుచున్నవి. మనము నివసించుచున్న యీ దినములు గంభీరమైనవి, ప్రాముఖ్యమైనవి. దేవుని ఆత్మ భూమిపై నుండి క్రమేణ ఉపసంహరించుకొనబడుచున్నది. దైవ కృపను నిర్లక్ష్యము చేయు వారి పైకి తెగుళ్లు, దైవ విమర్శలు వచ్చుచున్నవి. భూమి మీద నీటి మీద సంభవించుచున్న దుర్ఘటనలు సంఘము యొక్క కల్లోలిత స్థితి, యుద్ధాందోళనలు ఇవన్నియు అతి ప్రాముఖ్యమైనవి. ఆద్యతనభావిలో సంభవించుచున్న మహత్తర సంఘటనలను గూర్చి యివి ముందే తెల్పుచున్నవి. దుష్ట శక్తులు తమ పటాలములనొక చోటికి సమీకరించి బలపర్చుచున్నవి. అంతిమ మహా సంగ్రాములు అచిరకాలములో కలుగుచున్నవి. తుది కార్యములపురోగమనము చురుకుగా సాగును. CChTel 58.1

    లోక పరిస్థితులు అపాయకరమైన దినములు మనపై బడుచున్నవని వ్యక్తము చేయచున్నవి. అద్యతన భావిలో జరుగనున్న భయానక సంఘర్షణ సూచనలతో దైనందిక వార్తాపత్రికలు నిండియున్నవి. దోపిడీలు అధికరించుచున్నవి. సమ్మెలు పెచ్చుపెరుగుచున్నవి. ఎక్కడ చూచినను దొంగతనములు, హత్యలే! దయ్యములు పట్టినవారు స్త్రీలను, పురుషులను, పిల్లలను వధించుచున్నారు. మానవులు దుష్టత్వముతో నిండియున్నారు. అవినీతి పెచ్చరిల్లుచున్నది. CChTel 58.2

    న్యాయమును అపమార్గము పట్టించి స్వలాభేచ్ఛతో మానవుల హృదయమందు నింపుటలో అపవాది జయము పొందెను. “న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. నీతి దూరమున నిలుచుచున్నది. సత్యము సంత వీధిలో పడియున్నది. ధర్మము లోపల ప్రవేశింప నేరదు. సత్యము లేకపోయెను.” యోషయా 59:14. మహా నగరములలో ననేకులు పేదరికముతో సతమతమగుచున్నారు. వారికి ఆహారము, గృహము, వస్త్రములు కరువాయెను. అవే నగరములో హృదయము కోరు సుఖములకన్న ఎక్కువ కలవారున్నారు. వారు తమ ద్రవ్యమును నిలువగల గృహ సామాగ్రి కొరకు, శరీర సౌందర్యము కొరకు, లేక అంతకన్న తుచ్ఛమైనవాని కొరకు, ఇంద్రియానందముకొరకు మధ్యపానము, పొగాకు, మనోశక్తులను వివేచనను నాశనము చేసి ఆత్మను అవినీతితో నింపు ఇతర వస్తువుల కొరకు వ్యయము చేసి సుఖముగా జీవించుచున్నారు. ఆకలితో మలమలమాడుచున్న ప్రజానీకముయొక్క ఆక్రందన ధ్వనులు దేవునికి వినబడుచున్నవి. ఇది ఇట్లుండగా నానా విధములుగా బాధించుట వలన మోసగించుట వలన అధిక ధనమును కూడబెట్టుచున్న మానవులను ఆయన కనిపెట్టుచున్నాడు. CChTel 58.3

