Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “నేను మిమ్మును ప్రేమించినట్లు ఒకనినొకడు ప్రేమించండి”

    మానవ రక్షణ కార్యములో దేవుడు తన భాగమును నిర్వహించెను. ఇక ఆయన ఇప్పుడు సంఘ సహకారము నపేక్షించుచున్నాడు. ఒక ప్రక్క క్రీస్తు రక్తము, సత్యవాక్యము, పరిశుద్ధాత్మ కలవు. మరియొక ప్రక్క నశించుచున్న ఆత్మలు కలవు. పరలోకము ఏర్పాటు చేసిన ఆశీర్వాదములనుఅంగీకరించుటకు మానవులను సమకూర్చుటలో నొక భాగము క్రీస్తు యొక్క ప్రతి యనుచరునికి గలదు. ఈ కార్యమును మనము నిర్వహించితిమేమో ఆత్మ పరీక్ష చేసికొందము. మన ఉద్దేశములను మన జీవితములలో ప్రతి కార్యమును పరీక్షించుకొందము. CChTel 171.2

    స్మృతిమందిరములో అసహ్యమైన అనేక పటములు వ్రేలాడుటలేదా?క్రీస్తు క్షమాపణ మీకు తరచుగా నవసరమయ్యెను. అనుక్షణము మీరాయన ప్రేమ కనికరములపై నాధారపడియున్నారు. అయినను క్రీస్తు మీకు చూపిన మనస్సును మీరు ఇతరులకు చూపలేకున్నారుగదా? నిషిద్ద మార్గములలో ప్రవేశించుటకు సాహసించుచున్న వానిని చూచినప్పుడు వాని కొరకు మీరు హృదయ భారము కలిగి యుండరా? అతనిని ప్రేమతో హెచ్చరించితిరా? అతని కొరకు దుఃఖించి యాతనితో కలిసి ప్రార్థించితిరా? మీరాతని ప్రేమించుచున్నార నియు,నతనిని రక్షింప కాంక్షించుచున్నారనియు, దయారసముట్టిపడు పలుకులద్వారాను, క్రియలద్వారాను చూపించితిరా?CChTel 171.3

    స్వభావ సిద్దముగా కలిగిన దౌర్భల్యములతోను,చెడ్డ అలవాటులతోను సతమతమగుచున్నవారితో మీరు స్నేహించినపుడు సహాయము చేయ గలిగి యుండియు వారిని మీబాధలు మీరు పడుడని ఒంటరిగా విడచితిరా? కఠినముగా శోధింపబడిన వీరికి సానుభూతి చూపి సాతానుఉచ్చులలోనికి ఆకర్షించుటకు ప్రపంచము సిద్ధముగా నుండగావారినిద్దరిని విడిచి మీరు సాగిపోలేదా? కయీనువలె”నా తమ్మునికి నేను కావలి వాడనా?” (ఆది 4:9) అనుటకు, మీరు చెప్పుటకు సిద్ధముగా లేరా?CChTel 172.1

    మీ జీవిత కర్తవ్యమును సంఘాధ్యక్షుడెట్లు పరిగణించ వలెను? సత్యమార్గము నుండి తొలగిపోయిన యెడల మీరు ప్రదర్శించు నిర్లక్ష్య స్వభావమును గూర్చి తన రక్తము పెట్టి కొన్నందును ప్రతి ఆత్మను ప్రశస్తముగా నెంచు ఆ ప్రభువు ఏమి తలంచును? మీరు వారిని విడిచినట్లే ప్రతి ఆత్మను ప్రశస్తముగా నెంచు ఆ ప్రభువుఏమి తలంచును?మీరు వారిని విడిచినట్లే, మిమ్ము నాయన త్యజించునని మీరు భయపడరా? ప్రభువు గృహమునకు నిజమైన కావలివాడు ఆయన ప్రతి నిర్తక్ష్య స్వభావమును గుర్తించునని జ్ఞాపకముంచు కొనుడి. CChTel 172.2

    గతమున నిర్తక్ష్యము చేసిన కార్యములను చక్క జేయుటకు సమయము మించిపోలేదు. మొదటి పట్టుదల, ఆ మొదటి ప్రేమ పనర్జీవము పొందవలెను. మీరు బయటికి నెట్టివేసిన వారిని అన్వేషించి మీరొనరించిన గాయములకు క్షమాపణద్వారా కట్లు కట్టుడి. దయానిలయుని, ప్రేమా హృదయుని, హత్తుకొని దైవ కారుణ్య ప్రవాహమును మీ హృదయములలోనికి ఆ మీదట ఇతరుల హృదయములలోనికి ప్రవమింపనీయుడి. మనము మన సహ మానవులను ముఖ్యముగా క్రీస్తునందు మనకు సోదరులైన వారిని చూడవలసిన విధమునకు, తన జీవితమందు యేసు కనపరచిన కృపా కనికరములు మాదిరిగా నుండవలెను. CChTel 172.3

    జీవిత బృహత్తర సమరమునందు అనేకులు మూర్చిల్లి అధైర్యము చెందిరి. సంతోషమును, ధైర్యమును కలుగజేయు ఒక మాట వారికి బలము నిచ్చి జయము కూర్చియుండెడిదే. కఠినముగాను,నిర్లక్ష్యముగాను, నిర్దయగాను, విమర్శాత్మకముగాను ఎన్నడు ప్రవర్తింపకుడి. ధైర్యపరచి నిరీక్షణ కలిగించు మాటలు చెప్పుటకు కలిగిన తరుణము నెన్నడును కోల్పోకుడి. మనము పలుకు దయా వాక్కులు ఏదో భారమును తగ్గించుటకు మనము చేయు క్రీస్తును పోలిన ప్రయత్నములు దీని ప్రభావమెంత దీర్ఘకాలికమైనదో మనము చెప్ప లేము. సాత్వికము, సాధుత్వము, ప్రేమ ఈ స్వభావము ద్వారానే నేరస్తులు తిరిగి సన్మార్గమున ప్రవేశించగలరు. 35T 610-613;CChTel 172.4