    అంతస్థుపై అంతస్థుగా ఆకసము వైపుకు లేచుచున్న భవనములను నేను రాత్రి దర్శనములో చూచితిని. అగ్నితో కాల్చబడజాలని భగవంతులని అవి తలంచబడుచున్నవి. అవి నిర్మాతలయు కర్తలయు మహిమార్థమై నిర్మింపడుచున్నవి. ఈ భవనములు చాలా ఎత్తుగా లేచినవి. వానిని నిర్మించుటలో విలువ గల వస్తువులు ఉపయోగించబడినవి. ఈ భవంతుల కర్తలు “మేము దేవునినెట్లు మహిమపర్చగలము?” అని తమ్మును తాము ప్రశ్నించుకొనుటలేదు. వారు దేవుని బొత్తిగా మరచిరి. CChTel 59.1

    ఈ భవంతులు పైకి లేచుకొలది వాని కర్తలు తమ పొరుగువారికి అసూయను పుట్టించి ఆత్మానందమును పొందుటకు తమకు ద్రవ్యమున్నందుకు సగర్వముగా ఆనందించిరి. ఇట్లు వారు వ్యయము చేసిన ద్రవ్యములో ఎక్కువ భాగము బీదలను మొత్తి వారి వద్ద నుండి బలత్కారముగా తీసికొనుట వలన సంపాదించబడినది. పరలోకమందు ప్రతి వ్యాపార విషయమైన వివరణ వ్రాయబడునను సంగతి వారు మరచిరి. ప్రతి అన్యాయ కార్యము, మోసకార్యము అచ్చట దాఖలై యుండును. CChTel 59.2

    పిదప నేను చూచిన దృశ్యము అగ్నిని గూర్చిన ఆందోళన. అగ్నిచే కాల్చబడజాలనివని వారసుకొన్న ఎత్తయినభవనములవంక చూచి మనుజులు “ఇవి సురక్షితముగా నుండు” ననుకొనరి. కీలుతో నిర్మితియైనవానివలె ఆ భవంతులు భస్మీపటలమైనవి. అగ్నిమాపక యంత్రములు చేయగల్గినదేమియు లేకపోయెను. అగ్నిమాపక దళములు తమ యంత్రములను ఉపయోగోఇంచలేకపోయిరి. CChTel 59.3

    ప్రభుని కాలము వచ్చినప్పుడు గర్విష్టులు, పేరాశాపరులులైన మానవులలో పరివర్తన కలుగకయున్నచో రక్షించుటకు బలముగల ఆ హస్తమే నాశనము చేయుటకు బలము కలిగి యుండునని మానవులు గుర్తించెదరని నాకు ఉపదేశించబడెను. ప్రాపంచికమైన ఏ శక్తియు దేవుని హస్తమును అపజాలదు. మనుజులు దేవుని ధర్మశాస్త్రము లెక్కచేయకుండుటచేతను, స్వార్థాపేక్షతో నిండియుండుటచేతను, దేవుడు వారిపైకి ప్రతిఫలము పంపును. ప్రతి కార్యమునకు ఏర్పాటుచేయబడిన సమయము వచ్చినప్పుడు నాశన కాలమందు మానవులను సురక్షితముగా నుంచు భవనములు ఏ సామాగ్రితోను నిర్మించబడజాలవు. CChTel 59.4

    నేటి మానవ దుస్థితికి దారితీసిన కారణములను గ్రహించగలిగినవారు విద్వాంసులలో నేమి, రాజ్యాంగ వేత్తలలో నేమి ఎక్కువ మంది లేరు. అవినీతి, పేదరికము, బిక్షాటనము పెచ్చుపెరుగుచున్న నేరములు. ఈ సమస్యలను ప్రభుత్వ సారధులుల సైతము పరిష్కరింపజాలకున్నారు. వర్తక వ్యాపారమును సుస్థిరస్థాయిలో నుంచుటకు వారు వృథా ప్రయత్నములు చేయుచున్నారు. ఇట్లుగాక మానవులు దైవవాక్య ఉపదేశములకు చెవియొగ్గినచో, తమను తికమకలు పెట్టు సమస్యలకు పరిష్కారము లభించును. CChTel 60.1

    క్రీస్తు రెండవ రాకడకు ముందు ప్రపంచ పరిస్థితిని లేఖనములు వివరించుచున్నవి. దొంగతనము వలన, మోసము వలన ధనము సంపాదించు మనుజులను గూర్చి ఇట్లు లిఖించబడెను. “మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును; అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికివ్వక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరుభూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదరు, అతడు మిమ్మును ఎదిరింపడు.”యాకోబు 5:3-6. CChTel 60.2

    త్వరితముగా నెరవేరుచున్న కాల సూచనల హెచ్చరికలను గమనించువారెవరు? లోకులపై వీని ప్రభావమే? వారి మనఃప్రవత్తులలో ఏ మార్పు గోచరమగును? నోవహు కాలమునాటి ప్రజా బాహుళ్యము యొక్క వైఖరికన్న వీరి వైఖరి బేధించి యుండదు. లోక వ్యవహారములోను వినోదములోను నిమగ్నులై జలప్రళయ కాలమందలి ప్రజలు “జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగకపోయిరి.” మత్తయి 34:39. దేవుడు వారికి హెచ్చరికల నంపెను కాని వానిని వారు త్రోసిపుచ్చిరి. దేవుని హెచ్చరికా స్వరమును సరకుచేయక నేటి ప్రపంచము కూడా నిత్యనాశనమునకు పరుగిడుచున్నది. యుద్దాసక్తి ప్రపంచమందు చెలరేగుచున్నది. దానియేలు 11 అధ్యాయమందలి ప్రవచనము దాదాపు సం పూర్ణముగా నెరవేరినట్లే. ప్రవచనమందు చిత్రించబడిన శ్రమా ఘట్టములు త్వరలో నెరవేరును. CChTel 60.3

    “ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగాచేసే కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.. .. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. CChTel 61.1

    శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి.. .. తంబురల సంతోషనాదము నిలిచి పోయెను. ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను.” యెషయా 24:1-8. CChTel 61.2

    “అహా యెహోవా దినము వచ్చెనె. అది ఎంత భయంకరమైన దినము. అది ప్రళయమువలెనే సర్వశక్తుని వద్ద నుండి వచ్చును.” యోవేలు 1:15. “నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి. కొండలన్నియు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను. ఆకాశ పక్షులన్నియు ఎగిరిపోయి యుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులో పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేకఆయన యెదుట నుండకుండ పడగొట్టబడి యుండెను.” ఇర్మియా 4:23-26. CChTel 61.3

    “అయ్యో, యెంత భయంకరమైన దినము; అట్టి దినము మరియొకటి రాదు; అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చుదినము; అయినను వారు దానిలో పడకుండ రక్షింపబడుదురు.” ఇర్మియా 30:7. CChTel 61.4

    దేవునికి వ్యతిరేకముగా అపవాది పక్షమున లోకవాసులందరును చేరలేదు. అందరును స్వామి ద్రోహులు కాలేదు. అల్పసంఖ్యాక విశ్వాసులు దేవుని పట్ల స్వామిభక్తి గలిగి యున్నారు. ఏలయనగా యోహానిట్లు వ్రాసెను; “దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.” ప్రకటన 14:12. CChTel 61.5

    అనతికాలములో దేవుని సేవించువారికిని, సేవింపని వారికిని మధ్య ఘోర యుద్ధము జరుగును. త్వరలో రాలిపోగలదంతయు రాల్పబడును. రాల్పశక్యముగానిది నిలిచియుండవచ్చును. CChTel 61.6

    సైతానుడు బైబిలును బహు శ్రద్ధగా పఠించువాడు. తనకున్న సమయము చాల స్వల్పమని యాతనికి ఎరుకయే. ఆ కారణముగా ఈ భూమిపై దైవ కార్యమునకు ప్రతిక్రియ చేయుటకు సాతానుడు సర్వేసర్వత్ర ప్రయత్నించును. క్రితము జరిగిన హింసలు తిరిగి ప్రారంభమగుటతో దైవ మహిమ మిళితమగును. ఆ తరి భూమిపైనివసించు దైవ జనుల అనుభవములను గూర్చి ఊహింపజాలము. దైవ సింహాసనము నుండి బయల్వెడలు వెలుగుబాటలో వారు నడిచెదరు. పరలోక భూలోకములకు మధ్య సర్వధా దూతల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరము లుండును. దుష్టదూతలచే ఆవరింపబడి సాతానుడు దేవుడనని చెప్పుకొనుచు సాధ్యమైనచో ఎన్నుకో బడిన వారిని సహితము మోసగించుటకు అన్నిరకముల సూచక క్రియలను చేయును. తమ క్షేమము నిమిత్తము దైవ ప్రజల సూచకక్రియలపై నాధారపడరాదు. కారణమేమనగా అట్టి సూచక క్రియలనే సాతానుడు కూడా అనుసరించును. దేవునిచే పరిశోధించి పరీక్షించబడిన ప్రజలు నిర్గమా 31:12`18లో సూచించబడిన గురుతును అనుసిరించటయందు శక్తిని కనుగొందురు. “ఇట్లు వ్రాయబడెను” అను జీవ వాక్యముపై వారు ఆధారపడవలెను. ఈ పునాదిపైనే వారు సురక్షితముగా నిలువగలరు. దేవునితో తమ నిబంధనను భంగము గావించుకొన్న ప్రజలానాడు దేవుడును నిరీక్షిణయులేని వారగుదురు. CChTel 62.1

    దేవుని నారాధించువారు నాల్గవ యాజ్ఞకు వారు చూపు గౌరవమును బట్టి ప్రత్యేకముగా గుర్తించబడుదురు. ఏలయనగా దేవుని సృజనాశక్తికిని మానవుని వినయ విధేయతపై ఆయనకు గల హక్కునకును నాల్గవ యాజ్ఞయే సూచన. సృష్టికర్త స్మారక చిహ్నమును చిన్నాభిన్నము చేయుటకు పూనుకొని రోమామత సిద్ధాంతమును ఘనపరచుట ద్వారా దుర్మార్గులు గుర్తింపబడుతురు. ఈ విధి ఫలితముగా దేవుని యాజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనువారు మృగమును దాని ప్రతిమ ఆరాధించి దాని ముద్రను వేసకొనువారు అను రెండు గొప్ప వర్ణములుగా క్రైస్తవలలోకమంతయు విడదీయబడును”. కొద్ది వారుగాని గొప్పవారుగాని, ధనికులు గాని దరిద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని” అందరు ను మృగము యొక్క ముద్ర వేయించుకొనవలెనని ప్రజలను బలత్కారము చేయుటలో సంఘము రాష్ట్రములు ఏకస్థమైనప్పటికిని దైవ ప్రజలు ఆ ముద్రను వేయించుకొనరు. ప్రకటన 13:16. “ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకు ను లోబడక వాటిని జయించువారు దేవుని వీణెలు గలవారై ఆ స్పటికపు సముద్రమునొద్ద నిలిచి ” గొరెపిల్ల యొక్కయు మోషేయోక్కయు పాట పద్మను ద్వీప ప్రవక్త తిలకించెను. ప్రకటన 15:2. CChTel 62.2

    దైవ ప్రజలకు భయంకర పరిక్షలు పరిశోధనలు ముందున్నవి. భూమియొక్క యీ దిక్కునుండి ఆ దిక్కునకు యుద్ధాసక్తి ప్రజలను రెచ్చగొట్టుచున్నది. కాని ఏ రాజ్యకాలమందు ను సంభవించని శ్రమ కాలము వచ్చుచున్నది. CChTel 63.1

    ఆ సమయమున దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు అచంచలముగా నిలువబడెదరు. సైతానుడును తన పరివారమును వారిని నాశనము చేయజాలరుబీ ఏలయనగా బలములో నదికులగు దేవదూతలు వారిని కాపడెదరు. 19T 11-17. CChTel 63.2